breaking news
Hindu youth
-
Bangladesh: మరో హిందూ యువకుని దారుణ హత్య
ఢాకా: బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ వేళ మౌల్వీబజార్ జిల్లాలో ఒక హిందూ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. చంపారా టీ గార్డెన్ కార్మికుడైన 28 ఏళ్ల రతన్ శుభోకర్ పోలీసులకు విగతజీవిగా కనిపించాడు. అతని కాళ్లు, చేతులు కట్టేసి ఉండటంతో పాటు శరీరంపై తీవ్ర గాయాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. గురువారం ఓటింగ్ జరగడానికి కొద్దిసేపటి ముందే ఈ దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.స్థానిక పత్రిక 'డైలీ స్టార్' నివేదిక ప్రకారం రతన్ శుభోకర్ మృతదేహం రక్తంతో తడిసి ఉండటాన్ని గమనించిన కార్మికులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. మృతుడి సోదరుడు లక్ష్మణ్ కర్ మాట్లాడుతూ, మంగళవారం రాత్రి నుండి రతన్ కనిపించకుండా పోయాడని, తరువాత తోటలో శవమై కనిపించాడని తెలిపారు. ఈ హత్యకు గల కారణాలు తమకు తెలియవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించామని, నిందితులను గుర్తించేందుకు విచారణ కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.బంగ్లాదేశ్‌లో ఎన్నికల వేళ మైనారిటీల భద్రత ప్రశ్నార్థకంగా మారుతున్నది. గత జనవరి నెలలోనే జైలు కస్టడీలో దాదాపు 15 మంది మరణించారని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ నివేదించింది. మరణించిన వారిలో అవామీ లీగ్ సీనేయర్ నేత రమేష్ చంద్ర సేన్, ప్రముఖ సంగీత విద్వాంసుడు ప్రళయ్ చకి తదితరులు ఉన్నారు. డిసెంబర్ 2024లో విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హదీ హత్య తర్వాత దేశవ్యాప్తంగా చెలరేగిన అశాంతిలో పలువురు హిందూ యువకులు ప్రాణాలు కోల్పోయారు. తాత్కాలిక ప్రభుత్వం శాంతిభద్రతల గురించి హామీలు ఇస్తున్నప్పటికీ, మతోన్మాద శక్తుల ప్రాబల్యం పెరుగుతుండటంపై మైనారిటీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. -
పాక్ ఆర్మీలో తొలి హిందూ యువకుడు
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ ఆర్మీలో తొలిసారిగా మైనారిటీ వర్గానికి చెందిన ఓ హిందూ యువకుడు నియమితులయ్యారు. సైన్యంలో రాహుల్ దేవ్‌ను జనరల్ డ్యూటీ పైలట్ అధికారిగా నియమించామని పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ (పీఎఫ్ఏ) ట్వీట్ చేసింది. రాహుల్ స్వస్థలం సింథ్ ప్రావిన్స్‌లోని థర్పర్కర్. రాహుల్ ఫోటోను పీఏఎఫ్ షేర్ చేస్తూ కోవిడ్-19 సంక్లిష్ట పరిస్ధితుల్లో గుడ్‌న్యూస్‌ను పంచుతున్నాం..థర్పక్కర్ అనే మారుమూల గ్రామం నుంచి రాహుల్‌దేవ్ ఆర్మీలో జీడీ పైలట్‌గా ఎంపికయ్యారని ట్వీట్ చేసింది. పాకిస్తాన్ చరిత్రలోనే తొలిసారిగా పీఏఎఫ్‌లో ఓ హిందూ యువకుడు జనరల్ డ్యూటీ పైలట్ అధికారిగా నియమితులయ్యారని పాక్ అధికారిక రేడియో బుధవారం ప్రకటించింది. చదవండి : కరోనా కాలంలో పాక్ కుట్రలు -
‘లవ్ జీహాద్’పై అప్రమత్తంగా ఉండండి!
మధుర: ‘లవ్ జీహాద్’పై అప్రమత్తంగా ఉండాలని హిందూ యువతకు బీజేపీ సూచించింది. ప్రేమ పేరుతో హిందూ యువతులను ముస్లిం మతంలోకి మార్చేందుకు ముస్లిం యువకులు కుట్రపన్నుతున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ‘మెజారిటీ వర్గానికి చెందిన యువతుల మతాలను మార్చేందుకు మైనారిటీ యువకులు లెసైన్స్ పొందారా?’ అని బీజేపీ ఉత్తరప్రదేశ్ శాఖ అధ్యక్షుడు లక్ష్మీకాంత్ బాజ్‌పేయి ప్రశ్నించారు. మైనారిటీ యువకులు ఇలాంటి చర్యలకు పాల్పడుతుంటే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడంలేదన్నారు. ప్రభుత్వమే లవ్‌జీహాద్‌ను ప్రోత్సహిస్తోందని ఆయన ఆరోపించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కమిటీ సమావేశంలో లక్ష్మీకాంత్ బాజ్‌పేయి శనివారం ప్రసంగించారు.


