breaking news
Hindu minority
-
35 రోజుల్లో 11 మంది హిందువుల దారుణ హత్య
ఢాకా: బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై తీవ్రమైన హింస కొనసాగుతోంది. యూనస్నేతృత్వంలోని ప్రభుత్వం ఇవి మతపరమైన దాడులు, హత్యలు కాదని పదేపదే చెబుతున్నప్పటికీ, జరుగుతున్నసంఘటనలు, వరుస హత్యలు తీవ్ర ఆందోళన రేపుతున్నాయి. ఈ పరిణామాలు దేశంలో మైనారిటీల భద్రతకు శాంతిభద్రతలు ప్రమాదకరంగా గోచరిస్తున్నాయి.బంగ్లాదేశంలో జరుగుతున్ హింసను కేవలం యాదృచ్ఛిక సంఘటనగానో లేదా వేర్వేరు నేరాలుగానో కొట్టిపారేయడం కష్టమవుతోందంటున్నారు విశ్లేషకులు. కేవలం ఒక నెలలోనే దేశవ్యాప్తంగా కనీసం 11 మంది హిందువులు హత్యకు గురయ్యారు, వీరిలో చాలామంది దారుణమైన పరిస్థితుల్లో చనిపోయారు. మాజీ ప్రధాని షేక్ హసీనా పదవీచ్యుతి తర్వాత, ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఆధ్వర్యంలో 35 రోజుల వ్యవధిలో ఇన్ని హత్యలు జరిగాయి. ఈ మరణాలు, మూకదాడులు, కాల్పులు , గుంపు దాడుల పరంపరను వెల్లడిస్తున్నాయి. ఈ వరుస ఘటనలు మైనారిటీలలో విస్తృత భయాలను రేపడంతోపాటు, ప్రభుత్వ సామర్థ్యం, ఉద్దేశాలపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది.2026 జనవరి 5, ఒకే రోజులో రెండు హత్యలుజనవరి 5న, జెస్సోర్ జిల్లాలో హిందూ వార్తాపత్రిక సంపాదకుడు రాణా కాంతి బైరాగిని కాల్చి చంపారు. కొన్ని గంటల్లోనే ఢాకా సమీపంలోని నర్సింగ్డి జిల్లాలో హిందూ కిరాణా వ్యాపారి మణి చక్రవర్తిపై దాడి. ఇద్దరినీ గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. ఈ హత్యలతో కేవలం 18 రోజుల్లోనే హిందువుల హత్యల సంఖ్య ఐదు, ఆరుకు చేరింది.ఇదీ చదవండి: 5th ఫెయిల్, రూ.12తో మొదలై రూ.12,000 కోట్ల సామ్రాజ్యంజనవరి 3న మూక దాడి, సజీవ దహనంషరియత్పూర్ జిల్లాకు చెందిన హిందూ వ్యాపారవేత్త ఖోకన్ చంద్ర దాస్, నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఒక మూక దాడిలో తీవ్రంగా గాయపడి జనవరి 3న మరణించాడు. అతణ్ని కత్తితో పొడిచి, పెట్రోల్ పోసి నిప్పంటించారు. అతను ఒక చెరువులోకి దూకి తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, తీవ్రమైన కాలిన గాయాలతో, ఢాకాలో మరణించాడు.డిసెంబర్ 29, 2025: సహోద్యోగి కాల్చివేతఅన్సార్ బాహినిలో హిందూ సభ్యుడైన బజేంద్ర బిస్వాస్‌ను మైమెన్సింగ్ జిల్లాలోని ఒక వస్త్ర కర్మాగారంలో అతని సహోద్యోగి కాల్చి చంపాడు. దీనిని పోలీసులు మొదటగా అనుకోకుండా జరిగి ఉండవచ్చని పేర్కొంది. కాల్పులు జరిపిన వ్యక్తిని అరెస్టు చేశారు, కానీ ఈ హత్య మైనారిటీ వర్గాలలో పెరుగుతున్న ఆందోళనను మరింత పెంచింది.డిసెంబర్ 24, 2025: మాబ్ లించింగ్అమృత్ మండల్‌ను రాజ్‌బరి జిల్లాలో ఒక గుంపు కొట్టి చంపింది. హత్యకు మతపరమైన కోణం లేదని అధికారులు పేర్కొన్నారు, కానీ కొన్ని రోజులకే మరొక మూక దాడి జరిగడంతో మైనారిటీ భయాలు మరింత తీవ్రమయ్యాయి.డిసెంబర్ 18, 2025: ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన మూక దాడిమైమెన్సింగ్లో 27 ఏళ్ల హిందూ వస్త్ర కార్మికుడు దీపు చంద్ర దాస్ హత్య ఒక మలుపు తిరిగింది. దాస్‌ను ఇస్లామిక్ గుంపు కొట్టి చంపింది, అతని శరీరాన్ని హైవేకి వేలాడదీసి నిప్పంటించింది. దైవదూషణ జరిగిందనే అస్పష్టమైన ఆరోపణలు ఉన్నప్పటికీ, దర్యాప్తు అధికారులు తరువాత హత్య ముందస్తు ప్రణాళికతో జరిగిందని కనుగొన్నారు.ఇదీ చదవండి: సీనియర్ వేధింపులకు బెస్ట్ ఎక్సలెన్స్ అవార్డు వైద్యురాలి బలిడిసెంబర్ 12న, 18 ఏళ్ల హిందూ ఆటోరిక్షా డ్రైవర్ శాంటో చంద్ర దాస్, కుమిల్లాలో గొంతు కోసి హత్య చేశారు. డిసెంబర్ 7న, 1971 విముక్తి యుద్ధ అనుభవజ్ఞుడు జోగేష్ చంద్ర రాయ్, అతని భార్య సుబోర్నా రాయ్‌లను రంగ్‌పూర్‌లో వారింట్లోనే గొంతు కోసి చంపేశారు. డిసెంబర్ 2న ఇద్దరు హిందువులు బంగారు వ్యాపారి ప్రంతోష్ కోర్మోకర్ను నర్సింగ్డిలో కాల్చి చంపగా, ఉత్పోల్ సర్కార్‌ను ఫరీద్‌పూర్‌లో నరికి చంపారు.మైనారిటీ హత్యలతో పాటు, బంగ్లాదేశ్‌లో శాంతిభద్రతలు తీవ్రంగా క్షీణించాయి ఒక నివేదిక ప్రకారం 2025లోనే 197 మూక హత్యలు, 2024లో 293 హత్యలు జరిగాయి. మానవ హక్కుల సంఘాలు దీనిపై హెచ్చరికలు జారీ చేశాయి. వాషింగ్టన్ డీసీకి చెందిన హిందుస్ ఫర్ హ్యూమన్ రైట్స్ గ్రూప్ ఢాకాను మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, మైనారిటీ భద్రతకు హామీ ఇవ్వాలని కోరింది.అయినప్పటికీ యూనస్ ప్రభుత్వం పెద్దగా స్పందించలేదు. దీపు చంద్ర దాస్ హత్యపై అంతర్జాతీయంగా ఆగ్రహావేశాలు రగలడంతో తాత్కాలిక ప్రభుత్వం సంతాపాన్ని వ్యక్తం చేసింది.భారతదేశం ఖండనభారతదేశం దీపు చంద్ర హత్యను తీవ్రంగా ఖండించింది. "బంగ్లాదేశ్‌లో హిందువులు, క్రైస్తవులు, బౌద్ధులు సహా మైనారిటీలపై కొనసాగుతున్న శత్రుత్వం , దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. మైమెన్సింగ్లో ఇటీవల జరిగిన హిందూ యువకుడి దారుణ హత్యను మేము ఖండిస్తున్నామనీ, బాధితులను న్యాయం చేయాలని MEA ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. -
కీలక బిల్లును ఆమోదించిన పాకిస్థాన్
ఇస్లామాబాద్: హిందూ మహిళల హక్కుల కాపాడేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం కీలక బిల్లును ఆమోదించింది. హిందూ మైనారీలకు వివాహ నమోదు హక్కు కల్పించే బిల్లుకు పాకిస్థాన్ పార్లమెంట్ దిగువ సభ మంగళవారం ఆమోదం తెలిపింది. పది నెలల పాటు చర్చోపచర్చలు జరిపిన తర్వాత బిల్లుకు ఆమోదముద్ర వేసింది. 19 కోట్లు జనాభా కలిగిన పాకిస్థాన్ లో దాదాపు 1.6 శాతం మంది హిందువులు ఉన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి హిందువుల వివాహ నమోదుకు చట్టబద్దమైన ప్రక్రియ లేదు. దీంతో హిందూ మహిళలను లక్ష్యంగా చేసుకుని అపహరణలు, బలవంతపు మతమార్పిడిలు, అత్యాచారాలకు పాల్పడుతున్నారని హక్కుల కార్యకర్తలు ఆందోళనలు వ్యక్తం చేశారు. వివాహ నమోదు హక్కు లేకపోవడంతో హిందూ మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. చట్టబద్దంగా వివాహం నమోదు చేసుకునే హక్కు లేకపోవడంతో హిందూ మహిళలకు కోర్టుల్లో న్యాయం జరగడం లేదని అంటున్నారు. ప్రభుత్వం తాజాగా ఆమోదించిన వివాహ నమోదు చట్టంతో హిందూ మహిళలకు గొప్ప మేలు జరుగుతుందని మానవ హక్కుల సంఘం అధ్యక్షురాలు జోహ్రా యూసఫ్ అన్నారు. ఈ బిల్లు ప్రకారం హిందువులు పెళ్లి చేసుకోవడానికి కనీస వయస్సు 18గా నిర్ధారించారు. ఇతర మతాల్లో పురుషులు 18, మహిళలకు 16 ఏళ్లు నిండగానే పెళ్లి చేసుకునేందుకు అర్హులవుతారు. -
చట్టాలున్నాయి... సమానత్వమే లేదు!
అసమానం గోవాలో హిందూ మతానికి వర్తించే ఒక చట్టం ఉంది. ముప్పై ఏళ్లు వచ్చాక కూడా తన భార్య మగ పిల్లవాడిని కనకపోతే ఆ భర్త ఇంకో పెళ్లి చేసుకోవచ్చు! పురుషాధిక్య సమాజంలోని పక్షపాత చట్టాలకు ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే. ఐక్యరాజ్య సమితి ఇటీవలే ఇలాంటి చట్టాల జాబితాతో ఒక నివేదిక విడుదల చేసింది. ఇవన్నీ కూడా మహిళపై పురుషుని ఆధిక్యాన్ని, అధికారాన్ని సమర్థించేవిగా ఉండడం విశేషం. హిందూ వారసత్వ చట్టం: పెళ్లి, విడాకులు, వారసత్వం, పిల్లల సంరక్షణకు సంబంధించి భారతదేశంలో ఒక్కో మతానికి ఒక్కోరకమైన చట్టం ఉంది. హిందువుల విషయానికి వస్తే, ఒక మహిళ కనుక వీలునామా రాయకుండా చనిపోతే... భర్తగానీ, పిల్లలు గానీ లేనప్పుడు ఆమె ఆస్తి ఆమె అత్తమామలకు సంక్రమిస్తుంది! పార్శీల వారసత్వ చట్టం: పార్శీ చట్టం ప్రకారం పార్శీలు ఇతర మతస్థులను వివాహం ఆడడం నిషిద్ధం. ఒకవేళ వివాహం చేసుకున్నప్పటికీ పార్శీ మతస్థురాలు కాని భార్యకు, లేదా వితంతువుకు భర్త ఆస్తి సంక్రమించదు. అలాగే పార్శీ మహిళకు పార్శీ మతస్థుడు కాని భర్త వల్ల కలిగిన సంతానాన్ని పార్శీల వారసత్వ చట్టం పార్శీలుగా పరిగణించదు. బాల్య వివాహాల నిషేధ చట్టం: ఈ చట్టం ప్రకారం బాల్య వివాహాలు నిషిద్ధమే కానీ, అలా జరిగిన పెళ్లి చట్ట విరుద్ధమా కాదా అన్నది చట్టంలో నిర్దిష్టంగా లేదు. బహుశా ఇందుకే ఈ దేశంలో నేటికీ బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయని సమితి వ్యాఖ్యానించింది. సమ్మతి వయసు: బాల్య వివాహాలు చట్ట విరుద్ధం కాకపోవడంతో భర్త తన మైనరు భార్యతో కలవడం చట్ట సమ్మతమే అవుతోంది! పెపైచ్చు దాంపత్య అత్యాచారం మన దేశంలో నేరం కూడా కాదు. విడిపోయాక అత్యాచారం: విడిపోయిన భార్యపై అత్యాచారం చేస్తే పడే శిక్ష, మూమూలు అత్యాచారంలో పడే శిక్ష కన్నా తక్కువ! అంటే మొదటి కేసులో 2 నుంచి 7 ఏళ్ల వరకు మాత్రమే శిక్ష పడే అవకాశం ఉంటే, రెండో కేసులో ఏడేళ్ల శిక్ష లేదా జీవితఖైదు పడొచ్చు. వివాహ వయఃపరిమితి: చట్ట ప్రకారం అబ్బాయి పెళ్లి వయసు 21 ఏళ్ళు, అమ్మాయి పెళ్లి వయసు 18 ఏళ్ళు. భార్య ఎప్పుడూ భర్త కన్నా వయసులో చిన్నదిగానే ఉండాలన్న పురుషాధిక్య సమాజపు పోకడకు అద్దం పట్టే నిబంధన ఇది. హిందూ మైనారిటీ, గార్డియన్షిప్ యాక్టు: ఈ చట్టం ప్రకారం భర్తకు సమానంగా భార్య.. పిల్లల సంరక్షకురాలు కాదు! ఐదేళ్ల లోపు పిల్లలకు తల్లి సంరక్షకురాలే అయినప్పటికీ మొత్తంగా తండ్రిని మాత్రమే పిల్లల సహజ సిద్ధమైన సంరక్షకుడిగా చట్టం గుర్తిస్తోంది. సమాజంలో స్త్రీ ద్వితీయశ్రేణి పౌరురాలిగానే మిగిలిపోయిందనీ, చట్ట పరంగా అమెకు మేలు కన్నా కీడే ఎక్కువగా జరుగుతోందని చెప్పడానికి ఇవి కొన్ని అంశాలు మాత్రమే. దేశంలోని పౌరులందరికీ మతాతీతంగా ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తామని బి.జె.పి చాలాకాలంగా అంటోంది. ఇప్పుడు ఆ పార్టీనే అధికారంలో ఉంది కాబట్టి అలాంటి ప్రయత్నం ఏదైనా జరిగితే వివాహిత హక్కులకు భరోసా ఉంటుంది.


