breaking news
Higher interest
-
తక్కువ టెన్యూర్.. ఎక్కువ వడ్డీ!
తక్కువ టెన్యూర్ ఉండి ఎక్కువ వడ్డీ వచ్చే ఫిక్స్డ్ డిపాజిట్ పథకం కోసం చూస్తున్నారా.. మీలాంటివారి కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఎస్బీఐ సర్వోత్తం ఎఫ్డీ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో 1 లేదా 2 సంవత్సరాలు పెట్టుబడి పెట్టాలి. ఇతర పథకాలతో పోలిస్తే, ఇది అధిక వడ్డీని అందిస్తుంది. రెండేళ్ల టెన్యూర్ ఈ సర్వోత్తం ఎఫ్డీ పథకంపై ఎస్బీఐ 7.4 శాతం వడ్డీని అందిస్తోంది. ఈ వడ్డీ పీపీఎఫ్, ఎన్ఎస్సీ, పోస్ట్ ఆఫీస్ స్కీమ్ వంటి ఇతర పెట్టుబడి ఎంపికల కంటే ఎక్కువ. ఇది కాకుండా ఈ పథకం అతిపెద్ద ఫీచర్ ఏంటంటే.. దాని కాలవ్యవధి. ఈ పథకం టెన్యూర్ 1 లేదా 2 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. 2 సంవత్సరాల ఎఫ్డీపై సాధారణ ప్రజలకు 7.4 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.90 శాతం వడ్డీని ఎస్బీఐ అందిస్తోంది. ఏడాది టెన్యూర్ ఎస్బీఐ సర్వోత్తం ఎఫ్డీ పథకంపై 1 సంవత్సరం కాలపరిమితితో సాధారణ ప్రజలకు 7.10 శాతం వడ్డీని అందిస్తోంది. అలాగే సీనియర్ సిటిజన్లు 7.60 శాతం వడ్డీని పొందవచ్చు. పెట్టుబడి పరిమితి ఎస్బీఐ సర్వోత్తం ఫిక్స్డ్ డిపాజిట్ స్కీంలో ఇన్వెస్టర్ కనీసం రూ.15 లక్షలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. గరిష్టంగా రూ.2 కోట్ల పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో డిపాజిట్‌దారు 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాల కాలపరిమితిని ఎంచుకోవచ్చు. పదవీ విరమణ చేసిన వారికి ఎస్బీఐ సర్వోత్తం ఫిక్స్డ్ డిపాజిట్ పథకం ఉత్తమమైనదని చెప్పవచ్చు. పీపీఎఫ్ నుండి డబ్బు పొందినప్పుడు ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. అయితే ఈ పథకంలో రూ.2 కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడి పెడితే వచ్చే వడ్డీ 0.05 శాతం తగ్గుతుంది. (Disclaimer: ఈ సమాచారం పాఠకుల అవగాహన కోసం మాత్రమేనని గమనించగలరు. ఏదైనా ఎఫ్డీ పథకంలో పెట్టుబడి పెట్టే ముందు దాని క్షుణ్ణంగా తెలుసుకోవడం అవసరం) -
సీనియర్ సిటిజన్లకు ఐసీఐసీఐ శుభవార్త
సాక్షి, ముంబై : ప్రైవేటు రంగ దిగ్గజ బ్యాంకు ఐసీఐసీఐ బ్యాంకు వృద్ధులకు శుభవార్త చెప్పింది. సీనియర్ సిటిజన్ల కోసం 'ఐసీఐసీఐ బ్యాంక్ గోల్డెన్ ఇయర్స్ ఎఫ్డీ' అనే ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) పథకాన్ని గురువారం ప్రవేశపెట్టింది.ఈ డిపాజిట్లపై అదనంగా 0.80 శాతం వడ్డీ చెల్లించనున్నట్టు ప్రకటించింది. ఇప్పటివరకు సాధారణ డిపాజిట్‌దారుల కంటే సీనియర్ సిటిజన్లకు చెల్లిస్తున్నది 0.50 శాతం అధికం మాత్రమే. 5 నుంచి 10 ఏళ్ల కాలపరిమితితో రూ.2 కోట్లలోపు ఫిక్స్డ్ డిపాజిట్లు చేసే సీనియర్ సిటిజన్లకు వార్షికంగా 6.55 శాతం వడ్డీ లభిస్తుందని ఐసీఐసీఐ బ్యాంకు వెల్లడించింది. ఈ పథకం సెప్టెంబర్ 30 వరకే అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీయే వృద్ధులకు ప్రధాన ఆదాయవనరని తెలుసు. దీన్ని దృష్టిలో ఉంచుకునే వారిమీద ఉన్న గౌరవంతో కొత్త పథకం ద్వారా వారికి అధిక వడ్డీని ఆఫర్ చేస్తున్నామని ఐసీఐసీఐ లయబిలిటీస్ గ్రూప్ అధిపతి ప్రణవ్ మిశ్రా తెలిపారు. (రుణాలపై వడ్డీరేట్లు తగ్గించిన ఎస్బీఐ) సీనియర్ సిటిజన్స్ ప్రత్యేక ఎఫ్డి పథకం ఐదు విషయాలు ఈ పథకం 2020 మే 20 నుండి సెప్టెంబర్ 30 వరకు అందుబాటులో వుంటుంది. ఇది ఒకే డిపాజిట్ మొత్తానికి , కాలానికి సాధారణ ప్రజలకు వర్తించే దానికంటే 80 బేసిస్ పాయింట్లను ఎక్కువ అందిస్తుంది. రెసిడెంట్ సీనియర్ సిటిజన్లు కొత్త ఎఫ్‌డీల ద్వారా పథకం ప్రయోజనాన్ని పొందవచ్చు. లేదా పాత ఎఫ్‌డిలను పునరుద్ధరించుకోవచ్చు. రెసిడెంట్ సీనియర్ సిటిజన్లు రూ. 2 కోట్లు లోపు ఎఫ్డీలపై 6.55 శాతం అధిక వడ్డీ రేటును 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల కాలపరిమితితో పొందుతారు. ప్రిన్సిపల్ మొత్తం, లేదా అక్రూడ్ వడ్డీపై 90 శాతం రుణాన్ని కస్టమర్లు పొందవచ్చు. ఎఫ్డీ మీద క్రెడిట్ కార్డు కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు కాగా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రిజర్వు బ్యాంకు ఇటీవల కీలక వడ్డీరేట్లను భారీగా తగ్గించడంతో ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంకులు ఇప్పటికే సీనియర్ సిటిజన్లకు చెల్లించే వడ్డీని పెంచిన విషయం తెలిసిందే. మోసగాళ్లకు చెక్ : మెసెంజర్లో కొత్త ఫీచర్ -
అప్పు కోసమూ ఆన్‘లైనే’..!
సురేష్‌కు చక్కటి ఉద్యోగం ఉంది. జీతం రూ. 50 వేల పైనే. జీవితం హాయిగానే ఉంది. ఇంతలో అనుకోని అవసరం వచ్చిపడింది. అర్జంటుగా రూ. 3 లక్షలు కావాలి. రుణం కోసం పలు బ్యాంకుల్ని ఆశ్రయించాడు. సురేష్ పనిచేస్తున్న కంపెనీ పెద్ద పేరున్నది కాకపోవటం, తనకు క్రెడిట్ కార్డు వంటివేమీ లేకపోవటంతో బ్యాంకులు రుణమివ్వలేదు. సురేష్‌కు ఎటూ పాలుపోలేదు. అంతలో స్నేహితుడు ప్రసాద్ ఇచ్చిన సలహాతో ఆన్‌లైన్‌ను ఆశ్రయించాడు. ఆన్లైన్ అంటే అదేమీ బ్యాంకో... రుణ సంస్థో కాదు. ఇలా అప్పులు కావాల్సిన వాళ్లను, తమ దగ్గర డబ్బులుండి చక్కని వడ్డీకి అప్పులిద్దామనుకున్న వాళ్లను కలిపే వేదిక. అక్కడ తనకు కావాల్సిన మొత్తం, కావాల్సిన వడీ ్డకి ఎవరిస్తారో చూసుకున్నాడు. వాళ్లను కలిశాడు. సమస్య పరిష్కారమయింది. ఒకరకంగా మంచి వడ్డీకే రుణం దొరికింది. విశేషమేంటంటే ఈ ఆన్లైన్ వేదిక కేవలం అప్పులు కావాల్సిన వాళ్లకోసమే కాదు. తమ వద్ద మిగులు డబ్బులుండి కాస్తంత మంచి వడ్డీ సంపాదిద్దామని అనుకున్న వాళ్లకు కూడా చక్కని వేదికలే. కాకపోతే ఈ ఆన్లైన్ లెండింగ్ వేదికలింకా చట్టబద్ధం కాలేదు. అయితేనేం!! అవసరాలకు మాత్రం పనికొస్తున్నాయి. వీటి గురించి వివరించేదే ఈ వారం ప్రాఫిట్ ప్లస్ ప్రత్యేక కథనం... రుణదాతల్ని-గ్రహీతల్ని కలుపుతున్న సంస్థలు ⇒ చిరకాలంగా హైదరాబాదీ సంస్థ ఐ-లెండ్ సేవలు ⇒ బ్యాంకుల్లో రుణాలు దొరకని వారికిది వరమే ⇒ రుణాలివ్వటానికి ముందుకొచ్చే వ్యక్తులకూ మేలే ⇒ ఎక్కువ వడ్డీతో అదనపు ఆదాయం సంపాదించే చాన్స్ ⇒ ప్రస్తుతానికి నియంత్రణలు లేకపోవటమే సమస్య రుణం పొందాలంటే..? * బ్యాంకుల్లా ప్రతినిధులు మీ ఇంటికి రావటం... మీ దగ్గర డాక్యుమెంట్లు తీసుకుని వెళ్లటం వంటివేమీ ఉండవు. రుణదాత సొంతగా అన్నీ చేయాలి. * ఫొటో, పాన్, ఆధార్ కార్డు వంటి కేవైసీ డాక్యుమెంట్లను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. * ఆదాయానికి సంబంధించి 6 నెలల బ్యాంకు స్టేట్మెంట్, మూడు నెలల వేతన స్లిప్‌లు కూడా అప్లోడ్ చేయాలి. * కొన్ని సంస్థలు కస్టమర్‌ను తన క్రెడిట్ స్కోరు సిబిల్ నుంచి తెచ్చుకుని సమర్పించాలని అడుగుతున్నాయి. కొన్ని సంస్థలైతే క్రెడిట్ స్కోరుతో పాటు సోషల్ స్కోరు కూడా చూస్తున్నాయి. వివిధ సాఫ్ట్వేర్లను ఉపయోగించి సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో దరఖాస్తుదారు ప్రవర్తన ఎలా ఉందో చూస్తున్నాయి.మొత్తమ్మీద 25-30 అంశాల ఆధారంగా రుణదాత స్థితిగతుల్ని విశ్లేషించి వారికి రిస్కు గ్రేడింగులిస్తున్నాయి. వడ్డీ అనేది ఈ గ్రేడ్లపై ఆధారపడి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఫీజు తప్పనిసరి ఆన్లైన్ రుణ వేదికల్లో చాలావరకూ రుణదాత నుంచి ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తాయి. ఈ రంగంలో చాన్నాళ్లుగా కార్యకలాపాలు సాగిస్తున్న ఐ- లెండ్... రూ.500 వసూలు చేస్తోంది. మరో వేదిక ఫెయిర్‌సెంట్ రూ.1,500 రిజిస్ట్రేషన్ ఫీజుగా వసూలు చేసి, రుణం వచ్చాక దాన్ని ప్రాసెసింగ్ ఫీజులో సర్దుబాటు చేస్తోంది. ‘‘రిజిస్ట్రేషన్ ఫీజు వల్ల ఎవరు పడితే వారు కాకుండా నిజంగా రుణం అవసరం ఉన్నవారే నమోదు చేయించుకుంటారు. ఎందుకంటే మేం కార్యకలాపాలు ఆరంభించిన తొలినాళ్లో చాలామంది రుణం కోసం వచ్చినవారు చివరి నిమిషంలో వెనక్కెళ్లిపోయేవారు’’ అనేది మరో ఆన్లైన్ లెండింగ్ సంస్థ ఫెయిర్‌సెంట్ మాట. కొన్ని కంపెనీలు రుణదాతల ఇళ్లకెళ్లి వెరిఫికేషన్ చేస్తారు. దీనికి చార్జీలవుతాయి కనక రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేస్తున్నట్లు అవి చెబుతున్నాయి. బ్యాంకులు పలు నియంత్రణలకు లోబడి పనిచేయాలి. అందుకే పర్సనల్ లోన్స్ అనేవి సెక్యూరిటీ లేని రుణాలు కాబట్టి అవి ఆచితూచి మంజూరు చేస్తుంటాయి. కనీస వేతనం రూ. 25 వేలు పైబడిన వారిని మాత్రమే అవి రుణాలకు అర్హులుగా పరిగణిస్తాయి. కాస్త పేరున్న కంపెనీల్లో పనిచేయటంతో పాటు, సదరు ఉద్యోగంలో కనీసం రెండుమూడేళ్లుగా పని చేస్తుండాలి. అప్పుడే ఉద్యోగంలో చేరిన వారైతే కష్టం. అంతేకాదు!! మీకు ఏ పాతికవేలో, 30 వేలో రుణం కావాలంటే బ్యాంకులు ఆసక్తి చూపించవు. కనీసం రూ.లక్ష దాటితేనే అవి ముందుకొస్తాయి. ‘‘దేశంలో బ్యాంకుల వంటి ఆర్థిక సంస్థల నుంచి రుణాలు పొందగలుగుతున్న వారి శాతం 40-50 వరకు మాత్రమే ఉంది. పేరున్న సంస్థల్లో పనిచేసే వారికి మాత్రమే రుణాలు దొరుకుతున్నాయి. ఇక్కడే కాదు. అభివృద్ధి చెందిన అమెరికా వంటి దేశాల్లో వ్యవస్థీకృత రుణాలు పొందుతున్న వారి శాతం తక్కువే’’ అని ‘ఐ-లెండ్.ఇన్’ వ్యవస్థాపకుడు వడ్డాది శంకర్ ‘సాక్షి’ ప్రాఫిట్ ప్లస్ ప్రతినిధితో చెప్పారు. ఐ-లెండ్ సంస్థ చిరకాలంగా ఈ రంగంలో ఉంది. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ 2 వారాల కిందటే చెన్నై, చండీగఢ్ నగరాల్లో తన సేవల్ని ఆరంభించింది. ఈ నెల్లో బెంగళూరులో కూడా సేవలు ఆరంభిస్తామని శంకర్ తెలియజేశారు. ‘‘ఇలా రుణాలు దొరకలేని వారికి... కాస్త రిస్క్ తీసుకుని రుణాలివ్వటానికి సిద్ధపడే వ్యక్తులకూ మధ్య అనుసంధాన వేదికే మా ఐ-లెండ్’’ అని చెప్పారాయన. దీన్నిపుడు పీ2పీ (పీర్ టు పీర్) వేదికగా పిలుస్తున్నారు. నిజానికిదేమీ కొత్తది కాదు. ఆఫ్‌లైన్ పద్ధతిలో ఈ విధానం ఎప్పట్నుంచో ఉంది. వ్యక్తులు అప్పుల కోసం మధ్యవర్తుల ద్వారా వడ్డీ వ్యాపారుల్ని ఆశ్రయించటమనేది చిరకాలంగా నడుస్తున్నదే. కాకపోతే దీనిక్కాస్త పారదర్శకత జోడించి, ఆన్‌లైన్‌లోకి తీసుకొచ్చి, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా కలుపుతోంది ఈ పీ2పీ వ్యవస్థ. అచ్చం బ్యాంకుల మాదిరే... * ఈ ఆన్లైన్ వేదికలు దాదాపు బ్యాంకుల్లానే పనిచేస్తాయి. * రుణగ్రహీతకు ఎంత రుణం ఇవ్వొచ్చు? ఎంత తీసుకుంటే తిరిగి తీర్చగలడు? అనేది వివిధ పద్ధతుల్లో విశ్లేషిస్తాయి. * రుణగ్రహీత జీతానికి తగ్గట్టుగా సమాన నెలసరి వాయిదాలను (ఈఎంఐ) నిర్ధారిస్తాయి. * తక్కువ రిస్కుండే రుణ గ్రహీతలకు తక్కువ వడ్డీకి, ఎక్కువ రిస్కుండే రుణ గ్రహీతలకు ఎక్కువ వడ్డీకి రుణాలు లభిస్తాయి. రుణదాతల విషయంలో కూడా ఇంతే!. వడ్డీ 3 శాతం నుంచి 36 శాతం వరకూ ఉంటుంది. * రుణ మొత్తం కనీసం రూ.25 వేలు... గరిష్టం రూ.5 లక్షలు. తీర్చే వ్యవధి ఆరు నెలల నుంచి మూడేళ్ల వరకూ ఉంటాయి. రుణదాతలకూ లాభమే... ఈ వేదిక ద్వారా వ్యక్తులకు రుణాలిచ్చి కాస్త ఎక్కువ సంపాదిద్దామనుకునేవారు కూడా ‘కేవైసీ’ నిబంధనలు పాటించకతప్పదు. నిజానికి పలు సంస్థలు రుణగ్రహీతల నుంచి తప్పిస్తే రుణ దాతల దగ్గర్నుంచి ఎలాంటి రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజులు వసూలు చేయటం లేదు. కొన్ని సంస్థలు ఒక వ్యక్తికి కావలసిన రుణాన్ని ఒకే రుణదాత పూర్తిగా ఇవ్వటానికి ఇష్టపడటం లేదు. ఉదాహరణకు ఫెయిర్సెంట్నే తీసుకుంటే... ఒకరికిచ్చే రుణాన్ని కనీసం ఐదుగురు రుణదాతలు కలిసి ఇవ్వాలన్న నిబంధన ఉంది. ‘‘రుణదాతలు పూర్తిగా నష్టపోకూడదని, వారి రుణ పోర్ట్‌ఫోలియో బాగుండాలని ఈ నిబంధన పెట్టాం. ఇలా చేయటం వల్ల ఒక రుణగ్రహీత గనక ఎగవేస్తే... రుణదాత నష్టపోయేది కొంతే ఉంటుంది’’ అనేది ఫెయిర్‌సెంట్ ప్రతినిధుల మాట. ఈ పద్ధతిలో ప్రతి రుణానికీ రుణదాతలు బిడ్లు వేయాలి. దీనివల్ల వడ్డీ రేట్లు కూడా తక్కువగా ఉండే అవకాశముంటుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం రుణానికి సంబంధించి సంతకాలు చేయటమంతా ఆఫ్‌లైన్ విధానంలోనే జరుగుతోంది. అన్ని పక్షాలూ ఓకే అన్నాక అగ్రిమెంట్ ప్రతిని సంస్థ ఇద్దరికీ పంపిస్తుంది. ఒకవేళ రుణదాతలు ఎక్కువమంది ఉంటే... మొదట రుణగ్రహీత సంతకం చేయాల్సి ఉంటుంది. తరవాత ఫ్రాంకింగ్ ద్వారా దాన్ని లీగల్ డాక్యుమెంట్‌గా మారుస్తారు. ఇక రుణగ్రహీత ఈఎంఐ చెల్లింపుల నిమిత్తం చెక్కులు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ‘‘మరో విషయమేంటంటే... 12 వాయిదాల్లో చెల్లించాల్సి ఉన్నపుడు, రుణదాతలు గనక నలుగురుంటే తలా 12 చొప్పున 48 చెక్కులివ్వాలి’’ అనేది లెండెన్ క్లబ్.కామ్ వ్యవస్థాపక సీఈఓ భవిన్ పటేల్ మాట. ఇక చెల్లింపులు ఆలస్యమైతే పెనాల్టీ చెల్లించటం వంటివి తప్పనిసరి. కొన్ని సందర్భాల్లో డిఫాల్టర్ల నుంచి వసూళ్లు చేయటానికి థర్డ్ పార్టీ ఏజెన్సీలు కూడా రంగంలోకి దిగుతాయి. ఆరేడు నెలల్లో పూర్తి మార్గదర్శకాలు... ఆన్లైన్ లెండింగ్‌కు సంబంధించి ప్రస్తుతం ఆర్బీఐ ఒక చర్చాపత్రాన్ని విడుదల చేసింది. దీనిపై అభ్యంతరాలు, సూచనలకు మే 31 వరకూ సమయం ఇచ్చింది. ఈ ప్రక్రియ అంతా పూర్తయితే... ఆరేడు నెలల్లో ఈ రంగానికి సంబంధించి పూర్తి మార్గదర్శకాలు, నిబంధనలు అమల్లోకి వస్తాయని భావిస్తున్నాం. అందరికీ రుణాలు చేరువ చేసే ఈ రంగానికి మంచి భవిష్యత్తుందనేది మా నమ్మకం. - వడ్డాది శంకర్, వ్యవస్థాపకుడు- ఐ-లెండ్ రుణ గ్రహీతలు ఇవి చూడాలి... * ఈ ఆన్లైన్ రుణ వేదికలు... బ్యాంకుల వద్ద రుణం దొరకని వారికి ప్రత్యేకమని చెప్పాలి. * బ్యాంకుల నుంచి రుణం దొరికే అవకాశముంటే అక్కడే తీసుకోవాలి. ఎందుకంటే రుణమిచ్చే వ్యక్తులకన్నా సంస్థలైతే నయం. రుణం వేగంగా వస్తుంది. సేవలు బాగుంటాయి. * బ్యాంకులతో దీర్ఘకాలం సంబంధం ఉన్న క్రెడిట్ కార్డు కస్టమర్లకు ఆయా బ్యాంకులే ముందుగా అప్రూవ్ చేసి మరీ రుణాలు ఆఫర్ చేస్తుంటాయి. వడ్డీ రేటు కూడా తక్కువ. పెపైచ్చు బ్యాంకుల నుంచి రుణం తీసుకుంటే క్రెడిట్ స్కోరు కూడా మెరుగుపడుతుంది. రుణ దాతలు ఇవి చూడాలి... * ఇది అధిక రిస్కున్న పెట్టుబడి. సరైన నిబంధనలేవీ లేవు. * దేశంలో పీ2పీ రుణాలింకా ఆరంభ దశలోనే ఉన్నాయి. కంపెనీలపై కూడా నియంత్రణ లేదు. రుణం డిఫాల్టయితే... దాన్ని రాబట్టుకోవటానికి చాలా సమయం పడుతుంది. * సూక్ష్మ రుణ సంస్థల్లానే ఈ ఆన్లైన్ సంస్థలు కూడా సమాచారాన్ని ఒకరితో ఒకరు పంచుకోవటం లేదు. దీంతో ఒకే రుణదాత వివిధ సంస్థల నుంచి రుణం తీసుకునే అవకాశం ఉంది. * రుణాలివ్వటానికి సంబంధించి రాష్ట్రాల్లో పలు నిబంధనలున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో వ్యక్తుల ఆదాయంలో 30-40 శాతం గనక రుణాలివ్వటం వల్ల వస్తే... తను తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మూడేళ్లుగా రుణాలిస్తున్నా... మూడేళ్లుగా ఈ ఆన్లైన్ వేదికలపై రుణాలిస్తున్నాం. ఇప్పటిదాకా 12 మందికి రుణాలిచ్చా. రూ.10వేలతో వ్యాపారం మొదలు పెట్టాను. ఇపుడు రూ.2 లక్షలు కూడా ఇస్తున్నాను. దీన్లో ఉండే రిస్కు నాకు తెలుసు. కానీ ఎక్కడ పెట్టుబడి పెట్టినా ఏదో ఒక రిస్కుంటుంది కదా?. - పార్థసారథి తనికెళ్ల , లెండర్