breaking news
High security number plate
-
షోరూమ్‌ల్లోనే పర్మనెంట్ రిజిస్ట్రేషన్
* హైసెక్యూరిటీ నంబర్‌ప్లేట్ కూడా అక్కడే * ఇక తాత్కాలిక రిజిస్ట్రేషన్లు ఉండవు * అమలు దిశగా రవాణా శాఖ సన్నాహాలు సాక్షి, హైదరాబాద్: వాహనాల రిజిస్ట్రేషన్లలో ఇప్పటివరకు ఉన్న రెండు రకాల రిజిస్ట్రేషన్ల విధానానికి త్వరలో తెరపడనుంది. ఇక వాహనం కొనుగోలు చేసిన షోరూమ్‌లోనే శాశ్వత రిజిస్ట్రేషన్ చేస్తారు. హైసెక్యూరిటీ నంబర్‌ప్లేట్‌ను బిగించి ఇస్తారు. దీంతో వాహనదారులు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతం తాత్కాలిక రిజిస్ట్రేషన్లతోపాటు, పర్మినెంట్ రిజిస్ట్రేషన్ ఫీజును షోరూమ్‌లలోనే చెల్లించే సదుపాయం అందుబాటులో ఉంది. ఇక తాత్కాలిక రిజిస్ట్రేషన్ పద్ధతికి కూడా స్వస్తి చెప్పాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం సీఎం పరీశీలనలో ఉన్న ఈ ప్రతిపాదన కొద్దిరోజుల్లోనే అమల్లోకి వచ్చే అవకాశమున్నట్లు రవాణాశాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ల విషయంలో ఇక ఏజెంట్లు, మధ్యవర్తులను ఆశ్రయించాల్సిన అవసరం ఉండదు. ఈ కొత్త విధానాన్ని తెలంగాణ అంతటా పూర్తిస్థాయిలో అమలు చేయాలని రాష్ట్ర రవాణాశాఖ భావిస్తోంది. రోజూ వేలసంఖ్యలో నమోదు ఇప్పటివరకు మోటారు వాహన నిబంధనల ప్రకారం వాహనాలు కొనుగోలు చేసిన నెలరోజుల్లో పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కొద్దిపాటి జరిమానాతో 6 నెలల వరకు కూడా అనుమతిస్తారు. ఇలాంటి వాహనాలు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినప్పుడు, రోడ్డు భద్రతా నిమయాలను అతిక్రమించినప్పుడు చర్యలు తీసుకోవడంలో ఇబ్బందులు తలె త్తుతున్నాయి. ఇలాంటి సమస్యల నుంచి వాహనదారులకు ఊరట కల్పించేందుకు ఆర్టీఏ చర్యలు చేపట్టింది. వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్ల ప్రక్రియను షోరూమ్‌లకు అప్పగించే ప్రతిపాదనపట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఎక్స్ట్రా ఫిట్టింగ్స్, తాత్కాలిక రిజిస్ట్రేషన్ల పేరిట కొందరు డీలర్లు వాహనదారులను నిలువుదోపిడీ చేస్తున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. రవాణాశాఖ నిర్వహించే దాడుల్లోనూ తరచూ ఇలాంటి అక్రమాలు వెలుగుచూస్తునే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పర్మనెంట్ రిజిస్ట్రేషన్లను షోరూమ్‌లకు కట్టబెట్టడం వల్ల డీలర్లపై రవాణాశాఖ నియంత్రణ ఏ మాత్రం ఉండదని ఆందోళన వ్యక్తమవుతోంది. -
వాహనదొంగలకు చెక్..!
సాక్షి, ముంబై: వాహనచోరులను అరికట్టడానికి ప్రభుత్వం ‘హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్’ (హెచ్ఎస్ఎన్పీ)లను వాహనాలకు అమర్చనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వాహనాలకు ఈ నంబర్ ప్లేట్లను అమర్చనున్నారు. దీనికోసం టెండర్లను ఆహ్వానించగా ఐదు కంపెనీలు బిడ్లు వేశాయి. బిడ్లను పరిశీలించేందుకు గాను ముగ్గురు సభ్యులతో కూడిన ఓ కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రవాణా శాఖ కూడా ఐదు కంపెనీలు అందజేసిన సాంకేతికమైన బిడ్లను ఇంతకు ముందే ప్రారంభించింది. ఇదిలావుండగా ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1.4 కోట్ల వాహనాలకు హెచ్ఎస్ఎన్పీ నంబర్ ప్లేట్లను అమర్చనున్నారు. మరో మూడు-నాలుగు నెలల్లో ఈ పనులను ప్రారంభించనున్నట్లు అధికారి తెలిపారు. బిడ్డర్ల ఒప్పందంపై ప్రభుత్వం సంతకం చేసిన తర్వాత పనులు ప్రారంభించనున్నారు. వాహనాల దొంగతనాలను అరికట్టే ఉద్దేశ్యంతో ఈ టాంపర్ ప్రూఫ్ హెచ్ఎస్ఎన్పీలను వాహనాలకు అమర్చనున్నారు. వీటి అమరికతో మున్ముందు వాహనాలకు భద్రత ఏర్పడనుందని అధికారి ఆశాభావం వ్యక్తం చేశారు. దీనికోసం ఏడు డిజిటల్ యూనిక్ సీరియల్ నంబర్లను కేటాయించనున్నారు. ఇదిలా వుండగా, ద్విచక్ర వాహనాలకు హెచ్ఎస్ఎన్పీ లకుగాను రూ.150 ఖర్చుకాగా, లైట్, భారీ వాహనాలకు రూ.200 నుంచి రూ.400 వరకు ఖర్చు కానుం దని అధికారి తెలిపారు. హెచ్ఎస్ఎన్పీ నంబర్ ప్లేట్లను వాహనాలకు ముందు, వెనుక భాగంలో అమర్చనున్నారు. నాలుగు చక్రవాహనాల విండ్ స్క్రీన్‌పై నంబర్ ప్లేట్ ట్యాగ్‌ను అమర్చనున్నారు. ఇదిలా వుండగా ఈ నంబర్ ప్లేట్లను ఆర్టీవో పరిధిలోని అధికారిక డీలర్లే అమర్చాల్సి ఉంటుందని అధికారి తెలిపారు. హై సెక్యురిటీ నంబర్ ప్లేట్ల వివరాలివి... అల్యూమినియం మిశ్రమ లోహంతో దీనిని ఏర్పాటు చేయనున్నారు. అశోక చక్ర హోలోగ్రాం ఉంటుంది. అదేవిధంగా నీలిరంగులో ‘ఇండియా’ అని ఆంగ్ల పదాలతో స్టాంప్ కూడా వేయనున్నారు.