breaking news
Hero Naga Shourya
-
వాళ్లతో డేటింగా?.. భలేవారే!
‘హండ్రెడ్ పర్సంట్ ప్రేమ ఉన్న చిత్రాలంటే ‘గీతాంజలి’, ‘మరోచరిత్ర’, ‘ఏమాయ చేశావే’ వంటివాటిని చెప్పొచ్చు. వాటి తర్వాత వంద శాతం స్వచ్ఛమైన ప్రేమకథ ఉన్న చిత్రం ‘ఒక మనసు’’ అని హీరో నాగశౌర్య అన్నారు. నాగశౌర్య, నిహారిక జంటగా రామరాజు దర్శకత్వంలో మధుర శ్రీధర్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ 24న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నాగశౌర్య చెప్పిన విశేషాలు. * ఈ చిత్రంలో అప్‌కమింగ్ పొలిటీషియన్ సూర్య పాత్ర చేశా. ప్రేమించు కున్నప్పుడు ఒకలా.. పెళ్లప్పుడు మరోలా ఉంటుంది మనసు. పెళ్లి తర్వాత ఒకే మనసు ఉంటుందనేది ఈ చిత్రం ప్రధానాంశం. ఈ చిత్రంలో చివరి నలభైఐదు నిమిషాలు కీలకం. సినిమా చూసి హాలు నుంచి బయటికొచ్చాక కనీసం ఓ ఇరవై నిమిషాలు ‘ఒక మనసు’ గురించే ఆలోచిస్తారు. అంత మనసును హత్తుకునేలా ఉంటుంది. * నాతో నటించిన కథానాయికల్లో నీహారిక, మాళవికా నాయర్ అంటే ఇష్టం. వాళ్లు తెలుగులో డైలాగులు చెప్పగలరు. సహ నటుడిగా నాకు అది చాలా కంఫర్టబుల్ అనిపించింది. నిహారిక పెద్ద ఫ్యామిలీ నుంచి వస్తోంది కదా, నటించడం ఇబ్బందేమో అనుకున్నా. కానీ, తను చాలా బాగా కలిసిపోయింది. రామరాజుగారు మంచి దర్శకుడు. ఆయన ఒక్కసారి సీన్ ఎక్స్ప్లైన్ చేస్తే అర్థమయ్యేది. సునీల్ కశ్యప్ మంచి పాటలిచ్చారు. నా సినిమాల్లో బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్ ఇంటే ఇదే. * హీరోయిన్లతో డేటింగ్ చేస్తున్నాడంటూ వచ్చే రూమర్స్‌ని పట్టించుకోవడం లేదు. మొదట రాశీఖన్నా, ఆ తర్వాత సోనారికా, రెజీనాతో లింక్ కలిపారు. రెజీనాతో సినిమా మొదలు కాకముందే తనతో డేటింగ్ అన్నారు. ఇప్పుడు నీహారిక... నేనే హీరోయిన్‌తో సినిమా చేస్తే ఆమెతో డేటింగ్ చేస్తున్నట్లా? నాకు అనుష్క అంటే ఇష్టం అని చాలాసార్లు చెప్పా. కానీ, ఆ విషయం రాయలేదేం? అంటే మనం ఎవరి గురించి మాట్లాడతామో అది రాయరు. మాట్లాడని వారి గురించి రాస్తారని నాకు అర్థమైంది. * ప్రస్తుతం శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో ‘జ్యో అచ్యుతానంద’ చేస్తున్నా. సాయి చైతన్యతో ఓ సినిమా చేయాల్సి ఉంది. స్క్రిప్ట్ పూర్తి కాకపోవడంతో ప్రస్తుతానికి ఆగింది. ‘జ్యో అచ్యుతానంద’ తర్వాత సుకుమార్ ప్రొడక్షన్లో హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయబోతున్నా. -
ఇదే తొలిసారి!
‘‘ఈ చిత్రంలో నాది మాస్ కేరక్టర్. ఈ తరహా పాత్ర చేయడం ఇదే తొలిసారి. ఈ సినిమా ఒప్పుకున్నప్పుడు చాలా మంది ‘అప్పుడే మాస్ పాత్ర అవసరమా’ అని అడిగారు. కానీ, ఈ సినిమా క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకునే ఈ సినిమాలో నటించాను’’ అని హీరో నాగశౌర్య అన్నారు. యోగేశ్ దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా వీవీఎస్ ప్రసాద్ నిర్మించిన చిత్రం -‘జాదూగాడు’. శుక్రవారం విడుదల కానున్న ఈ చిత్రవిశేషాలను నాగశౌర్య పంచుకున్నారు. ‘‘ఇందులో బ్యాంక్ రికవరీ ఏజెంట్ కృష్ణ పాత్రలో కనిపిస్తాను. చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ‘చింతకాయల రవి’ సినిమా తర్వాత యోగేశ్ చేస్తున్న సినిమా ఇది. నేను ఫైట్స్ చేస్తే, ప్రేక్షకులు అంగీకరిస్తారా? అనే సందేహం ఉండేది. కానీ, యోగేశ్ ప్రోత్సాహంతో చేశాను. అలాగే, నాకు డ్యాన్స్ చేయడం కూడా పెద్దగా రాదు. శేఖర్, రఘు మాస్టార్ల సహకారంతో చేశాను. ఇంటర్వెల్, క్లైమాక్స్ హైలైట్. ప్రస్తుతం నందినీ రెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం, అలాగే రమేశ్ వర్మ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నా’’ అని చెప్పారు.