breaking news
Hemant Panda
-
గాంధీ హత్య కేసులో ఆ ముగ్గురూ ఏరి?
న్యూఢిల్లీ: మహాత్మా గాంధీ హత్యకు సంబంధించిన కేసులో ఉన్న ముగ్గురు నిందితులను అరెస్టు చేయడానికి ఢిల్లీ పోలీసులు తీసుకున్న చర్యలేమిటో తెలపాలంటూ ఒడిశాకు చెందిన ఆర్టీఐ కార్యకర్త హేమంత్ పాండా కోరారు. నిందితులు గంగాధర్ దహవాటే, సురియా దేవ్ శర్మ, గంగాధర్ యాదవ్‌ల అరెస్టు విషయంలో చేసిన ప్రయత్నాలేమిటో తెలపాలని ఆర్టీఐ దరఖాస్తులో విన్నవించారు. ఇందుకు సంబంధించి కేంద్ర సమాచార కమిషన్ స్పందిస్తూ.. మహాత్మాగాంధీ హత్య కేసుకు సంబంధించి అన్ని రికార్డులను క్షుణ్ణంగా అధ్యయనం చేయడంలో పాండా చాలా ఆసక్తి ఉన్నవారని..అతడో పరిశోధకుడని తెలిపింది. నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియాలో మహాత్మా గాంధీ హత్య కేసుకు సంబంధించి రెండు అతి ముఖ్యమైన డాక్యుమెంట్లు, గాంధీ హత్యకేసులో వేసిన ఫైనల్ చార్జ్‌షీట్ కనిపించలేదని, దీంతోపాటు గాడ్సేను విచారించమని చెప్పిన ఢిల్లీ పోలీసుల ఆదేశాల పత్రం కూడా కనిపించలేదని పాండా తెలిపారు. అయితే ఈ ప్రశ్నలపై సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు స్పందిస్తూ...‘గాంధీ హత్యకేసుకు సంబంధించి ఫైనల్ చార్జ్‌షీట్ రికార్డుల్లోనే ఉంటుందని ఒకవేళ ఆ చార్జ్‌షీట్ రికార్డుల్లో లేకుంటే దానిపై ఇప్పుడేమీ చెప్పలేమన్నా’రు. -
‘గాంధీ హత్యపై ఎఫ్ఐఆర్ బహిర్గతం చేయండి’
న్యూఢిల్లీ: 1948, జనవరి 30న జరిగిన మహాత్మా గాంధీ హత్యపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్, చార్జిషీట్‌ను బహిర్గతం చేయాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖను కేంద్ర సమాచార కమిషన్ ఆదేశించింది. మహాత్ముడి హత్య అనంతరం ఎఫ్ఐఆర్, చార్జిషీట్, పోస్టుమార్టం ఇలా ఏడు ప్రశ్నలకు సంబంధించిన వివరాలను తెలియజేయాలంటూ ఒడిశాకు చెందిన హేమంత్ పండా హోంమంత్రిత్వ శాఖకు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తును అధికారులు కేంద్ర పురావస్తు విభాగానికి పంపించారు. గాంధీ స్మృతి మ్యూజియం(బిర్లా హౌజ్)లో కలసి వివరాలు తెలుసుకోవాలంటూ పురావస్తు అధికారులు పండాకు సూచించారు. గాంధీ హత్య అనంతరం అతని కుటుంబ సభ్యులు కోరని కారణంగా పోస్టుమార్టం జరపలేదని బిర్లా హౌజ్ పేర్కొంది. తుగ్లక్ రోడ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయిందని ఆ వివరాల కోసం హోంమంత్రిత్వ శాఖను సంప్రదించాల్సిందిగా వివరించింది.