breaking news
Hebbal
-
రేపు పెళ్లిపీటలు ఎక్కాల్సిన వరుడు అంతలోనే..
మైసూరు: మరో రెండు రోజుల్లో అతడికి పెళ్లి జరగాల్సి ఉంది. అందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఇంతలో కరోనా బలి తీసుకుంది. వివరాలు.. మైసూరు హెబ్బాళు నివాసి నవీన్ (31) ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి. మార్చి 7న ఓ యువతితో నిశి్చతార్థం జరిగింది. మే 19, 20 తేదీల్లో పెళ్లి ముహూర్తం. ఇంతలో నవీన్‌కు దగ్గు రావడంతో కోవిడ్ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. శ్వాస తీసుకోలేకపోయాడు. దీంతో జిల్లా కోవిడ్ ఆస్పత్రికి తరలించగా సోమవారం మరణించాడు. నవీన్ ఇంట్లో అతని అన్న, వదినకు కరోనా సోకింది. పెళ్లి ఇంట రోదనలు మిన్నంటాయి. చదవండి: ప్రభుత్వ టీచర్ కుటుంబాన్ని చిదిమేసిన కరోనా చదవండి: కరోనాతో టీవీ ఛానల్ ఎండీ కన్నుమూత -
బెంగుళూరు స్టీల్ ఫ్లైఓవర్ రద్దు
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రతిపక్ష బీజేపీ మధ్య సాగుతున్న అవినీతి ఆరోపణల పర్వంలో కీలక మలుపు చోటుచేసుకుంది. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం బసవేశ్వర కూడలి నుంచి హెబ్బాళ వరకు 6.7 కిలోమీటర్ల మేర నిర్మించతలపెట్టిన స్టీల్ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని సర్కారు రద్దు చేసింది. ఈ ప్రాజెక్టును రద్దు చేస్తున్నట్టు బెంగళూరు అభివృద్ధిశాఖ మంత్రి కేజే జార్జి ప్రకటించారు. తమ నిబద్దతను చాటుకోవడానికే స్టీల్ ఫ్లైఓవర్ నిర్మాణం రద్దు చేశామని చెప్పారు. ఇందులో సీఎం సిద్ధరామయ్య కుటుంబానికి, కాంగ్రెస్ అధిష్టానికి ముడుపులు ముట్టినట్లు బీజేపీ ఆరోపణలు చేయడం తగదన్నారు. రూ. 1,800 కోట్ల విలువైన స్టీల్ ఫ్లైఓవర్ నిర్మాణ ప్రతిపాదన 4 నెలల క్రితం తెరపైకి వచ్చింది. స్టీల్ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం 812 చెట్లు నరికేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు.