breaking news
heavy rians
-
ఏపీకి మరో అల్పపీడనం ముప్పు..
-
వనపర్తి జిల్లాలో కాజ్ వే దాటుతూ ముగ్గురు గల్లంతు
-
రోడ్లన్నీ ఛిద్రం.. దెబ్బతిన్న రహదారులు
సాక్షి నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, వాగులు, ఉప నదులు పొంగిపొర్లడంతో పెద్ద సంఖ్యలో రోడ్లు కోతకు గురయ్యాయి. కల్వర్టులు, అప్రోచ్ రోడ్లు కూడా ధ్వంసమయ్యాయి. కొన్ని చోట్ల వంతెనలు కొట్టుకుపోయాయి. గోదావరి వరదలతో పరీవాహక ప్రాంతం వెంబడి రహదా రులు దెబ్బతిన్నాయి. జాతీయ రహదారులు కూడా కోతకు గురయ్యాయి. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో నష్టం ఎక్కువగా ఉంది. చాలా చోట్ల రోడ్లకు మరమ్మతులు చేయాల్సి ఉంది. మంచిర్యాల జిల్లా తోటపల్లి మండలంలో దెబ్బతిన్న రోడ్డు గోదావరి పరీవాహకం వెంట.. కరీంనగర్ జిల్లాలో 40 ఆర్అండ్బీ రోడ్లు దెబ్బతిన్నాయి. వాటి మరమ్మతుల కోసం అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. పెద్దపల్లి జిల్లాలో 42 కిలోమీటర్ల మేర రోడ్లు కొట్టుకుపోయాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 56 చోట్ల, జగిత్యాల జిల్లాలో 32 చోట్ల రోడ్లు కోతకు గురయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలకుతోడు గోదావరి వరదలతో భారీ ఎత్తున రోడ్లు, కల్వర్టులు ధ్వంసమయ్యాయి. నిర్మల్ జిల్లాలో 40 చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులు, వంతెనల మరమ్మతులకు రూ.18 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేశారు. ఆదిలాబాద్ జిల్లాలో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతుల కోసం రూ.15 కోట్ల మేర అవసరమని అధికారులు అంచనా వేశారు. మంచిర్యాల జిల్లాలో గోదావరి తీర ప్రాంతాలతోపాటు మంచిర్యాల పట్టణంలోనూ రోడ్లు దెబ్బతిన్నాయి. చదవండి: గోదావరి మహోగ్ర రూపం.. రంగంలోకి హెలికాప్టర్లు.. సైన్యం -
హైదరాబాద్ లో భారీ వర్షం
-
దెబ్బ మీద దెబ్బ!
సాక్షి, నెట్వర్క్: వరుణుడు మళ్లీ విరుచుకుపడుతున్నాడు. పక్షం రోజుల క్రితం నెల్లూరు, చిత్తూరు, కడప, ప్రకాశం, గోదావరి జిల్లాలను అతలాకుతలం చేసి, నానా బీభత్సం సృష్టించిన వాన మళ్లీ ముంచడానికి వస్తోంది. సర్వం కోల్పోయి పుట్టెడు దుఃఖంలో మునిగిపోయిన కుటుంబాలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయన్న తరుణంలో మరోసారి కురుస్తున్న జల్లులు జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. ఈసారి కూడా నెల్లూరు, కడప జిల్లాలపైనే వర్షం ప్రభావం అధికంగా కనిపిస్తోంది. నెల్లూరు జిల్లాలో గత మూడురోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇప్పుడిప్పుడే బయటపడుతున్న పంటపొలాలు మళ్లీ నీటమునుగుతున్నాయి. ఊళ్లను నీళ్లు చుట్టుముడుతున్నాయి. గూడూరు డివిజన్ పరిధిలో పోటెత్తిన వరదల్లో ఇద్దరు గల్లంతయ్యారు. చలిగాలులకు ఎనిమిది మంది మృతిచెందారు. చెరువులన్నీ ప్రమాదకరస్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికే కట్టిన రింగ్బండ్లు పలుచోట్ల కొట్టుకుపోయాయి. సూళ్లూరుపేట పరిధిలో స్వర్ణముఖి, కాళంగినది, మామిడి, కరిపేటికాలువలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సముద్రంలో అలలు ఎగిసి పడుతుండటంతో మత్స్యకారులను వేటకు వెళ్లొద్దని అధికారులు ఆదేశాలు జారీచేశారు. రైల్వేకోడూరులోనూ అదే పరిస్థితి.. వైఎస్ఆర్ జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలోనూ మంగళవారం భారీ వర్షం కురిసింది. గుంజన నది, మేకలగుంటేరు, తిరుపతేరు, ముష్టేరులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చిట్వేలు రోడ్డులో ఉన్న వంతెన, రెడ్డివారిపల్లి వంతెనలు ఇప్పటికే దెబ్బతినగా.. ఇపుడు మళ్లీ వరద నీరు పోటెత్తడంతో ఏక్షణాన ఏం జరుగుతుందోనని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయపడుతున్నారు. మరో రెండ్రోజులు ఇలాగే వర్షం కొనసాగితే పెద్ద సంఖ్యలో ఇళ్లు కూలిపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. చిత్తూరులోనూ వాన కష్టాలు.. చిత్తూరు జిల్లాలోనూ మళ్లీ వానకష్టాలు మొదలయ్యాయి. పుత్తూరు మండలం శ్రీరంగంచెరువు, నగరి మండలం బీమానగర్ చెరువు మొరవలు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న దాదాపు 150 ఇళ్లు జలమయయ్యాయి. చంద్రగిరి మండలం పేరూరు చెరువు ఉధృతంగా మొరవ పారడంతో లోతట్టు ప్రాంతాల్లోని 250 ఇళ్లలోకి నీళ్లు చేరాయి. సత్యవేడు, బంగారుపాళెం, కార్వేటినగరం, గంగాధరనెల్లూరు మండలాల్లో ఏడు చెరువులకు గండ్లు పడ్డాయి. పెనుమూరు మండలంలో 100 ఎకరాల పూలతోట నీట మునిగింది. ఎన్టీఆర్ జలాశయంలో ఆరు గేట్లు ఎత్తివేసి 350 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా, ఆరణియార్ రిజర్వాయరులో నాలుగు గేట్లు, కృష్ణాపురం జలాశయంలో మూడుగేట్లు, బహుదా ప్రాజెక్టు నందు రెండు గేట్లు ఎత్తివేసి నీటిని విడుదల చేస్తున్నారు.