breaking news
HCLtd
-
ఐబీఎం - హెచ్‌సీఎల్ మెగా డీల్
సాక్షి,ముంబై: ఇంటర్నేషనల్ బిజినెస్ మెషిన్స్ కార్పొరేషన్(ఐబీఎం) తన సాఫ్ట్వేర్ ఉత్పత్తుల వ్యాపారాన్ని భారతీయ టెక్ సేవల సంస్థ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌కు విక్రయించ నుంది. ఐబీఎం ఇందుకు1.80 బిలియన్ డాలర్లను (సుమారు రూ.12,700కోట్లు) వెచ్చించనుంది. ఈ మేరకు ఒక తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు హెచ్‌సీఎల్ మార్కెట్ ఫైలింగ్‌లో వెల్లడించింది. 2019 తొలి అర్ధభాగానికల్లా డీల్ పూర్తిచేసే అవకాశమున్నట్లు హెచ్‌సీఎల్ ప్రకటించింది. డీల్‌లో భాగంగా అధిక వృద్ధికి వీలున్న సెక్యూరిటీ, మార్కెటింగ్, కామర్స్ విభాగాలకు చెందిన సాఫ్ట్వేర్ ప్రొడక్టులను ఐబీఎం నుంచి సొంతం చేసుకోనున్నట్లు హెచ్‌సీఎల్ సీఈవో సి.విజయకుమార్ తెలిపారు. సాఫ్ట్వేర్ ఉత్పత్తుల పరిధిలో తమకు మొత్తం 50 బిలియన్ డాలర్ల విలువైన మార్కెట్ ఉన్నట్లు ఐబీఎం ఒక ప్రకటనలో తెలిపింది. బిగ్ ఫిక్స్, మార్కెటింగ్ ఆటోమేషన్ ప్రొడక్ట్ యూనికా తదితర ఏడు ఉత్తులను హెచ్‌సీఎల్‌కు విక్రయించనున్నామని తెలిపింది. కాగా ఐబీఎం కూడా అమెరికాకు చెందిన ఐటీ సంస్థ రెడ్ హ్యాట్‌ను 34 బిలియన్ డాలర్ల( రుణంతో సహా) కొనుగోలు చేస్తోంది. మరోవైపు ఈ మెగా డీల్ వార్తలతో ఇన్వెస్టర్లు హెచ్‌సీఎల్ టెక్ కౌంటర్లో అమ్మకాలకు తెరతీశారు. దీంతో ఈ షేరు ఒక దశలో దాదాపు 7శాతం పతనాన్ని నమోదుచేసింది. -
కీలక అంశాలకు క్యాబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ: కేంద్ర క్యాబినెట్ కొన్ని కీలక అంశాలకు బుధవారం ఆమోదం తెలిపింది. జీఎస్టీ అమలుకు ఉద్దేశించిన ఆర్థిక ప్లాన్, హిందుస్తాన్ కేబుల్స్ లిమిటెడ్ (హెచ్‌సీఎల్) ఫ్యాక్టరీ, రష్యా చమురు బావుల్లో వాటా కొనుగోలు, తదితర కీలక అంశాలకు సంబంధించి గ్రీన్ సిగ్న ల్ ఇచ్చింది. ప్రధానంగా కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్టీ ప్రతిపాదించిన జీఎస్టీ అమలుకోసం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ (సీబీఈసీ)లోని ఐటీ ఇన్ఫ్రాక్చర్ మెరుగుదలకు సంబంధించిన అంశాన్ని ఆమోదించింది. దీనికోసం రాబోయే ఏడు సంవత్సరాల్లో 2వేల రెండు కోట్లను వెచ్చించనుంది. ఐవోసీ, ఆయిల్ ఇండియా లిమిటెడ్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్)లు రష్యాలోని తాస్-యురై చమురు బావిలో 29.9 శాతం వాటా కొనుగోలు చేయడానికి 128 కోట్ల డాలర్ల ఒప్పందానికి క్యాబినెట్ ఓకే చేసింది. అలాగే హిందుస్తాన్ కేబుల్స్ లిమిటెడ్ (హెచ్‌సీఎల్) ఫ్యాక్టరీ మూసివేతకు అంగీకారం తెలిపింది. కాగా జీఎస్టీ అమలుకు సంబంధించి రోడ్ మ్యాప్ తయారు చేసింది సీబీఈసీ . ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్(ఓవీఎల్), కన్సార్టియానికి నాయకత్వం వహిస్తున్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ)..రష్యాలోని చమురు బావుల్లో వాటాలను కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి. కేంద్ర ప్రభుత్వ రంగంలోని టెలికాం శాఖకు కావలసిన కేబుల్స్ తయారీ సంస్థ హెచ్‌సీఎల్ నష్టాలనుఎదుర్కొంటోంది. వైర్లెస్ ఫోన్లు మార్కెట్లోకి రావడంతో ల్యాండ్ ఫోన్లు, వాటికి కేబుల్స్ అవసరం దారుణంగా పడిపోవడంతో హెచ్‌సీఎల్ మూసివేత స్థితికిచేరింది. 2015 ఫిబ్రవరిలో కంపెనీని మూసివేయడానికి కేంద్రం సిద్ధమైనా ఉద్యోగుల ఆందోళనలతో వెనక్కి తగ్గింది. అయితే అదే ఏడాది ఏప్రిల్ నుంచి ఉద్యోగులకు జీతాలు చెల్లించడంలేదు.