breaking news
Hazrat Ibrahim
-
త్యాగానికి ప్రతిరూపం బక్రీద్
బక్రీద్ వేడుకల కోసం ముస్లింలు సిద్ధమయ్యారు. సోమవారం జరిగే ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఉత్సాహం చూపుతున్నారు. దీనికోసం అవసరమైన ఇప్పటికే షాపింగ్‌ను పూర్తి చేశారు. చిన్నాపెద్దా తేడాలేకుండా జరుపుకునే పండుగ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఈ సందర్భంగా పట్టణంలోని మెదక్ రోడ్ సమీపంలో గల ఈద్గా మైదానాన్ని నమాజ్‌ల కోసం సిద్ధం చేశారు. 60 ఏళ్ల క్రితం నిర్మించిన తంజిముల్ మసీదును అందంగా ముస్తాబు చేశారు. పండుగను పురస్కరించుకుని పలు చోట్ల అన్నదానం, వస్తుదానం, వస్త్రదానం చేస్తారు. చరిత్ర... ఐదు వేల సంవత్సరాల క్రితం ఇరాక్ ప్రాంతాన్ని పాలిస్తున్న సమ్రూద్ రాజ్యంలో.. హజ్రత్ ఇబ్రహీం అనే వ్యక్తి దైవ ప్రచారం నిర్వహిస్తూ.. ప్రజల్లోని అజ్ఞానాన్ని, మూఢనమ్మకాలను తొలగించేందుకు ప్రయత్నిస్తుండగా రాజ్య బహిష్కరణకు గురయ్యాడని చరిత్ర చెబుతోంది. అనంతరం వేరే రాజ్యానికి వెళ్లిన ఇబ్రహీం దైవ సంకల్పాన్ని కొనసాగించారని ముస్లిం పెద్దలు పేర్కొంటున్నారు. ఇలా ఏళ్లకు ఏళ్లు కాల గర్భంలో కలిసి పోవడంతో ఆయనకు వృద్ధాప్యం వచ్చింది. ఈ సమయంలో ఒక రోజు రాత్రి ఇబ్రహీం పడుకుని ఉండగా అల్లా తన కలలోకి వచ్చి నీ కుమారుడిని నాకు బలివ్వమని (ఖుర్బానీ) కోరుతాడు. దైవ సంకల్పాన్ని నెరవేర్చేందుకు ఇబ్రహీం తన కొడుకును బలిచ్చేందుకు సిద్ధమైన క్షణంలో.. అతని దైవ నిరతికి ముగ్దుడైన అల్లా ప్రత్యక్షమై తన కుమారుడి స్థానంలో పొట్టేలును ఖుర్బానీగా స్వీకరిస్తాడని చరిత్ర చెబుతోంది. ఈ సంఘటనకు గుర్తుగా ముస్లింలు బక్రీద్‌ను జరుపుకుంటారు. -
ఖురాన్ పఠనం.. సకల పాప హరణం
రంజాన్ స్పెషల్:- పడో యా సునో - పవిత్ర రంజాన్ నెలతో ఖురాన్‌కు ప్రత్యేక అనుబంధం - ఆ దివ్య గ్రంథం అవతరించిన మాసమిదే! - పాప పరిహారానికి అనువైన సమయం ఖురాన్‌కు రంజాన్ కు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ‘రమ్‌దామ్’ అనే అరబ్బీ పదం కాలక్రమేణ ‘రంజాన్’గా మారింది. పాప పరిహారాల కోసం ఈనెల అనువైన సమయం. రంజాన్‌లో ఖురాన్‌ను పూర్తిగా వినడం మహా ప్రవక్త (స) ఆచారం. హజ్రత్ జిబ్రయీల్ ఏటా రంజాన్‌లో మహాప్రవక్త (స)కు సంపూర్ణ ఖురాన్‌ను వినిపించేవారు. ఆయన ఆఖరు సంవత్సరంలో మహాప్రవక్తతోపాటు రెండుసార్లు ఖురాన్‌ను సంపూర్ణంగా పఠించారు. అందువల్ల ఈ మాసంలో ఇతోధికంగా ఖురాన్ పఠించడానికి ప్రయత్నించాలి. ఖురాన్‌ను నెమ్మదిగా, అవగాహన చేసుకుంటూ చదవాలి. వజూ(ముఖం, కాళ్లు, చేతులూ శుభ్రం చేసుకోవడం) చేసిన తర్వాతనే ఖురాన్‌ను పఠించడం ఉత్తమం. ప్రతిరోజు ఖురాన్‌ను చదవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ గ్రంథంలోని 30 భాగాలను కంఠస్థం చేసిన వారిని హాఫీజ్ అంటారు. వారు ఏటా రంజాన్‌లో చదివే తరావీహ్(రాత్రి 8.30 గంటల సమయంలో) నమాజ్‌లో ఖురాన్‌ను వినిపిస్తారు. కాబట్టి తరావీహ్ నమాజులో ఖురాన్‌ను పూర్తిగా వినేందుకు ప్రయత్నించాలి. రంజాన్ మాసంలో అవతరించిన దైవ గ్రంథాలు.. - హజ్రత్ ఇబ్రహీంకు రంజాన్ మాసంలోనే మొదటి లేదా మూడో తేదీన పవిత్ర ఖురాన్ గ్రంథం ప్రసాదితమైంది. - హజరత్ దావూద్‌కు ఈ నెలలో 12 లేదా 18వ తేదీల్లో జబూర్ గ్రంథం సిద్ధించింది. - హజ్రత్ ఈసాకు శుభప్రదమైన ఈ మాసంలోనే 12 లేదా 13వ తేదీన బైబిల్ లభించింది. ఎవరైతే ఖురాన్ పవిత్ర గ్రంథాన్ని అనుసరిస్తారో.. వారు ఇహ లోకంలో సన్మార్గానికి దూరం కాకుండా, పరలోకంలోనూ సఫలతను కోల్పోకుండా ఉంటారు.- హజ్రత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్