breaking news
Hazardous areas
-
61 శాతం భారత్ భూకంప జోన్లోకి..
ప్రపంచంలో పలు దేశాలను అల్లాడించిన భూకంపాలు త్వరలో భారత్పైకీ విరుచుకుపడే ప్రమాదం హెచ్చుగానే కనిపిస్తోంది. దేశంలో ఏకంగా 61 శాతం ప్రాంతం సాధారణం నుంచి ప్రమాదకర భూకంప రిస్కు పరిధిలోకి చేరడమే ఇందుకు కారణం. కేంద్ర ప్రభుత్వానికి చెందిన బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్డ్స్ (బీఐఎస్) కొత్తగా సవరించిన భూకంప డిజైన్ కోడ్ ఈ ప్రమాదకర విషయాన్ని వెల్లడించింది. అంతేకాదు, పొంచి ఉన్న భూకంప ప్రమాద తీవ్రతను తెలియజెప్పేందుకు కొత్తగా ‘అత్యంత ఎక్కువ రిస్కు’జోన్ కేటగిరీని కూడా చేర్చింది. మొత్తం హిమాలయ ప్రాంతమంతటినీ జోన్–6గా పేర్కొన్న ఈ కేటగిరీలోకే చేర్చడం మరింత ఆందోళన పడాల్సిన అంశం! ఇప్పడేం మారింది? హిమాలయాలు గతంలో 4, 5 జోన్ల పరిధిలో ఉండేవి. ఆ ప్రాంతమంతా నిజానికి ఒకే టెక్టానిక్ పలకపై ఉన్నా భూకంప రిస్కు తీవ్రతలో తేడా ఆధారంగా అప్పట్లో అలా విభజన చేశారు. అయితే ఆ క్రమంలో భూ లోతుల్లోని పొడవాటి అగాధపు ప్రాంతాలతో పొంచి ఉన్న ముప్పును సరిగా మదింపు చేయడంలో విఫలమైనట్టు సైంటిస్టులే అంగీకరిస్తున్నారు. ముఖ్యంగా మధ్య హిమాలయ ప్రాంతాల్లో పలు అత్యధిక భూకంప రిసు్కన్న పలు భూభాగాలు ఈ తప్పిదం వల్ల సాధారణ రిసు్కన్నవిగా పరిగణన పొందుతూ వచ్చాయి. దాన్నిప్పుడు సరిచేసినట్టు బీఐఎస్ వెల్లడించింది. నిజానికి మధ్య హిమాలయ ప్రాంతాల్లో గత రెండు దశాబ్దాల్లో భూకంపం జాడలు కూడా కని్పంచలేదు. అంత మాత్రాన అక్కడ అంతా సజావుగా ఉన్నట్టు అసలే కాదని బీఐఎస్ పేర్కొంది. ఎందుకిలా డేంజర్ జోన్లోకి? హిమాలయాలు ప్రపంచంలోనే అత్యంత చురుగ్గా ఢీకొట్టే టెక్టానిక్ పలకల సరిహద్దులపై ఉన్నాయి. మరోలా చెప్పాలంటే ఎప్పుడైనా బద్దలయ్యే అవకాశమున్న మందుపాతరపై ఉన్నాయన్నమాట. ఇండియన్ టెక్టానిక్ ప్లేట్ నిరంతరం యురేíÙయన్ ప్లేట్లోకి చొచ్చుకుపోతూ వస్తోంది. ఫలితంగా ఏటా కనీసం 5 సెంటీమీటర్ల మేరకు అందులోకి చొరబడుతూ వెళ్తోంది. రెండు ప్లేట్లు ఢీకొంటున్న కారణంగానే అక్కడ భూ ఉపరితలం పైపైకి పెరుగుతూ వస్తోంది. హిమాలయాల ఆవిర్భావానికి మూలకారణం కూడా ఇదే. ఎవరెస్టుతో పాటు ప్రపంచంలోకెల్లా పలు పర్వత శిఖరాలు హిమాలయాల్లోనే ఉండేందుకూ ఇదే కారణం. కనుక అవి చల్లగా కని్పంచేది కేవలం పైకి మాత్రమే. ఈ టెక్టానిక్ ఒత్తిడి మూలంగా హిమాలయ గర్భమంతా నిత్యం అలజడిమయంగానే ఉంటూ ఉంటుంది. టెక్టానిక్ పలకల పరస్పర తాకిడి భూ కేంద్రంపైనా విపరీతమైన ఒత్తిడికి కారణమవుతోంది.ఆ ఒత్తిడి ఎప్పుడో ఓసారి హఠాత్తుగా విడుదలవుతుంటుంది. అది కాస్తా అత్యంత శక్తిమంతమైన భూకంపాల రూపంలో పైకి ఎగదన్నుకొస్తుంది. ఇది చాలదన్నట్టు భూమ్మీద అత్యంత అస్థిరమైన పర్వత ప్రాంతం హిమాలయాలే. వయసుపరంగా అన్ని పర్వతాల కంటే చిన్నవి కూడా. దాంతో హిమాలయాల్లోని రాళ్లు తదితరాలు నిత్యం అటూఇటూ మంద్రస్థాయిలో కదలాడుతూనే ఉంటాయి. అందుకే ఇక్కడ గనక భూకంపం సంభవిస్తే అతి అత్యంత ప్రాణాంతకమే అవుతుంది. అంతా అక్కడే! మెయిన్ బౌండరీ, మెయిన్ సెంట్రల్, మెయిన్ ఫ్రంటల్... ఇలా భూ కేంద్రంలోని ప్రధాన ఫాల్ట్ సిస్టమ్స్ (భారీ రంధ్రాలని చెప్పుకోవచ్చు)లో అతి పెద్దవన్నీ హిమాలయాల కిందే కేంద్రీకృతమై ఉన్నాయి. అంతేగాక పలు భూకంప విరామ ప్రాంతాలు (కొన్ని శతాబ్దాలుగా అసలు భూకంపమే రానివి) కూడా హిమాలయాల్లోనే ఎక్కువగా ఉన్నట్టు సైంటిస్టులు తేల్చారు. అలాంటి ప్రాంతాల్లో భారీ భూకంపానికి ఎప్పుడైనా ఆస్కారం పుష్కలంగా ఉంటుందట. కర్ణుని చావుకు మాదిరిగా ఇన్ని కారణాలు కలగలిసి హిమాలయాలను ప్రపంచంలోకెల్లా భూకంప రిస్కు అత్యంత ఎక్కువగా ఉన్న ప్రాంతాల జాబితాలోకి చేర్చేశాయి. హిమాలయాల్లోని డెహ్రాడూన్, మొహంద్తో పాటు మొత్తం ఉత్తరాఖండ్ అంతా తాజాగా భూకంప డేంజర్ జోన్లోకి వచి్చంది. అక్కడ జనాభా నానాటికీ ఊహాతీతంగా పెరిగిపోతుండటమే ఇందుకు ప్రధాన కారణంగా మారింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ప్రమాదకర స్థాయిలో ఢిల్లీ వాయు కాలుష్యం
ఢిల్లీ: దేశ రాజధానిలో కాలుష్యం ఆందోళనకర స్థాయికి చేరింది. ఢిల్లీలోని ముంద్ఖా ప్రాంతంలో గురువారం గాలినాణ్యతా ప్రమాణాలు తీవ్ర స్థాయికి చేరాయి. నాణ్యతా ప్రమాణాల సూచీలో అత్యధికంగా 616 పాయింట్లకు పడిపోయిందని అధికారులు తెలిపారు. గత ఐదు రోజులుగా ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. బుధవారం ఉష్ణోగ్రత అత్యధికంగా 32.7 డిగ్రీలుగా నమోదైంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ డేటా ప్రకారం ఢిల్లీ మొత్తం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) రాత్రి 7 గంటలకు 357 వద్ద నమోదైంది. దీంతో ఢిల్లీలో వాయు నాణ్యతను మెరుగుపరచడానికి కావాల్సిన చర్యలు తీసుకోవాలని సూచిస్తూ అటవీ శాఖకు హైకోర్టు ఆదేశించింది. కలుషిత గాలి పీల్చడం వల్ల అస్తమా రోగుల సంఖ్య పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. గాలి నాణ్యత సూచిలో 0-50 ఉంటే ఆరోగ్యమైన గాలి ఉన్నట్లు, 50-100 ఉంటే సంతృప్తికరంగా ఉన్నట్లు భావిస్తారు. 101-200 ఉంటే మధ్యస్థంగా, 201-300 పేలవంగా ఉన్నట్లు గణిస్తారు. 301-400 ఉంటే అత్యంత పేలవంగా, 401-500 ఉంటే తీవ్ర స్థాయిలో గాలి నాణ్యతా ప్రమాణాలు ఉన్నట్లు భావిస్తారు. ఇదీ చదవండి: లిక్కర్ కేసులో నేడు ఈడీ ఎదుటకు సీఎం కేజ్రీవాల్ -
ప్రమాదకర ప్రదేశాల్లో ఫెన్సింగ్ ఏర్పాటు
ధర్మసాగర్ : వరంగల్ నగర పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు ఆదేశాలతో ధర్మసాగర్ రిజర్వాయర్‌పై పలు ప్రమాదకరమైన ప్రదేశాల్లో ముళ్ల కంచెను, హెచ్చరిక బోర్డులను పోలీసులు ఏర్పాటు చేశారు. ఐదుగురు బీటెక్ విద్యార్థులు ఈ నెల 17న జరిగిన ప్రమాదంలో మృతిచెందిన ప్రదేశంతోపాటు, పైప్‌లైన్ పంపింగ్ ప్రదేశాల్లో ఇనుపముళ్ల కంచె ఏర్పాటు చేసి, ఎర్రజెండాలను పాతారు. ఉనికిచర్ల ఎస్ఆర్సీఎస్ పాఠశాల యాజమాన్యం, లయన్స్ క్లబ్ వారు రిజర్వాయర్‌కు వెళ్లే దారిలో, రిజర్వాయర్‌లోని పలు ప్రాంతాల్లో గతంలో రిజర్వాయర్లోపడి మృతిచెందినవారి ఫొటోలతో కూడిన హెచ్చరిక బోర్డులను ఏర్పా టు చేశారు. కాజీపేట ఏసీపీ జనార్దన్ మాట్లాడుతూ సీపీ సుధీర్‌బాబు ఆదేశాల మేరకు యుద్ధప్రాతిపదికన ఇక్కడ ముళ్లకంచె ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రిజర్వాయర్ వద్ద పోలీ సుల పహారాను కొనసాగించి ఇక్కడికి వచ్చేవారిని నీటిలోకి దిగకుండా చూస్తామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై విజయ్‌రాంకుమార్, హెచ్‌సీ ఉమాకాంత్, పోలీస్ సిబ్బంది, ఎస్సార్సీఎస్ పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.


