breaking news
Harsh Vardhan Kapoor
-
జస్ట్ రూ.కోటి కారు కొనగలనంతే.. హీరోపై ట్రోలింగ్
Harsh Vardhan Kapoor Gets Trolled For His Sad Reality: బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్, ఆయన కుమారుడు హర్షవర్ధన్ కపూర్ కలిసి నటించిన తాజా చిత్రం థార్. ఈ మూవీ మే 6 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అనిల్ కపూర్ తనయుడు హర్షవర్ధన్ కపూర్ తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో తన జీవితంలోని విషాదకరమైన వాస్తవాన్ని పంచుకున్నాడు. కానీ అదికాస్త రివర్స్ అయింది. హర్షవర్ధన్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్స్ ట్రోలింగ్‌కు దిగారు. ఈ ట్రోలింగ్‌తో నెట్టింట ట్రెండింగ్‌లో ఉన్నాడు హర్షవర్ధన్ కపూర్. ఇంటర్వ్యూలో 'ప్రేక్షకులకు ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. నాకు వస్తువులు కొనేందుకు నా తల్లిదండ్రులకు ఏమాత్రం ఇష్టముండదు. నాకు కావాల్సిన వాటిని నా సొంత డబ్బుతో కొనుక్కుంటాను. అందుకే నేను రూ. 3 కోట్ల ఖరీదుగల కారుకు బదులు కోటి రూపాయల లంబోర్గిని కారు కొనాల్సి వస్తుంది. నా దగ్గర ఉన్నదానికంటే పది రెట్లు ఎక్కువ ఉంటుందని మీరు అనుకుంటారు. నా దగ్గర 5 కార్లు, 30 గడియారాలు ఉంటాయని మీరు అనుకోవచ్చు. కానీ అది నిజం కాదు. ఇదే నా జీవితంలోని విషాదకరమైన వాస్తవం.' అని హర్షవర్ధన్ తెలిపాడు. చదవండి: నెట్‌ఫ్లిక్స్‌లో ఈ వారంలో విడుదలైన చిత్రాలు.. ఈ ఇంటర్వ్యూ చూసిన నెటిజన్స్ హర్షవర్ధన్‌ను ఆడేసుకుంటున్నారు. 'నాకు కూడా అనిల్ కపూర్ కుమారుడు హర్షవర్ధన్ కపూర్ల విచారంగా ఉండాలని ఉంది' అని ఒక యూజర్ ట్వీట్ చేశారు. మరొకరు అతనికున్న షూ వార్డ్రోబ్ చూపిస్తూ 'ఈ షూలన్ని వేసుకుని డ్రైవ్ చేయడానికి అతనికి లంబోర్గిని కారు లేదు. అదే నిజమైన బాధ.' 'ఇది చూసి ఆడిషన్స్‌కు 125సీసీ బైక్స్‌పై ఎవరు వెళ్తారు.' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: సమంత పాటంటే ఇష్టం: బాలీవుడ్ హీరో and this guy has room filled of shoes..... pic.twitter.com/IPKVFosGZP — pretty P (@sassymocha_) May 10, 2022 Strugglers who go to auditions on 125cc bikes reading this pic.twitter.com/hiyVUvCcjk — Sagar (@sagarcasm) May 10, 2022 Siddhant Chaturvedi is a legend 🔥🔥 pic.twitter.com/8bf8IhzEVx — Rahul D / राहुल / راہول (@rdalwale) May 10, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4331451957.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
అనిల్ కపూర్ కొడుకుతో డేటింగ్?
‘కామోషియాన్’ చిత్రంలో హాట్ హాట్‌గా అందాలు ఒలికించి కుర్రకారు మనసును దోచుకున్న విదేశీ మోడల్ సప్నా పబ్బి. ఆ సినిమా ఆశించినంత విజయం సాధించకపోయినా సప్నా గ్లామర్ మాత్రం క్లిక్ అయింది. అసలు విషయంలోకి వెళితే, సప్నా ఇప్పుడు అనిల్ కపూర్ తనయుడు హర్షవర్ధన్ కపూర్‌తో పీకల్లోతు ప్రేమలో ఉన్నారని సమాచారం. కొన్ని నెలలుగా వీరిద్దరూ కలిసి రెస్టారెంట్స్, పబ్స్ చుట్టూ తిరుగుతున్నారట. పైకి మాత్రం ఫ్రెండ్షిప్ అని చెబుతున్నా, వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందని బాలీవుడ్ జనాలు గుసగుసలాడుకుంటున్నారు. హర్షవర్ధన్ ప్రస్తుతం తన మొదటి చిత్రం ‘మీర్జి యాన్’ అనే సినిమా లో నటిస్తున్నారు ఈ సినిమా విడుదల వరకైనా వరకైనా మీడియా కంటపడొద్దని తండ్రి అనిల్‌కపూర్ చెప్పారట. అయినా సరే, తండ్రి మాట కాదని మరి సప్నాతో డేటింగ్ చేస్తున్నారట హర్షవర్ధన్.