breaking news
Harmony of the Seas
-
ప్రయాణికులకు షాకిచ్చిన భారీ నౌక
ప్రపంచంలోనే అతిపెద్ద నౌక ' హర్మనీ ఆఫ్ ది సీస్' లో తొలిసారి ప్రయాణించాలన్న కోరికతో ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఎక్కడెక్కినుంచో వచ్చిన వారికి నిరాశే మిగిలింది. ఇంకాపూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తవకుండానే తమకు టికెట్లు అమ్మి యాజమాన్యం సోమ్ము చేసుకుందని అందులో ప్రయాణించిన కొందరు ప్రయాణికులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. టాయిలెట్లు జామ్ అయిపోయి దుర్వాసన వస్తుందని.. ఓ ప్రయాణికుడు తన ట్విట్టర్ అకౌంట్లో ఓ ఫోటోను ట్విట్ చేశాడు. తన కొత్త డ్రెస్‌కు నౌకకు వేసిన పెయింట్ అంటుకుందని మరో ప్రయాణికుడు తెలిపారు. నౌకలో ఇంకా రిపేర్ పనులు చేస్తుండటంతో శబ్ధాలకు చిర్రెత్తుకొస్తోందంటూ మరొకరు. కొన్ని చోట్ల నీరు లీక్ అవ్వడంతో బయటకు వచ్చి చేరిందంటూ హర్మనీ ఆఫ్ ది సీస్ తొలి ప్రాయణికులు తమ ఛేదు అనుభవాలను తెలిపారు.. ఇంకా నౌకలోని కొన్ని చోట్ల పనులు పూర్తవకపోడంతో వాటిని మూసివేసి పనులు చేస్తున్నారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ప్రయాణికులు చాలా మంది ఒక చోట చేరి ఇంకా పూర్తి కాని నౌక టికెట్లు ఎలా అమ్ముకుంటారని ధ్వజమెత్తారు. మా టికెట్ల డబ్బు తిరిగి ఇచ్చే వరకు అక్కడి నుంచి వెళ్లమంటూ తమ నిరసన తెలిపారు. హర్మనీ ఆఫ్ ది సీస్ 362 మీటర్లతో ఏకంగా ఈఫిల్ టవర్ ఎత్తుకన్నా పొడవుతో ప్రపంచంలోనే విశాలమైన నౌకగా గుర్తింపుపొందింది. 16 అంతస్తులు, విశాలమైన 20 డైనింగ్ రూంలు, 23 స్విమ్మింగ్ పూల్స్, ఓ పార్కు, 10వేల మొక్కలు, 50 వృక్షాలు, వినోదాల కోసం ప్రత్యేకంగా థియేటర్లతోపాటూ 2500 రూములతో నగరమే కదులుతుందా అనే రీతిలో ఉన్న ఈ నౌక 6,360 మంది ప్రయాణికులను తీసుకు వెళ్లే సామర్థ్యం కలిగిఉంది. దీన్ని తయారుచేయడానికి దాదాపు 660 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. హాలిడే ను ఆస్వాదించాలని వచ్చిన ఓ వ్యక్తి తాను పోచ్డ్ ఎగ్స్ ఆర్డర్ చేస్తే వాళ్లు మరోటి తీసుకు వచ్చారు అంటూ ఫోటోను ట్విట్ చేశారు. -
అది ఓ కదిలే నగరమే..
ప్రపంచంలోనే అతిపెద్ద నౌక ' హర్మనీ ఆఫ్ ది సీస్' సముద్రంలో దూసుకుపోతోంది. ఫ్రెంచ్ షిప్ యార్డులో దీన్ని తయారు చేయడానికి 32 నెలలు సమయం పట్టింది. ఫ్రాన్స్‌లోని వెస్టర్న్ పోర్టు టౌన్ లోని సెయింట్-నజైర్ నుంచి యూకేకు బయలుదేరిన హర్మనీ ఆఫ్ ది సీస్‌కు వేలాది మంది ఫ్రెంచ్ అభిమానులు ఘనంగా వీడ్కోలు పలికారు. దీన్ని తయారుచేయడానికి దాదాపు 660 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. హర్మనీ ఆఫ్ ది సీస్ 362 మీటర్లతో ఏకంగా ఈఫిల్ టవర్ ఎత్తుకన్నా పొడవుతో ప్రపంచంలోనే విశాలమైన నౌకగా గుర్తింపుపొందింది. 16 అంతస్తులు, విశాలమైన 20 డైనింగ్ రూంలు, 23 స్విమ్మింగ్ పూల్స్, ఓ పార్కు, 10వేల మొక్కలు, 50 వృక్షాలు, వినోదాల కోసం ప్రత్యేకంగా థియేటర్లతోపాటూ 2500 రూములతో నగరమే కదులుతుందా అనే రీతిలో ఉన్న ఈ నౌక 6,360 మంది ప్రయాణికులను తీసుకు వెళ్లే సామర్థ్యం కలిగిఉంది. మే22న అధికారిక తొలి ప్రయాణానికి బార్సిలోనాలో ఏర్పాట్లు చేస్తున్నారు.