breaking news
Harley-Davidson motorcycles
-
హార్లే-డేవిడ్సన్ స్కూటర్ ఎలా ఉంటుందో చూశారా...!
హార్లే-డేవిడ్సన్ ఈ పేరు వినగానే మనకు గుర్తువచ్చేవి ప్రీమియం లగ్జరీ మోటార్స్ బైక్స్. అమెరికాకు చెందిన హార్లే-డేవిడ్సన్ బైక్స్ మోడళ్ల ప్రారంభ ధరలు పది లక్షల నుంచి మొదలై 40 లక్షల వరకు ఉంటాయి. 1950లో హోండాకు పోటీగా హార్లే-డేవిడ్సన్ టాపర్ అనే స్కూటర్‌ను ఉత్పత్తి చేసింది. హార్లే-డేవిడ్సన్ బైక్‌ల స్థానంలో స్కూటర్లను ఉత్పత్తి చేస్తోందని ఎవరు ఊహించలేరు. చదవండి: ఇప్పుడు ఫేవరెట్ టెస్లా కాదు..! ఇండియన్ కంపెనీ కోసం క్యూ! హార్లే-డేవిడ్సన్ కేవలం ఐదు ఏళ్ల పాటు మాత్రమే ఈ స్కూటర్లను ఉత్పత్తి చేసింది. ఈ స్కూటర్ ధర రూ. 9 లక్షలకు విక్రయించింది. రానున్న రోజుల్లో మెకమ్ లాస్ వేగాస్ మోటార్ సైకిల్స్-2022 షోలో హార్లే-డేవిడ్సన్ స్కూటర్ టాపర్‌ను వేలం వేయాలని కంపెనీ భావిస్తోంది. హార్లీ డేవిడ్సన్ టాపర్ స్కూటర్లు అంతగా ఆదరణ లభించలేదు. హార్లే-డేవిడ్సన్ టాపర్ మూడు మోడళ్లలో దేనిని వేలం వేస్తుందనే విషయంపై అస్పష్టంగా ఉంది. వేలం వచ్చే ఏడాది జనవరి 25 నుంచి జనవరి 29 వరకు జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ రెట్రో స్కూటర్ వేలంపై ఇప్పటికే భారీ అంచనాలు నమోదవుతున్నాయి. హార్లే-డేవిడ్సన్ టాపర్ స్కూటర్ ప్రత్యేకతుల ఇవే...! హార్లే-డేవిడ్సన్ టాపర్ స్కూటర్లో సింగిల్ సిలిండర్, ఫ్లాట్-మౌంటెడ్ టూ-స్ట్రోక్ ఇంజిన్ ఏర్పాటుచేశారు. ఐదు నుంచి తొమ్మిది హార్స్పవర్ల పవర్ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేయగలదు. ఈ స్కూటర్ 20-అంగుళాల రియర్టైర్లను కలిగి ఉంది. ఈ స్కూటర్ సుమారు గంటకు 74 కిలోమీటర్ల గరిష్టవేగంతో ప్రయాణిస్తుంది. ఈ స్కూటర్ ఇంకో ప్రత్యేకత ఎంటంటే..దీనికి మరో సీట్ క్యాబిన్‌ను అమర్చుకోవచ్చును. చదవండి: వీటిపై ఇన్వెస్ట్ చేస్తే లాభాలే..లాభాలు...! -
గాలికే గుబులు...
వాళ్లు బైక్స్ మీద దూసుకెళ్తుంటే.. ధూమ్ సినిమా ఫ్రీ రివ్యూ చూసినట్టనిపిస్తుంది. హైవేల్లో రయ్‌మంటూ.. గాలికే గుబులు రేపుతారు. హార్లీ డేవిడ్సన్ మోటార్ సైకిళ్లు.. వాటి మీద కండలు తిరిగిన మొనగాళ్లు.. వీరి మధ్యన మరో బైక్ మీద ఓ మెరుపుతీగ. ఆమె పేరు అనుశ్రీయ గులాటి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సాగే హిమాలియన్ చాప్టర్ గ్రూప్‌లో ఈమె కూడా ఓ రైడర్. స్వేచ్ఛను ఆస్వాదిస్తూ సాగిపోయే లాంగ్ జర్నీలో అమ్మాయి ఎందుకుంది..? అసలు వీరి ప్రయాణం వెనుక ఉన్న కోణమేంటి..? ఈ వివరాలన్నీ ఇటీవల సదరన్ ఫేజ్ 3 ర్యాలీ కోసం హైదరాబాద్ వచ్చిన హిమాలియన్ చాప్టర్ గ్రూప్ ‘సిటీప్లస్’కు వివరించింది. వేల కిలోమీటర్లు సాగే హిమాలియన్ చాప్టర్ ప్రధాన లక్ష్యం ఒకటే. అదే సేవ్ ద గాళ్. కాస్త డిఫరెంట్ లుకప్తో కనిపించినా.. ఇంకాస్త డిఫరెంట్ రూట్ ఎంచుకున్నా వీరి ఉద్దేశం మాత్రం అందరికీ నచ్చేదే. భారతావని ఆ కొస నుంచి ఈ కొస వరకూ వందలాది గ్రామాలు, పట్టణాల మీదుగా వీరి యాత్ర సాగిపోతుంది. వీరు ఆడపిల్లల రక్షణపై అవేర్నెస్ కల్పించే పనిని భుజానికెత్తుకుని ఎందరిలోనో మార్పు తీసుకొస్తున్నారు. అందుకే ఈ గ్రూప్‌లో చేరి తనవంతు కృషి చేస్తోంది అనుశ్రీయ. అమ్మాయిలు ఏదైనా చేయగలరని తనను తాను ఉదాహరణగా చూపిస్తూ ముందుకెళ్తోంది ఈ జర్నలిజం విద్యార్థిని. ఇద్దరూ సమానమే.. మన దేశంలో ఆడపిల్లల పట్ల ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. మా గ్రూప్‌లో అమ్మాయి వుంది, ఆమెను ఒక మస్కట్లా ప్రమోట్ చేస్తూ మంచి విషయాన్ని ప్రమోట్ చేయాలనుకున్నాం. ఆడామగా ఇద్దరూ ముఖ్యమే, ఇద్దరూ సమానమే. ఆడపిల్లలు తక్కువనే ఓల్డ్ మైండ్ సెట్ మారి.. అమ్మాయిలంటే గౌరవం పెరగాలి. అందుకే ఈ కాజ్ ఎంచుకున్నాం. -కరణ్ చెహెల్ గర్వంగా ఉంది.. బైక్ రైడర్స్ అంటే దృఢమైన దేహంతో, స్వేచ్ఛగా తిరుగుతూ ఎంజాయ్ చేసే వాళ్లు మాత్రమే అనే అభిప్రాయం వుంది. వారికి సమాజంలోని సమస్యల గురించి ఆలోచించే సున్నితత్వం లేదని కూడా అనుకుంటారు. అది నిజం కాదని నిరూపించేందుకు గతంలో కూడా ఇలాంటి రైడ్స్ నిర్వహించాం. రైడ్ ఫర్ చారిటీ, మర్ద్-మెన్ అగెనైస్ట్ రేప్స్ అండ్ డిస్క్రిమినేషన్ రైడ్లు నిర్వహించాం. ఈసారి ఈ 19 ఏళ్ల అమ్మాయితో సేవ్ ద గర్ల్ చైల్డ్ రైడ్ నిర్వహిస్తున్నందుకు చాలా గర్వంగా వుంది. - సంప్రీత్ సింగ్, చండీగఢ్ అవేర్నెస్ కోసం.. ‘మాది డెహ్రాడూన్. 15 ఏళ్ల వయసు నుంచి బైక్ రైడ్ చేయడం మొదలు పెట్టాను. అప్పట్లో రాయల్ ఎన్ఫీల్డ్ డ్రైవ్ చేసేదాన్ని. 2014లో నా పుట్టిన రోజుకు మా మామయ్య హార్లీ డేవిడ్సన్ బైక్ ప్రజెంట్ చేశారు. మా అంకుల్ ప్రోత్సాహంతో ఈ గ్రూప్‌లో చేరాను. మేమంతా ఈ పెద్దబండ్ల మీదే వేల కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంటాం. ఎన్నో ఊళ్ల మీదుగా వెళ్తుంటాం. అలాంటప్పుడు మా ప్రయాణం పదిమందికి ఒక మెసేజ్ ఇస్తే బాగుంటుందన్న ఆలోచన వచ్చింది. సిటీల్లో సేవ్ ద గాళ్ చైల్డ్ గురించి అవేర్నెస్ బాగానే ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఆడబిడ్డల విషయంలో మరింత అవగాహన రావాల్సి ఉంది. ఆడపిల్ల పుట్టిందని చిన్నతనంలోనే చిన్నారుల ప్రాణాలు తీసిన సంఘటనలు మమ్మల్ని కదిలించాయి. భ్రూణహత్యలు జరుగుతూనే ఉన్నాయి. వీటికి అడ్డుకట్ట వేయడానికి మా రైడింగ్‌ను వేదికగా మలచుకున్నాం’ అని తెలిపింది అనుశ్రీయ. ఇద్దరూ సమానం.. ఆడశిశువు రక్షణ కోసం మొదలైన ఈ రైడ్ ఇప్పటికే ఎన్నో గ్రామాలు చుట్టేసింది. ‘గ్రామాల్లో పెద్ద బండ్లను చూడగానే చాలా మంది మా దగ్గరికి వారంతట వారే వచ్చేస్తారు. మొదట మొహమాటపడ్డా.. తర్వాత మాతో కలసిపోతారు. చిన్నపిల్లలైతే మాతో ఫొటోలు కూడా దిగుతారు. వాళ్లతో ఇంటరాక్షన్ పెరిగిన తర్వాత వారితో ఓ ఐదు నిమిషాలు మాట్లాడుతాం. ఆడపిల్లలను సేవ్ చేయమని చెబుతాం. అమ్మాయిలను కాపాడుకోవడం ఎంత అవసరమో, అమ్మాయిలకు అవకాశం ఇస్తే ఎన్ని అద్భుతాలు చేయగలరో ఉదాహరణలతో వివరిస్తాం. వారి నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. ఒక ఊళ్లో మా మాటలు విన్న తర్వాత ఓ తల్లి తన పాపని ముద్దాడి కంటతడి పెట్టుకుంది’ అని అవేర్నెస్ రైడ్ విశేషాలు తెలిపింది అనుశ్రీయ.