breaking news
Handloom loan waiver
-
నేత.. మళ్లీ గుండెకోత!
జాతీయ చేనేత దినోత్సవాన్ని బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నట్లు చేనేత, జౌళిశాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. చీరాలలో నిర్వహించే రాష్ట్రస్థాయి కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరవుతారని తెలిపారు.సాక్షి, అమరావతి: మానవాళికి వస్త్రాన్ని అందించి గౌరవాన్ని కలి్పంచిన నేతన్న బతుకు నేడు ఆధునిక యంత్రాలతో పోటీపడలేక ఛిద్రమవుతోంది. మువ్వన్నెల జెండా నేసిన చేనేతకు చేయూత కరువైంది. మంచి వ్రస్తాన్ని నేయడానికి మూడు పూటలూ కష్టపడే నేతన్న నేడు తన బిడ్డలకు ఒక్క పూట కూడా కడుపునిండా తిండి పెట్టలేకపోతున్నాడు. వైఎస్ జగన్ తన పాలనలో గత ఐదేళ్లూ చేనేత రంగానికి సంక్షేమ రంగులు అద్దితే.. చంద్రబాబు మరోసారి అబద్ధాల హామీల అల్లికలతో దగా చేస్తున్న వైనాన్ని నేతన్నలు గుర్తు చేసుకుంటున్నారు. నేడు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కూటమి కుట్రలకు మగ్గం చిన్నబోతున్న వైనంపై ప్రత్యేక కథనం ఇది.. అలవిగాని హామీలతో అధికారం చేపట్టి, ఆపై చెయ్యివ్వడంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎవరూ సాటిరారు. 2014 ఎన్నికల ముందు ఎలాగైనా అధికారంలోకి రావాలన్న ఆశతో 600కుపైగా అడ్డగోలు హామీలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా చేనేత రంగానికి ఇచ్చిన 25కు పైగా హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదు. ప్రతి చేనేత కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తానని హామీ ఇచ్చి.. ఐదేళ్లూ కాలయాపన చేశారు. తాజాగా 2024 ఎన్నికల్లోనూ ఇదే తరహాలో ఇచి్చన ఉచిత విద్యుత్ హామీ అమలుకు ఇంకా అడుగు ముందుకు వేయడం లేదు.మర మగ్గాలు (పవర్ లూమ్స్)కు 500 యూనిట్లు, చేనేత మగ్గాలు (హ్యాండ్లూమ్స్)కు 200 యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్ అందిస్తానని ఇటీవల ఎన్నికల్లో హామీ ఇచ్చారు. మొత్తంగా రాష్ట్రంలో చేనేత మగ్గాలు సుమారు 1.60 లక్షలు ఉంటాయని అంచనా. మరమగ్గాలు వీటికి అదనం. వీటిపై ఇప్పటికే ప్రభుత్వం వద్ద తగిన సమాచారం ఉంది. దీంతో ఆయా చేనేత కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందించడానికి ఏ అడ్డంకులూ లేవు. అయినా ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుండటంపై నేతన్నలు మండిపడుతున్నారు. ఇప్పుడూ జగన్ ప్రభుత్వం ఉండి ఉంటే జూలైలోనే ప్రతి నేతన్న కుటుంబానికి రూ.24 వేలు అందేది. దీంతోపాటు వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ లా నేస్తం, జగనన్న అమ్మఒడి, పంటల బీమా, జగనన్న విదేశీ విద్యాదీవెన, వసతి దీవెన పథకాల కింద కూడా ఇప్పటికే లబ్ధి చేకూరేది.జీఎస్టీ రీయింబర్స్మెంట్ మెలికపెట్టిన బాబు చేనేత వ్రస్తాలకు జీఎస్టీ ఎత్తివేయాలన్న డిమాండ్‌ను అడ్డుపెట్టుకుని చంద్రబాబు మోసపూరిత హామీ ఇచ్చారని నేతన్నలు మండిపడుతున్నారు. జీఎస్టీ రీయింబర్స్మెంట్ చేస్తానని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన బాబు.. అది ఎలా చెల్లిస్తారో చెప్పలేదు. చేతి వృత్తులు, గ్రామాల్లో కుటీర పరిశ్రమలపై పన్నులు వేయకూడదని రాజ్యాంగంలోని ఆరి్టకల్ 43 చెబుతోంది. అయినప్పటికీ రూ.వెయ్యి లోపు చేనేత వ్రస్తాల విక్రయాలపై 5 శాతం జీఎస్టీ, రూ.వెయ్యి దాటితే 12 శాతం జీఎస్టీ వసూలు చేస్తున్నారు.ఇందులో తయారీదారు షాపులకు విక్రయిస్తే.. షాపుల ద్వారా వినియోగదారులకు విక్రయిస్తారు. దీంట్లో వినియోగదారులే (ప్రజలు) జీఎస్టీ చెల్లిస్తారు. ఈ లెక్కన చంద్రబాబు ఎవరికి జీఎస్టీ రీయింబర్స్ చేస్తారు? తయారీదారులు, విక్రయదారులకు ఇవ్వడానికి ప్రభుత్వ నిబంధనలు అనుమతించవు. ఎందుకంటే జీఎస్టీ చెల్లించింది ప్రజలు కాబట్టి. వారే దరఖాస్తు చేసుకోవాలా? రూ.వెయ్యికిపైగా చెల్లించి చేనేత చీర కొనుక్కున్న వినియోగదారుడు రూ.120 (12 శాతం) జీఎస్టీ రీయింబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేసుకుంటాడా?2014లోనూ బాబు దగా.. 2014లోనూ చంద్రబాబు నేతన్నలను దగా చేశారు. చేనేత రుణాలు మాఫీ చేస్తానని హామీ ఇచ్చి, దానిపై అధ్యయనానికి కమిటీ వేస్తూ జీవో ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. దీంతో చేనేత కుటుంబాలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. చేనేత కుటుంబాలకు ఇళ్లు, హెల్త్‌కార్డులు, మగ్గానికి రూ.లక్షన్నర చొప్పున సాయమందిస్తానని మోసం చేశారు. రూ.వెయ్యి కోట్లతో ప్రత్యేక నిధి, వర్షాకాలంలో రెండు నెలలపాటు నేత విరామానికి ఒక్కొక్క చేనేత కారి్మకుడికి రూ.4 వేల సాయం, నెలకు వంద యూనిట్ల ఉచిత విద్యుత్ హామీలకు మంగళం పాడారు.జీఎస్టీ రద్దు చేస్తే నిజంగా మేలుచంద్రబాబు ప్రకటించిన జీఎస్టీ రీయింబర్స్మెంట్ కంటే జీఎస్టీ రద్దు చేస్తేనే చేనేత రంగానికి నిజంగా మేలు జరుగుతుంది. హామీ ఇవ్వాలి కానీ, అది అమలు కాకూడదు అన్నట్లు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. చేనేత వస్త్రాలపై జీఎస్టీ రద్దుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గట్టి ప్రయత్నం చేశారు. ఈ విషయమై అప్పట్లో ఎంపీలు వి.విజయసాయిరెడ్డి, వంగా గీత, గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి బృందం ప్రత్యేకంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి విజ్ఞప్తి చేసింది. ఇప్పుడైనా సీఎం చంద్రబాబు ఈ విషయమై చిత్తశుద్ధితో అడుగులు వేయాలి. – బండారు ఆనందప్రసాద్, జాతీయ అధ్యక్షుడు, ఆలిండియా వీవర్స్ ఫెడరేషన్ -
చంద్రబాబు 420
► సీఎంపై కేసులు నమోదు చేయాలని అన్ని ► నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్సీపీ ఫిర్యాదులు ► అనంతపురం టూటౌన్లో ఫిర్యాదు చేసిన ► ఎమ్మెల్యే విశ్వ, మాజీ ఎంపీ అనంత, గురునాథరెడ్డి ► పెనుకొండలో జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ ఫిర్యాదు (సాక్షిప్రతినిధి, అనంతపురం) ‘అధికారం చేపట్టి రెండేళ్లయ్యింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్కహామీ చంద్రబాబు నెరవేర్చలేదు. రైతు, డ్వాక్రా, చేనేత రుణమాఫీతో పాటు ఇంటింటికీ ఉద్యోగం, నిరుద్యోగ భృతి.. ఇలా అనేక హామీలిచ్చి అన్నివర్గాలను వంచించారు. చివరకు తన స్వార్థం కోసం ప్రత్యేకహోదా అంశాన్ని పక్కనబెట్టి ఏకంగా రాష్ట్రాన్నే మోసం చేశారు. కావున సెక్షన్ 420 ప్రకారం సీఎంపై ఛీటింగ్ కేసు నమోదు చేయాల’ని వైఎస్సార్సీపీ నేతలు బుధవారం పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా 14 నియోజకవర్గాల్లోనూ ఆయా నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్టీ ముఖ్యనేతల ఆధ్వర్యంలో ఫిర్యాదులు సమర్పించారు. రెండేళ్లపాలనలో చంద్రబాబు రాష్ట్రానికి చేసిన మోసం, ప్రజలు నష్టపోయిన తీరును ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. అనంతపురంలో పార్టీ రాష్ట్రప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి, క్రమశిక్షణకమిటీ సభ్యుడు ఎర్రిస్వామిరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు సమావేశమయ్యారు. రాష్ట్రానికి రెండేళ్లలో జరిగిన అన్యాయంపై చర్చించారు. అనంతరం టూటౌన్ పోలీసుస్టేషన్లో ఎస్ఐ క్రాంతికుమార్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. చంద్రబాబు వ్యవహారమంతా మోసపూరితమని, ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభపెట్టి వైఎస్సార్సీపీ విజయావకాశాలను దెబ్బతీసినందున ఐపీసీ 415, 420, ప్రజాప్రాతినిథ్యచట్టం- 1951లోని సెక్షన్ 123(4) ప్రకారం ఆయనపై వెంటనే కేసు నమోదు చేయాలని కోరారు. పెనుకొండ పోలీసుస్టేషన్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ ఫిర్యాదు చేశారు. చంద్రబాబు వైఖరితో మోసపోని ప్రజలు రాష్ట్రంలో లేరని ఆయన అన్నారు. రాయదుర్గంలో మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, గుంతకల్లులో పార్టీ సమన్వయకర్త వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. రెండేళ్లలో చంద్రబాబు ఏస్థాయిలో మోసం చేశారో.. రాబోయే కాలంలో ఇంతకంటే తీవ్రస్థాయిలో మోసగించే అవకాశం ఉందని, కాబట్టి ఆయన వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మడకశిరలో సమన్వయకర్త డాక్టర్ తిప్పేస్వామి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం పోలీసుస్టేషన్‌కు చేరుకుని ఎస్ఐకు ఫిర్యాదు అందజేశారు. తాడిపత్రిలో సమన్వయకర్త, అదనపుసమన్వయకర్త రమేశ్‌రెడ్డిలు చంద్రబాబుపై 420 కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. ఉరవకొండలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ చేపట్టారు. తర్వాత జెడ్పీటీసీ సభ్యుడు తిప్పయ్య, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వీరన్న ఆధ్వర్యంలో స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కళ్యాణదుర్గంలో మండల కన్వీనర్లు స్థానిక డీఎస్పీ అనిల్‌కు ఫిర్యాదు అందజేశారు. హిందూపురంలో సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి.. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చంద్రబాబు స్థాయిలో రాష్ట్ర ప్రజలను మోసం చేసిన వ్యక్తి దేశంలో మరొకరు లేరని పుట్టపర్తి సమన్వయకర్త శ్రీధర్‌రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే కదిరిలో పార్టీ సీఈసీ సభ్యుడు సిద్దారెడ్డి, శింగనమలలో నియోజకవర్గ నేత ఆలూరి సాంబశివారెడ్డి, ధర్మవరంలో వైఎస్సార్సీపీ కౌన్సిలర్ నారాయణరెడ్డి, రాప్తాడులో మండల కన్వీనర్ రామాంజనేయులు ఆధ్వర్యంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
'ఎన్నికల ముందు చేనేత రుణాలు మాఫీఅన్నారు'