breaking news
hacking case
-
మహేష్ బ్యాంక్ హ్యాకింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం
-
ఈ-సేవ మెయిల్ ఐడీ హ్యాకింగ్‌పై కేసు
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ఈసేవ మెయిల్ ఐడీ హ్యాక్ ఘటనపై సీసీఎస్ పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. ఈసేవ మెయిల్ ఐడీ హ్యాక్ చేసిన నైజీరియన్లు డబ్బును వేరే అకౌంట్‌కు ట్రాన్స్ఫర్ చేయాలని యాక్సిస్ బ్యాంక్‌కు మెయిల్ పెట్టారు. దీంతో బ్యాంక్ అధికారులు ఆ ఖాతాలో కోటికి పైగా రూపాయలను బదిలీ చేశారు. వెంటనే నైజీరియన్లు దాదాపు రూ.80 లక్షల వరకు డ్రా చేసుకున్నారు. దీనిపై ఈసేవ అధికారులు సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి.. డబ్బు ట్రాన్స్ఫర్ చేసిన అకౌంట్‌ను ఫ్రీజ్ చేశారు. -
హ్యాకింగ్ కేసులో నిందితుడికి ఆర్నెల్ల జైలు
సాక్షి, హైదరాబాద్: కంప్యూటర్ను హ్యాక్ చేసి సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్‌ను తస్కరించి అమ్ముకున్న కేసులో చంద్రమౌళి అనే మార్కెటింగ్ కన్సల్టెంట్‌కు సీఐడీ ప్రత్యేక కోర్టు ఆరు నెలల కఠిన కారాగార శిక్ష విధించింది. దాంతోపాటు రూ. 4 వేలు జరిమానా చెల్లించాలని.. లేకపోతే మరో ఆరు నెలలు సాధారణ జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుందని పేర్కొంటూ న్యాయమూర్తి భాస్కర్‌రావు సోమవారం తీర్పు వెలువరించారు. ఎస్.శ్రీహరి అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ తాను రూపొందించిన ఒక ప్రోగ్రామ్‌ను మార్కెటింగ్ చేసేందుకు చంద్రమౌళితో ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే శ్రీహరికి తెలియకుండా ఆయన కంప్యూటర్ను చంద్రమౌళి హ్యాక్ చేసి ఆ ప్రోగ్రామ్‌ను తస్కరించి, ఇతరులకు అమ్ముకున్నాడు. దీనిపై శ్రీహరి ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 406, ఐటీ చట్టం సెక్షన్ 66 కింద పోలీసులు కేసు నమోదు చేయగా.. విచారణలో చంద్రమౌళిని దోషిగా నిర్ధారిస్తూ న్యాయమూర్తి శిక్ష విధించారు.