breaking news
Habibnagar police station
-
బీదర్ కేంద్రంగా ‘నిట్రావెట్’ దందా
సాక్షి, హైదరాబాద్: హబీబ్‌నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో ఇద్దరు జేబు దొంగల అరెస్టుతో చిక్కిన తీగ లాగితే.. కర్ణాటకలోని బీదర్ కేంద్రంగా సాగుతున్న నిట్రావెట్ టాబ్లెట్స్ అక్రమ దందా వెలుగులోకి వచ్చింది.నగర కొత్వాల్ సందీప్ శాండిల్య, డీసీ పీలు సునీల్‌దత్, చక్రవర్తి గుమ్మిలతో కలిసి శనివా రం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించా రు. మల్లేపల్లిలోని మాన్గార్ బస్తీకి చెందిన ఎన్.చక్రధారి గుల్బర్గా నుంచి నిట్రావెట్ మాత్రలను అక్రమంగా ఖరీదు చేసి, నగరానికి తరలించి విక్రయిస్తుంటాడు. తీవ్రమైన రక్తపోటు, మధుమేహ వ్యా ధులతో బాధపడుతున్న వారికి రాత్రి వేళల్లో సరిగ్గా నిద్రపట్టదు. ఈ కారణంగా వైద్యులు రోగులకు ఈ మాత్రలను ప్రిస్రై్కబ్ చేస్తారు. నార్త్‌జోన్ టాస్‌్కఫోర్స్ పోలీసులు గత ఆదివారం చక్రధారిని అరెస్టుచేసి విచారిస్తున్న సమయంలోనే బీదర్‌కు చెందిన బిర్జు ఉపాధ్యాయ వీటిని సరఫరా చేస్తున్నట్లు బయటపెట్టాడు. దీంతో ఈ సమాచారాన్ని టాస్‌్కఫోర్స్ పోలీసులు టీఎస్ నాబ్‌కు అందించారు. -
ఉద్యోగం చేసుకో అన్నందుకు...
నాంపల్లి (హైదరాబాద్): ఏదైనా ఉద్యోగం చేసుకోవాలని తల్లిదండ్రులుగా మందలించారు. దానికే మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మంగళవారం తెల్లవారుజామున హబీబ్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అఫ్జల్‌సాగర్‌కు చెందిన కె. ఈశ్వర్ కుమారుడు సునీల్ కుమార్ (25) ఇటీవలే హోటల్ మేనేజ్మెంట్ కోర్సు పూర్తి చేసి ఇంట్లోనే ఖాళీగానే ఉంటున్నారు. తల్లిదండ్రులు గత కొన్ని రోజులుగా ఏదైనా ఉద్యోగం చేసుకో నాయనా అంటూ బుద్ధులు చెప్పారు. ఈ బుద్ధులు అతడికి నచ్చక ఉద్యోగం చేసుకోలేక జీవితంపై విరక్తి చెంది మంగళవారం తెల్లవారు జామున తన గదిలో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.