ఉద్యోగం చేసుకో అన్నందుకు... | A youngster commits suicide ask to do job | Sakshi
Sakshi News home page

ఉద్యోగం చేసుకో అన్నందుకు...

Jul 7 2015 10:39 PM | Updated on Sep 3 2017 5:04 AM

ఏదైనా ఉద్యోగం చేసుకోవాలని తల్లిదండ్రులుగా మందలించారు. దానికే మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.

నాంపల్లి (హైదరాబాద్): ఏదైనా ఉద్యోగం చేసుకోవాలని తల్లిదండ్రులుగా మందలించారు. దానికే మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మంగళవారం తెల్లవారుజామున హబీబ్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అఫ్జల్‌సాగర్‌కు చెందిన కె. ఈశ్వర్ కుమారుడు సునీల్ కుమార్ (25) ఇటీవలే హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు పూర్తి చేసి ఇంట్లోనే ఖాళీగానే ఉంటున్నారు.

తల్లిదండ్రులు గత కొన్ని రోజులుగా ఏదైనా ఉద్యోగం చేసుకో నాయనా అంటూ బుద్ధులు చెప్పారు. ఈ బుద్ధులు అతడికి నచ్చక ఉద్యోగం చేసుకోలేక జీవితంపై విరక్తి చెంది మంగళవారం తెల్లవారు జామున తన గదిలో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement