breaking news
Gurupurnima
-
Guru Purnima 2025 ఉపాసన తొమ్మిది వారాల సాయిబాబా వ్రతం
ప్రముఖ వ్యాపారవేత్త, హీరో రామ్‌చరణ్ భార్య ఉపాసన ఆధ్యాత్మికత, ఆనందం కోసం వ్రతాన్ని ఆచరిస్తునట్టు ప్రకటించారు. ఈ గురు పూర్ణిమకు తాను తొమ్మిది వారాల సాయిబాబా వ్రతాన్ని ప్రారంభిస్తున్నానని అభిమానులతో పంచుకున్నారు. తద్వారా దేవునితో అనుబంధంతో పాటు అభిమానులతో కూడా కనెక్ట్ అవ్వడానికి ఇదొక మార్గమంటూ ఆమె పోస్ట్ చేశారు. చిన్నప్పటినుంచీ దైవంమీద ఎంతో భక్తి. మా తల్లిదండ్రులు పిలిస్తే పలికే దైవం శిర్డీ సాయినాధుడిని భక్తితో కొలవడం చూశాను. తన భర్త రామ్‌చరణ్‌కు అయ్యప్ప ఎలాగో తనకు సాయిబాబా అలా అని తెలిపింది. సాయిబాబా వ్రత కల్పం చదవడం మొదలు పెట్టగానే తనలో పాజిటివ్ వైబ్, తన చుట్టూ ఉన్నవారిలో కూడా సానుకూల దృక్పథం అలడుతుందని చెప్పుకొచ్చారు. ది. దీనికి సంబంధించి ఒక వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేసారు. ఆ ఆధ్యాత్మిక ప్రయాణంలో తనతో కలిసి రావాలని ఆహ్వానించారు.సాయిబాబా తొమ్మిదివారాల వ్రతం అంటేకోరిక కొర్కెలు నెరవేరేందుకు కులమతాలకు అతీతంగా, స్త్రీ పురుష భేదము లేకుండా సాయి బాబా భక్తులు తొమ్మిది వారాల పాటు ఆచరిస్తారు. పసుపు రంగు వస్త్రాలు ధరించాలి. ప్రతి గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి. సాయి భగవానుని ప్రార్థించి గురువారం రోజున ఈ వ్రతమును ప్రారంభించాలి. ఉదయం, సాయంత్రి నిష్టతో సాయినాధుడిని పూజించాలి. 9 గురువారములు సాయి మందిరానికి వెళ్ళి ప్రార్థించాలి. వత్రం పూర్తైనా తరువాత కొంతమంది షిర్డీ వెళ్లి సాయిబాబాను దర్శించు కుంటారు. బీదలకు అన్నదానం చేస్తారు. 5 లేదా 11 మందికి శ్రీసాయి వ్రత పుస్తకాలను ఉచితంగా ఇవ్వడం ఆనవాయితీ. (జిమ్‌కు వెళ్లకుండానే 30 కిలోలు తగ్గింది)అత్యంత భక్తితో, నిష్టతో ఆచరిస్తే ఫలితం దక్కుతుందని భక్తుల విశ్వాసం. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల అసంపూర్తిగా ఆగిపోయిన పనులు పూర్తవుతాయని, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని, ఆర్థిక బాధలుండవని నమ్ముతారు. అలాగే వృత్తి వ్యాపారాలలో పురోగతి, విజయం లభిస్తాయని, ఐశ్వర్యం, కుటుంబ శాంతి, విద్య, ఉద్యోగం, వివాహం ఇలా సకల మనోభీష్టాలు నెరవేరుతాయని చెబుతారు. View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
నాలుగోసారి...
హీరో అల్లు అర్జున్ , దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో నాలుగో సినిమా తెర కెక్కనుంది. ‘జులాయి’ (2012), ‘సన్నాఫ్ సత్యమూర్తి’ (2015), ‘అల..వైకుంఠపురములో..’ (2020) చిత్రాల తర్వాత అల్లు అర్జున్ , త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందనున్న కొత్త సినిమా ప్రకటన వెల్లడైంది. పద్మశ్రీ అల్లు రామలింగయ్య–మమత సమర్పణలో హారిక–హాసినీ క్రియేషన్్స, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నాయి. సోమవారం గురుపూర్ణిమ సందర్భంగా ఈ సినిమాను అధికారికంగా ప్రక టించారు. ‘ప్రపంచవ్యాప్త ప్రేక్షకులను అలరించడానికి అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమాను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ సినిమాకు చెందిన నటీనటులు, సాంకేతిక నిపుణులు, ఇతర వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. కాగా ఈ సినిమా సోషియో ఫ్యాంటసీ బ్యాక్ డ్రాప్లో ఉంటుందని టాక్. -
వైభవంగా సింహ గిరి ప్రదక్షిణ
విశాఖపట్నం: గురుపౌర్ణమి సందర్భంగా సింహాద్రి అప్పన్నను దర్శించుకునేందుకు మంగళవారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సుమారు 32 కిలోమీటర్ల మేర సింహగిరి చుట్టు భక్తులు ప్రదక్షిణ మొదలుపెట్టారు. సింహగిరి తొలి పావంచా దగ్గర కొబ్బరి కాయ కొట్టి నమో నరసింహా అంటూ నడక ప్రారంభించిన భక్తులు... అడవివరం, ముడసర్లోవ, హనుమంతవాక, విశాలాక్షినగర్, జోడుగుళ్ల పాలెం, అప్పుఘర్, ఎంవీపీ కాలనీ, వెంకోజీ పాలెం మీదుగా సీతమ్మధార, పోర్టు స్టేడియం, కప్పరాడ, మురళీనగర్, మాధవధారకు చేరుకుంటారు. అక్కడ నుంచి హైవేపై ఆర్ అండ్ బీ, ఎన్ఏడీ, గోపాలపట్నం మీదుగా సింహాచలం కొండకు వెళ్తారు.