breaking news
gurugovind Singhs 350 birth anniversary
-
గురు గోవింద్ స్మారక నాణేలు విడుదల
సాక్షి, న్యూఢిల్లీ : గురు గోవింద్ సింగ్ జయంతోత్సవాల సందర్భంగా ఆయన పేరిట స్మారక నాణేలను ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హాజరైన ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ గురు నానక్ దేవ్ 550వ జయంతోత్సవాల నేపథ్యంలో కర్తార్‌పూర్ కారిడార్ ద్వారా సిక్కు సోదరులు పాకిస్తాన్‌లోని నరోవల్ దర్బార్ సాహిబ్‌కు వీసా లేకుండా ప్రయాణించవచ్చని చెప్పారు. సిక్కుల ఆరాధ్యదైవం కొలువైన ప్రాంతం కొద్ది కిలోమీటర్ల దూరంలోనే ఉన్నా 1947 దేశ విభజనలో పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లడం పెద్ద తప్పిదమన్నారు. దీన్ని మనం పొందలేకపోయినా కర్తార్‌పూర్ కారిడార్ ఆ బాధను కొంతమేర తగ్గిస్తుందని వ్యాఖ్యానించారు. కాగా, కార్యక్రమానికి ముందు జయంతోత్సవాల సందర్భంగా ప్రధాని మోదీ గురుగోవింద్ సింగ్‌కు నివాళి అర్పిస్తూ ట్వీట్ చేశారు. -
గురుగోవింద్ జయంతి ఉత్సవాలకు రండి!
సీఎం కేసీఆర్‌కు గురుద్వారా బోర్డు ఆహ్వానం సాక్షి, హైదరాబాద్: గురుగోవింద్ సింగ్ 350వ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న జాగృతి యాత్ర ఈ నెల31న హైదరాబాద్‌కు చేరుకోనుంది. కులీకుతుబ్ షా మైదానంలో జరిగే ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రావాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను నాందేడ్ గురుద్వారా బోర్డు అధ్యక్షుడు, మహారాష్ట్ర ఎమ్మెల్యే సర్దార్ తారాసింగ్ ఆహ్వానించారు. క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన ముఖ్యమంత్రిని కలుసుకున్నారు. నాందేడ్ బోర్డులో రాష్ట్ర సభ్యుడు ఎస్.దల్జీత్‌సింగ్, గవర్నర్ ముఖ్య కార్యదర్శి హరిప్రీత్‌సింగ్ ఆయన వెంట ఉన్నారు. వారి ఆహ్వానంపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. యాత్ర విశేషాలను అడిగి తెలుసుకున్నారు. గురుగోవింద్ జయంతి ఉత్సవాలు విజయవంతం కావాలని కేసీఆర్ ఆకాంక్షించారు. తారాసింగ్ మాట్లాడుతూ తెలంగాణలో సర్వమత సమానత్వం, సౌభ్రాతృత్వం వర్ధిల్లుతోందన్నారు. రాష్ట్రంలోని మైనారిటీ సంక్షేమ కార్యక్రమాలను ప్రస్తావించారు. దేశంలో కేవలం రెండు నగరాల్లోనే సిక్కు మత వర్గానికి చెందిన మేయర్లున్నారని, అందులో తెలంగాణలో కరీంనగర్ మేయర్ రవీందర్‌సింగ్ ఒకరని గుర్తు చేశారు. అందుకు సిక్కులందరి తరఫున ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు వెల్లడించారు.