breaking news
Gulab Jamuns
-
గార్ధబాలకు గులాబ్ జామ్‌లు
భోపాల్: విత్తులు నాటాక కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఆకాశం వంక మేఘాల కోసం చూడటం రైతన్నలకు నేటి యుగంలో సర్వసాధారణమైపోయింది. అయితే మధ్యప్రదేశ్‌లోని కొన్ని మారుమూలప్రాంతాల్లో మాత్రం కొందరు స్థానికులు మూగజీవాలను ప్రసన్నంచేసుకుంటే వరుణుడు వర్షిస్తాడనే బలమైన విశ్వాసం నెలకొని ఉంది. ఇందులో భాగంగా మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నగరంలోని కోలార్ రోడ్లో గాడిదలకు కొందరు గులాబ్‌జామ్‌లు ప్లేట్లలో పెట్టి తినిపించారు. తమ పూర్వీకులు సైతం వర్షాలు సరిగా పడని సందర్భాల్లో అచ్చం ఇలాగే గాడిదలకు తీపిపదార్థాలు ఆహారంగాపెట్టేవాళ్లని స్థానికులు చెప్పారు. వరుణదేవుడైన ఇంద్రుడిని మెప్పించేందుకు గార్ధబాలకు గులాబ్‌జాములు పెట్టడం సరైన పద్ధతి అని మరికొందరు చెప్పారు. ఈ సందర్భంగా జానపద గేయాలను సైతం ఆలపించారు. ఈ ఘటన తాలూకు వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లుకొడుతున్నాయి. ఈ వింత ఆచారంపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. అయితే వర్షాలు బాగా కురవాలని కోరుకుంటున్న ఇదే ఇండోర్ నగరంలో ఈ సీజన్లో సాధారణసగటు కంటే 44 శాతం అధిక వర్షపాతం నమోదైందని భోపాల్ వాతావరణవిభాగ సీనియర్ అధికారి ఎన్ఎస్ సాహూ శనివారం ప్రకటించడం విశేషం.అయితే మధ్యప్రదేశ్‌లోని 35 జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ ఇటీవలే ప్రకటించింది. చింధ్వారా, దామోహ్, దిందోరీ, జబల్పూర్, కత్నీ, మేహర్, మాండ్లా, మౌగంజ్, నర్సింగ్‌పూర్,పంధూర్నా, పన్నా, రేవా, సాగర్, సత్నా, శివానీ, షాహ్‌దోల్, సిద్ధీ, సింగ్రౌలీ, తికాంగఢ్, ఉమారియా, అలీరాజ్‌పూర్, బర్వానీ, బేతుల్, దటియా, ధార్, ఝాన్బువా, మొరెనా, నర్మదాపురం, రైనెన్, శివ్పూర్, శివపురి, అనుప్పూర్, బాలాఘాట్, ఛాతర్పూర్, విదిష జిల్లాల్లో తక్కువ వర్షపాతం నమోదైంది. -
పది గులాబ్‌జాములు లాగించేశా
ఆహా ఏమి రుచి అనరా మైమరచి అన్నది ఒక పాట పల్లవి. అయితే ఆహా ఏమి రుచి తినరా మైమరచి అంటూ పదికి పైగా గులాబ్‌జామ్‌లను లాగించేసిన నటి విశాఖసింగ్ చిత్ర యూనిట్‌కు షాక్ ఇచ్చిందట. సాధారణంగా హీరోయిన్లు తీపి పదార్థాల విషయంలో జాగ్రత్తలు పాటిస్తుంటారు. ఎక్కడ బరువెక్కుతామోనన్న భయమే అందుకు కారణం. అలాంటిది విశాఖ మాత్రం తీయని గులాబ్‌జామ్ కళ్లెదుట ఊరిస్తుంటే వెనుకా ముందు ఆలోచించకుండా ఒక డజను వరకు లాగించేసిందట. కన్నా లడ్డు తిన్న ఆశయా చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైన ఈ ఉత్తరాదిభామ తాజాగా వాలిభరాజా చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం కోసం ఇటీవల ఒక హ్యాపీ సన్నివేశాన్ని చిత్రీకరించారు. చిత్రంలో నటిస్తున్న ప్రధాన తారాగణం పండ్లు, స్వీట్లు తింటూ ఆనందంగా గడిపే ఆ సన్నివేశంలో గులాబ్‌జామ్‌లు నిండుగా ఉన్న ప్లేటును నటి విశాఖ ముందు పెట్టారు. సన్నివేశం ప్రారంభానికి ముందే ఒక గులాబ్‌జామ్‌ను టేస్ట్ చేసిన ఈ అమ్మడు అది యమ రుచిగా ఉండటంతో సన్నివేశం పూర్తి కాకముందే పదికిపైగా గులాబ్‌జామ్‌లను తినేసి యూనిట్‌కు షాక్ ఇచ్చింది. దీంతో మళ్లీ షాపుకెళ్లి మరికొన్ని గులాబ్‌జామ్‌లను చిత్ర యూనిట్ తీసుకొచ్చి సన్నివేశాన్ని పూర్తి చేయాల్సి వచ్చిందట. దీని గురించి నటి విశాఖ మాట్లాడుతూ సన్నివేశంలో గులాబ్‌జామ్ తింటూ ఆనందాన్ని పంచుకోవాలని దర్శకుడు చెప్పారని అంది. తనకు తీపి అంటే చాలా ఇష్టం అని చెప్పింది. ఒక గులాబ్‌జామ్ నోట్లో పెట్టుకోగానే అలాగే కరిగిపోయిందని అంది. చాలా రుచికరంగా ఉండటంతో పదికి పైగా గులాబ్‌జామ్‌లు లాగించేశానని చెప్పింది.


