breaking news
Gudumba merchant
-
అక్రమంగా మద్యం విక్రయిస్తోన్న మహిళకు రిమాండ్
ఓ ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా అక్రమంగా మద్యం విక్రయిస్తున్న మహిళను భవానీనగర్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఆమె వద్ద నుంచి 19 (20 ఎంఎల్) మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై వీరభద్ర కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... ఈదిబజార్ కుమ్మర్వాడీ ప్రాంతానికి చెందిన భాగ్యమ్మ (54) గుడుంబా వ్యాపారి. గతంలో గుడుంబా వ్యాపారం నిర్వహిస్తూ ప్రస్తుతం గుట్టు చప్పుడు కాకుండా అక్రమంగా మద్యం విక్రయిస్తుంది. విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎసై ్స ప్రసాద్ రావు సంతోష్‌నగర్ ఏసీపీ వి. శ్రీనివాసులు ఆదేశానుసారం ఇన్స్పెక్టర్ బి. శ్రీనివాస్ రావు పర్యవేక్షణలో దాడులు నిర్వహించారు. భాగ్యమ్మ ఇంట్లో సోదాలు చేయగా 19 మద్యం బాటిళ్లు లభించాయి. మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకొని భాగ్యమ్మైపై ఎకై ్సజ్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసుకొని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. గుడుంబా విక్రయాలు కొనసాగించి పలుమార్లు భాగ్యమ్మ జైలుకు వెళ్లి వచ్చిందని పోలీసులు పేర్కొన్నారు. 200 ఎంఎల్ మద్యం బాటిళ్లు రూ.60 లకు తీసుకొచ్చి రూ.70 విక్రయిస్తుంది. -
దొరికాడు.. పారిపోయాడు..
* పరారీలో గుడుంబా వ్యాపారి * పోలీసులకు చిక్కి తప్పించుకున్న వైనం * ఎక్సైజ్ శాఖకు సవాల్‌గా మారిన ఘటన సాక్షి, హన్మకొండ : బెల్లం అక్రమ రవాణా చేస్తూ ఎక్సైజ్ పోలీసులకు చిక్కినట్టే చిక్కి పారిపోయాడు ఓ వ్యాపారి. అంతేకాదు.. ఏకంగా ఎక్సైజ్ పెద్దలతో సన్నిహితంగా ఉన్నట్లు వ్యవహరిస్తుం డడం ఆ శాఖ అధికారులకు సవాలుగా మారింది. ఇటీవల జరిగిన ఈ వ్యవహారం చర్చనీయాశంగా మారింది. గుడుంబా తయారీ, అమ్మకాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. నాటుసారా బట్టీలు, బెల్లం, పటిక అక్రమ రవాణాపై ఎక్సైజ్ అధికారులు దాడులు న్విహిస్తున్నారు. ఈ క్రమంలో నెక్కొండకు చెందిన ఓబెల్లం వ్యాపారి ఎక్సైజ్ అధికారులకు కొరకరాని కొ య్యగా మారాడు. ఎక్సైజ్ శాఖకు చిక్కకుండా గుడుంబా తయారీదారులకు యథేచ్ఛగా బెల్లం సరఫరా చేస్తున్నాడు. పక్కా ని ఘా పెట్టిన అధికారులు బెల్లం, పటిక, గంజాయి చేస్తున్న ఓ వాహనాన్ని పట్టుకున్నారు. ఈ వాహనం ఆ వ్యాపారిదే అని నిర్ధారించుకుని అరెస్టు చేసేందుకు అతడి ఇంటికి వెళ్లారు. అయితే అరెస్ట్ చేయకుండానే తిరిగివచ్చారు. ఇంట్లోకి వెళ్లి అంగీ(షర్ట్) వేసుకొస్తానని చెప్పి పారిపోయూడని ఎక్సైజ్ అధికారులు ఉన్నతాధికారులకు చెప్పారు. ఏమైందో, ఎలా జరిగిందో తెలియదు కానీ.. వ్యాపారి మాత్రం పరారయ్యూడు. ముందస్తు బెయిల్ కో సం ప్రయత్నిస్తున్నాడని సమాచారం. కాగా, వ్యాపారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తునట్లు ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. సహకార ఒప్పందం.. ఎక్సైజ్ అధికారులు పకడ్బందీగా కేసు నమోదు చేయడంతో వ్యాపారి ఉక్కిరి బిక్కిరయ్యాడు. అరెస్టయితే జైల్లో ఎన్ని రోజు లు ఉండాల్సి వస్తుందో అనే ఆందోళనతో పరారీకి ఫ్లాన్ చేసినట్లు తెలిసింది. ఎక్సైజ్ అధికారులను ప్రసన్నం చేసుకుని.. పరారీ ప్లాన్‌ను అమలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం ఇప్పుడు ఎక్సైజ్ శాఖకు ఇబ్బందికరంగా మారింది. సదరు వ్యాపారిపై నర్సంపేట, వరంగల్ అర్బన్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయి. తాజాగా కేసు నమోదై పది రోజులు కావస్తున్నా వ్యాపారిని అరెస్టు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది.