breaking news
Group-II Examination
-
గ్రూప్–2 మెరిట్ జాబితా విడుదల
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 982 ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నిర్వహించిన గ్రూప్–2 మెయిన్స్ పరీక్షలో మెరిట్ మార్కులు సాధించిన అభ్యర్థుల జాబితాను శుక్రవారం ఎపీపీఎస్సీ విడుదల చేసింది. ఒక్కో పోస్టుకు ఇద్దరు చొప్పున (1:2 విధానంలో) 1,925 మందిని ఎంపిక చేస్తూ జాబితాను కమిషన్ వెబ్సైట్లో ఉంచింది. మెరిట్ జాబితా ప్రకారం అభ్యర్థుల ధ్రువ పత్రాలను జనవరి 3 నుంచి 20 వరకు పరిశీలిస్తారు. పోస్టుల కోడ్ల వారీగా ధ్రువ పత్రాలను పరిశీలించే సమయం, తేదీని త్వరలోనే తెలియజేస్తారు. అభ్యర్థులు వారు ఇచ్చిన ప్రిఫరెన్స్ ఆధారంగా కోడ్ల వారీగా ఆయా పోస్టులకు వారికి కేటాయించిన సమయంలో తమ ధ్రువ పత్రాలతో సహా హాజరుకావాలని ఎపీపీఎస్సీ సూచించింది. ఒకవేళ హాజరుకాకపోతే మెరిట్ జాబితాలోని తర్వాత అభ్యర్థికి అవకాశం కల్పిస్తామని తెలిపింది. అభ్యర్థులు ఎస్సెస్సీ సర్టిఫికెట్, వయసు ధ్రువీకరణ పత్రం, స్టడీ సర్టిఫికెట్లు, కుల ధ్రువీకరణ పత్రం(క్రిమిలేయర్‌తో సహా), తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వలస వచ్చి ఉంటే మైగ్రేషన్ సర్టిఫికెట్లు తప్పనిసరిగా తీసుకురావాలని సూచించింది. అభ్యర్థులు వారికి కేటాయించిన సమయంలో ధ్రువీకరణ పత్రాలను సమర్పించడడం విఫలమైతే.. వారిని పరిగణనలోకి తీసుకోమని స్పష్టం చేసింది. ధ్రువ పత్రాల పరిశీలనకు గడువు పొడగించలేమని తేల్చిచెప్పింది. కంప్యూటర్ నైపుణ్య పరీక్షల్లో ఉత్తీర్ణులైతేనే... దివ్యాంగులైన అభ్యర్థులకు విశాఖపట్నంలోని మెడికల్ బోర్డు పరీక్ష నిర్వహించనుంది. పరీక్ష నిర్వహించే తేదీని, సమయాన్ని త్వరలో తెలియజేస్తామని ఏపీపీఎస్సీ వెల్లడించింది. ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షలతో సంబంధం ఉన్న పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆయా శాఖల అధికారులు ఆ పరీక్షలు నిర్వహిస్తారు. వాటిని నిర్వహించే తేదీ, సమయాన్ని త్వరలోనే తెలియజేస్తామని కమిషన్ పేర్కొంది. కోడ్ నెంబర్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 13, 14, 15, 16, 33, 34 పోస్టులు మినహా మిగతా కోడ్ నెంబర్లలోని పోస్టులకు మెరిట్ సాధించిన అభ్యర్థులకు కంప్యూటర్ నైపుణ్య పరీక్షలను నిర్వహిస్తామని తెలిపింది. ఆ పరీక్షలు నిర్వహించే తేదీ సమయాన్ని త్వరలోనే తెలిజేస్తామని పేర్కొంది. కంప్యూటర్ నైపుణ్య పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారిని మాత్రమే పోస్టులకు ఎంపిక చేస్తామని స్పష్టం చేసింది. -
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
నేడు గ్రూప్-2 రాత పరీక్షలు ప్రారంభం సాక్షి, హైదరాబాద్: ఈనెల 11, 13 తేదీల్లో గ్రూప్-2 రాత పరీక్ష నిర్వహణకు సర్వం సిద్ధమైంది. 7,89,435 మంది అభ్యర్థులు పరీక్ష రాసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 1,916 పరీక్ష కేంద్రాల్లో టీఎస్పీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాల్లోకి అనుమతించరని ఇదివరకే టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది. అంతేకాదు.. అభ్యర్థులు నిర్ణీత సమయానికి గంటన్నర ముందుగానే పరీక్ష కేంద్రాల్లోకి చేరుకోవాలని సూచించింది. ఉదయం 10 గంటలకు ప్రారంభం అయ్యే పరీక్షకు హాజరయ్యే వారిని ఉదయం 9.45 గంటల వరకే అనుమతిస్తామని, మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమయ్యే పరీక్షకు హాజరయ్యే వారిని మధ్యాహ్నం 2.15 వరకే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామని టీఎస్పీఎస్సీ వెల్లడించింది. అభ్యర్థులు హాల్‌టికెట్‌తో పాటు ఏదైనా ఫొటో గుర్తింపు కార్డు (పాన్ కార్డు, ఓటర్ ఐడీ కార్డు, పాస్‌పోర్టు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లెసైన్‌స, ప్రభుత్వ ఉద్యోగి అరుుతే సంస్థ ఐడీ కార్డు ) తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలని, హాల్‌టికెట్‌పై ఫొటో, సంతకం సరిగా లేని అభ్యర్థులు రెండు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలను వెంట తెచ్చుకోవాలని సూచించింది. షూస్ వేసుకొని రావొద్దని, ఆభరణాలు, గొలుసులు, చెవిపోగులు, చేతిగడియారాలు ధరించవద్దని పేర్కొంది. ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, మొబైల్ఫోన్లు, ట్యాబ్‌లు, పెన్‌డ్రైవ్‌లు, బ్లూటూత్‌లు, గడియారాలు, కాలిక్యులేటర్లు, లాగ్ టేబుల్స్, చేతిబ్యాగులు, పర్సులు, నోటు పుస్తకాలు, చార్టులు, రికార్డింగ్ పరికరాల వంటివి అనుమతించబోమని పేర్కొంది. బ్లాక్ బాల్‌పారుుంట్ పెన్నుతోనే రాయాలని సూచించింది. కాగా, దరఖాస్తు చేసుకున్న వారిలో ఇప్పటివరకు 6.81 లక్షల మంది అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నట్లు టీఎస్పీఎస్సీ వర్గాలు వెల్లడించారుు. 2500 ప్రత్యేక బస్సులు ఆర్టీసీ ఎండీ రమణారావు గ్రూప్-2 పరీక్షలు రాసే అభ్యర్థుల కోసం 2,500 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్టు ఆర్టీసీ ఎండీ రమణారావు ప్రకటించారు. ఈ బస్సుల్లో రూ.500, రూ.1000 నోట్లు చెల్లుబాటు అవుతాయని పేర్కొన్నారు. అయితే వీలైనంత వరకు టికెట్‌కు సరిపడా చిల్లర ఇస్తే మంచిదని, అంత పెద్దనోట్లు ఇస్తే తిరిగి చిల్లర ఇవ్వడం సాధ్యం కాదనే విషయం గుర్తుంచుకోవాలని సూచించారు. ఇదీ షెడ్యూలు.. 11న ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు.. పేపరు-1 (జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్) 11న మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు.. పేపరు-2 (హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ) 13న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు... పేపరు-3 (ఎకానమీ అండ్ డెవలప్మెంట్) 13న మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు... పేపరు-4 (తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్).