breaking news
gricultural authority
-
నేలమ్మా క్షమించు..
ఈ భూతలమ్మీద జీవానికే జేజమ్మ నేలతల్లి. మనందరం ఈ నేలమ్మ ముద్దు బిడ్డలమే. భూమి మీద ఉన్న జీవవైవిధ్యం కన్నా భూమి లోపల జీవవైవిధ్యం ఎక్కువ. అడవిలోని అత్యంత సారవంతమైన మట్టి జీవన ద్రవ్యంతో జీవజీవాలతో ఉంటుంది. అందుకే అడవి ఎంత ఎండల్లోనూ ఎండిపోకుండా సతత హరితంగా అలరారుతూ ఉంటుంది. అడవిలో చెట్ల కింద మట్టి అత్యంత సారవంతంగా, సజీవంగా ఉంటుంది. దీన్ని చెంచాడు తీసుకొని పరీక్షించి చూస్తే.. భూగోళంపైన మనుషులెందరు ఉన్నారో అన్ని సూక్ష్మజీవులు ఉంటాయని ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఏ.ఓ.) శాస్త్రవేత్తలు ప్రకటించారు. వ్యవసాయ నేలల్లోనూ సూక్ష్మజీవరాశిని పెంపొందించుకునే ప్రకృతి వ్యవసాయ పద్ధతులే భూసారాన్ని పెంపొందించగలవు, పరిరక్షించగలవు. నేలతల్లి చల్లగుంటేనే మనమూ చల్లగా ఉంటాం. నేలతల్లి ఆరోగ్యమే మన ఆరోగ్యం. మన నేలలు సకల పోషకాలతో సజీవంగా ఉంటేనే మనం పండించే ఆహారంలోనూ పోషకాల లోపం లేకుండా ఉంటుంది. నేలతల్లి అమూల్యమైన ప్రకృతి సేవలతో మనుషులు, జంతువులు, పక్షులు, సూక్ష్మజీవులు సహా సకల జీవరాశికి ప్రాణం పోస్తుంది. అటువంటి నేలతల్లి అనేక రకాల కాలుష్యాల వల్ల, పారిశ్రామిక/రసాయనిక వ్యవసాయ పద్ధతుల వల్ల క్రమంగా నిర్జీవమవుతోంది, నిస్సారమవుతోంది. ఇప్పటికే మూడింట ఒక వంతు సాగు భూమి నిర్జీవంగా, సాగు యోగ్యం కాకుండా మారిపోయింది. రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపుమందులతో కూడిన నష్టదాయక వ్యవసాయ పద్ధతుల వల్ల ఉత్పాదకశక్తిని, తేమను నిలుపుకునే శక్తిని కోల్పోయింది. ప్రపంచవ్యాప్తంగా ఏటా కోటి 20 లక్షల హెక్టార్ల భూమి ఎడారిగా మారిపోతోంది. సముద్రం తర్వాత అధికంగా కర్బనం నిల్వలు కలిగి ఉన్న భూమి జవజీవాలను సంరక్షించుకోవడం ద్వారా మాత్రమే భూతాపోన్నతిని అరికట్టగలుగుతామని నిపుణులు చెబుతున్నారు. భూమిని కాలుష్యాల నుంచి రక్షించుకుందాం అని ఎఫ్.ఏ.ఓ. ఈ ఏడాది డిసెంబర్ 5న అంతర్జాతీయ భూముల దినోత్సవం సందర్భంగా పిలుపునిచ్చింది. ఇందుకు ప్రకృతి వ్యవసాయం ఎంతగానో దోహదపడుతుంది. ఈ బృహత్ కృషిలో ప్రకృతి వ్యవసాయదారులే సైనికులు! అయినా.. సమయం మించి పోలేదు భూముల విధ్వంసాన్ని నిలువరించగలం భూమిని కాలుష్యం నుంచి పరిరక్షించడానికి భూసారాన్ని పెంపొందించే రసాయన రహిత వ్యవసాయ పద్ధతులు చేపట్టడంతో పాటు.. అనేక ఇతర రంగాల్లోనూ ఇప్పుడు అనుసరిస్తున్న పద్ధతులు మార్చుకోవాలి. పారిశ్రామిక రంగం, గనుల తవ్వకం, వ్యర్థాల పునర్వినియోగం, రవాణా రంగాలలో కాలుష్యాన్ని తగ్గించే పర్యావరణ అనుకూల పద్ధతులు కూడా పాటిస్తూ స్వచ్ఛంద సంస్థల తోడ్పాటుతో ప్రపంచవ్యాప్తంగా ప్రచారోద్యమాన్ని చేపడితే... భూములను కాలుష్యం బారి నుంచి పూర్తిగా కాపాడుకోగలుగుతాం. -
మరో 15 మండలాల్లో కరువు
చిత్తూరు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: జిల్లాలోని మరో 15 మండలాల్లో కరువు ఛాయలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో మూడో విడత జాబితా కింద తాజాగా గుర్తించిన మండలాల వివరాలను కలెక్టర్ కె.రాంగోపాల్ ప్రభుత్వానికి సోమవారం రాత్రి ప్రతిపాదనలు పంపారు. ఫలితంగా జిల్లాలో కరువు మండలాల సంఖ్య 37 నుంచి 52కు చేరుకుంది. తొలి విడతగా 14 మండలాల్లో కరువు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నెల 7న తుది జాబితాను ప్రభుత్వానికి పంపారు. తర్వాత మరో 23 మండలాల్లో కరువు ఛాయలు ఉన్నట్లు గర్తించిన అధికారులు ఈ నెల 11న రెండో జాబితా కింద పంపారు. తాజాగా సోమవారం రాత్రి మరో 15 మండలాల్లో కరువు నెలకొన్నట్లు మూడో జాబితా కింద ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. జిల్లాలో 66 మండలాలకుగాను 52 మండలాల్లో ఇప్పటి వరకు కరువు ఛాయలు నెలకొన్నట్లు అధికారులు గుర్తించారు. మూడో జాబితాలోని మండలాలివే ఎర్రావారిపాళెం, కురబలకోట, ఐరాల, పలమనే రు, సదుం, వి.కోట, గుర్రంకొండ, గంగవరం, పెనుమూరు,పాకాల, కార్వేటినగరం, బి.ఎన్.కండ్రిగ, చిత్తూరు, బంగారుపాళెం, పెద్దమండ్యం. మూడుసార్లు ఎందుకు పంపారు? శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగా జిల్లాలోని కరువు మండలాలను గుర్తించడంలో అధికారులు విఫలమైనట్లు తెలుస్తోంది. కరవు పరిస్థితులు నెలకొన్న ప్రతి ఏటా ఒకటి లేక రెండు దఫాలుగా కరువు మండలాల జాబితాలను ప్రభుత్వానికి జిల్లా యంత్రాంగం ప్రతిపాదనలు పంపుతుంది. అయితే ఈ ఏడాది మూడు దఫాలుగా కరువు మండలాల జాబితాలను ప్రభుత్వానికి నివేదించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరువు మండలాలను గుర్తించడంలో ప్రమాణాలు పాటించడం, తగిన సమయంలో వివిధ రకాలైన సర్వేలు చేపట్టాల్సి ఉంది. రెవెన్యూ, గణాంకాధికారులు, వ్యవసాయశాఖలు సంయుక్తంగా మండల స్థాయిలో నెలకొన్న కరువు పరిస్థితులను గుర్తించాల్సి ఉంది. తొలుత రెవెన్యూ అధికారులు పలు మండలాల్లో కరువు ఛాయలు నెలకొన్నట్లు గుర్తించాలి. దీనిని నిర్ధారించేందుకు గణాంకాధికారులు పంటకోత ప్రయోగాలను నిర్వహించాలి. అయితే ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా అధికారులు ఉద్యమబాట పట్టడంతో పంటకోత ప్రయోగాలను చేపట్టడంలో ఆలస్యమైంది. అలాగే కరువు మండలాలు గుర్తించడంలో వ్యవసాయాధికారుల పాత్ర నామమాత్రంగా మారినట్లు సమాచారం. పంట సాగు, దిగుబడి తదితర వివరాలను అందించడంలో వ్యవసాయాధికారులు విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాజకీయ ఒత్తిళ్లు కారణమా? దశలవారీగా కరువు మండలాలను ప్రకటించడంలో రాజకీయ ఒత్తిళ్లూ ఒక కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. సాధారణ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో తమ నియోజకవర్గాల్లోని మండలాల ను కరువు ప్రాంతాలుగా ఎంపిక చేసేందుకు ప్రజాప్రతినిధులు అధికారులపై ఒత్తిడి తెచ్చారనే విమర్శలు లేకపోలేదు. అయితే ప్రజాప్రతినిధులు ప్రతిపాదించిన మండలాల్లో పంట నష్టపోయిన రైతులకు సాధారణ ఎన్నికలలోపు ప్రయోజనం చేకూర్చుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఆ 14 మండలాలు ఏ పాపం చేశాయి.. జిల్లాలో 66 మండలాలకుగాను ఇప్పటివరకు 52 మండలాల్లో కరువు ఛాయలు నెలకొన్నట్లు అధికారులు గుర్తించారు. మిగిలిన 14 మండలాలపై సవతి ప్రేమ చూపుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ మండలాలన్నీ టీడీపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉండడమే కారణంగా తెలుస్తోంది. ఈ జాబితాలో రామసముద్రం, శ్రీకాళహస్తి, ఏర్పేడు, సత్యవేడు, నారాయణవనం, వరదయ్యపాళెం, నాగలాపురం, పిచ్చాటూరు, నగరి, పుత్తూరు, వడమాలపేట, నిండ్ర, విజయపురం, పెద్దపంజాణి మండలాలు ఉన్నాయి. ఇక్కడ వర్షపాతం అధికంగా ఉందని, పంటలకు నష్టం జరగలేదనేది అధికారుల వాదనగా ఉంది.