gowri naidu
-
మూడుసార్లు మిస్క్యారేజ్, కెరీర్‌కు నటి గుడ్‌బై.. ఇన్నాళ్లకు గుడ్‌న్యూస్
బుల్లితెర నటి, తెలుగమ్మాయి గౌరీ నాయుడు (Actress Gowri Naidu) గుడ్‌న్యూస్ చెప్పింది. పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్లు పేర్కొంది. ఈ మేరకు సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్ షేర్ చేసింది. 2018లో రాజశేఖరన్ అనే వ్యక్తిని పెళ్లాడింది. పలుమార్లు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయినప్పటికీ ఆ గర్భం నిలవకుండానే పోయింది. దీంతో ఎంతో బాధపడ్డ ఆమెకు ఈసారి బిడ్డ పుట్టడంతో సంతోషంలో మునిగి తేలుతోంది.ఉత్తమ విలన్‌గా అవార్డుఆడదే ఆధారం, మనసు-మమత, ప్రేమ ఎంత మధురం, మల్లి వంటి పలు సీరియల్స్‌లో నటించింది. ఉత్తమ విలన్‌గా అవార్డు కూడా అందుకుంది. కానీ కొంతకాలంగా గౌరీ బుల్లితెరకు దూరంగా ఉంటోంది. నిజానికి సీరియల్స్‌తోనే ఆగిపోకుండా సినిమాలు కూడా చేయాలన్నది ఆమె కోరిక. కానీ సీరియల్స్‌లో నటించే సమయంలో వరుసగా మూడుసార్లు గర్భస్రావం అయింది. ఆ బాధను తట్టుకోలేకపోయింది.ముగ్గురు పిల్లలు దేవుడి దగ్గరే..దానికి తోడు ఎంతమంది పిల్లలు? అన్న జనాల ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయింది. చివరకు విసుగొచ్చి నాకు ముగ్గురు పిల్లలు.. కానీ ఆ ముగ్గురు దేవుడి దగ్గరే ఉన్నారంటూ అప్పట్లో ఎమోషనల్ వీడియో షేర్ చేసింది. వరుస అబార్షన్ల వల్ల తనకు విశ్రాంతి అవసరం అని వైద్యులు సూచించారు. దాంతో ఆమె కెరీర్‌కు బ్రేక్ ఇచ్చింది. ఈ క్రమంలో గతేడాది గర్భం దాల్చింది. అప్పటినుంచి బేబీ బంప్‌తో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో తరచూ షేర్ చేస్తూ వస్తోంది. సీమంతం ఫోటోలను కూడా షేర్ చేసింది. ఇప్పుడు బేబీ జన్మించింది. మరి పాపను ఎప్పుడు చూపిస్తుందో చూడాలి! View this post on Instagram A post shared by actress gowrinaidu🇮🇳 (@actressgowrinaidu) View this post on Instagram A post shared by actress gowrinaidu🇮🇳 (@actressgowrinaidu) చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన 'మహాతల్లి' -
బ్యాంక్ ఉద్యోగి చేతివాటం
గుర్రంపోడు, న్యూస్‌లైన్: గుర్రంపోడులోని గ్రామీణ వికాస్ బ్యాంక్‌లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి చేతివాటం ప్రదర్శించి ప్రభుత్వ కార్యాల యాల ఖాతాలలోని సొమ్మును పక్కదారి పట్టించాడు. లెక్కల్లో తేడాను ఆలస్యంగా గుర్తించిన బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ గౌరీనాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక ఎపీజీవీబీలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగి గాదెపాక రవీందర్ సెప్టెంబర్ 13 ఎంపీడీఓ ఖాతా నుంచి రూ 28,276, తహసీల్దార్ ఖాతా నుంచి రూ 47,516లను గుర్రంపోడుకు చెందిన సైదిరెడ్డి అనే వ్యక్తి ఖాతాకు బదిలీ చేశాడు. మళ్లీ రూ 58,307లను తహసీల్దార్ ఖాతా నుంచి కట్ట నర్సింహ్మ అనే వ్యక్తి ఖాతాలోకి మళ్లించాడు. అక్టోబర్ 7న రూ 75,000లను ఖాతాదారుడికి తెలియకుండా శివప్రసాద్ అనే వ్యక్తి ఖాతాలో జమచేశాడు. ఆతర్వాత లెక్కల్లో తేడాలు రావడంతో గుర్తించిన బ్యాంకు అధికారులు శాఖాపరమైన విచారణ చేపట్టి నగదు బదిలీ కాబడిన ఖాతాదారుల నుంచి సొమ్మును రికవరీ చేశారు. నిందితుడు విషయం బయట పడినప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. బ్యాంక్ మేనేజర్ సుంకు విజయ్‌కుమార్ ఫిర్యాదు మేరకు ఉద్యోగి రవీందర్‌పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.