breaking news
governance standards
-
బ్యాంకింగ్‌లో పాలనా ప్రమాణాలు పెరగాలి
న్యూఢిల్లీ: బ్యాంకింగ్‌లో పాలనా ప్రమణాలు మరింత బలపడాల్సిన అవసరం ఉందని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎంకే జైన్ పేర్కొన్నారు. ఒక ఆంగ్లపత్రిక నిర్వహించన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, పాలనా ప్రమాణాల పెంపువల్ల ప్రజల్లో బ్యాంకింగ్ పట్ల మరింత విశ్వాసం పెరుగుతుందన్నారు. కార్పొరేట్ గవర్నెన్స్ అనేది ఏదైనా సంస్థకు మూలస్తంభం వంటిదన్నారు. ఇది బ్యాంకులకు భిన్నమైన గుర్తింపును, ప్రాముఖ్యతను ఇస్తుందని అన్నారు. బ్యాంకింగ్ సేవల పరంగా ప్రత్యేక సేవా లక్షణాలను కలిగివుందన్నారు. దీనితోపాటు ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఉత్ప్రేరకాలుగా బ్యాంకులు పనిచేస్తాయని అందరూ గుర్తుంచుకోవాల్సిన అంశమన్నారు. ఇటువంటి ప్రత్యేక లక్షణాల వల్లే ఎటువంటి హామీ లేకుండానే భారీ ఎత్తున డిపాజిట్లను బ్యాంకులు సమీకరించగలుగుతున్నాయని అన్నారు. ఈ పరిస్థితుల్లో బ్యాంకుల్లో పాలనా సంస్కరణలు కీలకంగా ఉన్నాయన్నారు. డిజిటల్ బ్యాంకింగ్ విస్తరణ నేపథ్యంలో సైబర్ భద్రత అనేది కీలక పర్యవేక్షక అంశంగా మారిందన్నారు. ఈ విషయంలో ఆందోళనలను పరిష్కరించడానికి, వివిధ ప్రమాద సూచికలను ఉపయోగించి బ్యాంకులలో సైబర్ ప్రమాదాన్ని అంచనా వేయడానికి ఆర్బీఐ ఒక నమూనా ఆధారిత ఫ్రేమ్‌వర్క్‌ను అభివృద్ధి చేసిందని తెలిపారు. ‘‘ఒక ఆర్థిక సంస్థ కార్యకలాపాలు, దాని పాలనా ప్రమాణాలు, వ్యాపార నమూనా, ఇబ్బందులను ఎదుర్కొనే సామర్థ్యం, ఈ విషయంలో ఇచ్చే హామీ వంటి అంశాలు... దీర్ఘకాలంలో ఆ సంస్థ ఎంత బాగా పనిచేస్తుందో నిర్ణయిస్తుంది‘ అని ఈ సందర్భంగా ఆయన అన్నారు. -
హై గవర్నెన్స్ ప్రమాణాలను పునరుద్ధరిస్తాం!
న్యూఢిల్లీ: గత కొన్నాళ్లుగా ఇన్ఫోసిస్ బోర్డులో నెలకొన్న వివాదం, సంక్షోభం నేపథ్యంలో ఇన్ఫోసిస్ వ్యవహరాలను చక్క దిద్దే పనిలో పడింది. ఈ మేరకు శుక్రవారం ఇన్ఫోసిస్ సంస్థ అధికారికంగా ఒకప్రకటన జారీ చేసింది. సంస్థలో అత్యున్నత విలువలను కాపాడుతామని హామీ ఇచ్చింది. ఈ మేరకు భవిష్యత్ కార్యాచరణపై వాటాదారులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలిపింది. ఫౌండర్స్ మాజీ బోర్డు సభ్యుల మధ్య నెలకొన్న వివాదాలను తొలగించి , లోపించిన గవర్నెన్స్ పునరుద్ధరిస్తామని చెప్పింది. హై గవర్నెన్స్ ప్రమాణాలను పాటించనున్నట్టు తెలిపింది. 200 మిలియన్‌డాలర్ల పనయా ఒప్పందం, మాజీ ఎగ్జిక్యూటివ్ లకుచెలించిన అత్యధిక వేతన ప్యాకేజీల తదితర ఆరోపణలపై ఎన్.ఆర్ నారాయణ మూర్తి నేతృత్వంలోని వ్యవస్థాపకులు ఆరోపణలుతో ఇన్ఫీలోవివాదం రాజుకుంది. చిలికి చిలికి గాలివానలా మారి చివరికి ఆగష్టు 18 న, ఇన్ఫోసిస్ సీఈవో విశాల్ సికా తన పదవి నుంచి తప్పుకున్నారు. ఒక వారం తరువాత ఆగస్టు 24 న ఈ సంక్షోభాన్ని చక్కదిద్దేందుకు మాజీ ఫౌండర్ నందన్ నీలేకని నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా రంగంలోకి దిగారు. దీంతో ఛైర్మన్ శేషసాయి, మరో ముగ్గురు డైరెక్టర్లు బోర్డు నుండి వైదొలిగిన సంగతి తెలిసిందే.