breaking news
gouthu lachanna
-
'గౌతు లచ్చన్న విగ్రహంపై టీడీపీ దిగజారుడు రాజకీయం'
సాక్షి, శ్రీకాకుళం, కడప : గౌతు లచ్చన్న విగ్రహంపై టీడీపీ దిగజారుడు రాజకీయం చేస్తోందని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. స్వాతంత్ర్య సమరయోధుడైన గౌతు లచ్చన్నను ఏ ఒక్క వర్గానికో పరిమితం చేయడం సరికాదన్నారు. విగ్రహాన్ని తొలిగిస్తామని ఎక్కడా చెప్పలేదని, తాను అన్నట్లుగా టీడీపీ నేతలు వక్రీకరించారని పేర్కొన్నారు. కొద్ది రోజుల క్రిందట టిడిపి నేత కూన రవికుమార్, గౌతు శీరిషా మీడియా సమావేశం నిర్వహించారని, భూముల ఆక్రమణ కోసం టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆయన విగ్రహానికి ఎటువంటి ముప్పు ఉండదని, గ్రామంలోని ప్రభుత్వ స్థలంలోగౌతు లచ్చన్న విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం అని మంత్రి స్పష్టం చేశారు. (రాయపాటి లూటీలో బాబు వాటా ఎంత? ) తెరమీదకు సర్ధార్ గౌతు లచ్చన్న విగ్రహ అంశం 'టీడీపీ హయంలో ముత్యాలమ్మ కోనేరు వద్ద దేవదాయ భూమిని కబ్జా చేసి వాహనాల షోరూమ్‌ను నిర్మించారు. దీనిలో భాగంగా ఆక్రమించిన దేవాదాయ భూమిలో రెండేళ్ళ క్రిందట టీడీపీ నేతలు సర్ధార్ గౌతు లచ్చన్న విగ్రహన్ని ప్రతిష్టించారు. నా అండదండలతో పలాసలో భూ ఆక్రమణలు జరుగుతున్నాయని కొద్ది రోజుల కిందట ఎంపి రామ్మోహన్ నాయుడు ఆరోపణలు చేయడంతో టిడిపి హయంలో జరిగిన భూ ఆక్రమణల చిట్టాను మీడియా ముందు బయట పెట్టగా, అధికారులు వాటిని తొలిగించారు. ఇది సహించలేని టీడీపీ నేతలు గౌతు లచ్చన్న విగ్రహన్ని నేను తొలగిస్తానంటూ అసత్య ప్రకటన చేశారు. ఇందులో వాస్తవం లేదు. గౌతు లచ్చన్నపై తమకు ఎంతో అభిమానం ఉంది. ఈ విషయంలో టీడీపీ నేతలు రాజకీయాలు మానుకోవాలి' అంటూ మంత్రి హితవు పలికారు. పలాసలో వైఎస్సార్సీపీ నేతల అరెస్ట్ గౌతు లచ్చన్న విగ్రహ అంశంపై నిరసన కార్యక్రమం చేస్తామని టీడీపీ నేతలు ఇదివరకే ప్రకటించారు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కాగా టిడిపి దుష్టరాజకీయాలను ఖండిస్తూ గౌతు లచ్చన్న విగ్రహం వద్ద వైఎస్సార్సీపీ నేతలు నిరసనకు యత్నించారు. గౌతు లచ్చన్న అందరి నాయకుడని, ఆయన్ను టీడీపీ పార్టీకి కానీ, ఓ కులానికి కానీ పరిమితం చేయ్యోద్దని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ముందస్తు అనుమతి లేకపోవడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. (‘నన్ను చూసి నవ్వుతావంట్రా.. ఎంత ధైర్యంరా నీకు’ ) -
పదిసార్లు గెలిచిన తండ్రీ కొడుకులు
సాక్షి, అమరావతి : సరద్దయిన సోంపేట నియోజకవర్గానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక్కడ తండ్రీ కొడుకు కలిసి పదిసార్లు గెలుపొందారు. సీనియర్ నాయకుడు గౌతు లచ్చన్న 1952 నుంచి వరుసగా నాలుగుసార్లు, 1978లో ఒకసారి విజయం సాధించగా, ఆయన కుమారుడు గౌతు శ్యామ సుందర శివాజీ 1985 నుంచి వరుసగా మరో ఐదుసార్లు గెలుపొందడంతో వీరిద్దరే దాదాపు 50 సంవత్సరాలు సోంపేట నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహించారు. మరో ప్రత్యేకత ఏమిటంటే గౌతు కుటుంబం కాకుండా మజ్జి కుటుంబం మాత్రమే రెండు సార్లు గెలిచింది. గెలిచిన లచ్చన్న, తులసీదాస్, శివాజీలు ముగ్గురు మంత్రి పదవులు నిర్వహించిన వారిలో ఉన్నారు. లచ్చన్న గతంలో ప్రకాశం పంతులు క్యాబినెట్లో ఉన్నారు. రాష్ట్రం ఏర్పాటు సమయంలో పెద్దమనుషుల ఒప్పందంపై సంతకం చేసిన ప్రముఖులలో ఈయన కూడా ఒకరు. -
పాఠ్యాంశంగా గౌతు లచ్చన్న జీవితం?
విశాఖపట్నం: ఉత్తరాంధ్ర ముద్దు బిడ్డ.. పీడిత జన పక్షపాతి డాక్టర్ సర్దార్ గౌతులచ్చన్న జీవితాన్ని పాఠశాలల పిల్లలకు పాఠ్యాంశంగా చేర్చే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉందని విద్యాశాఖ మంత్రి గంటాశ్రీనివాసరావు తెలిపారు. జిల్లా కోర్టు సమీపంలో బీసీ యువజన సంఘం నిర్వహించిన గౌతు లచ్చన్న జయంతి కార్యక్రమంలో మంత్రి గంటా మాట్లాడారు. లచ్చన్న లాంటి మహోన్నత వ్యక్తిని ప్రతీ ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఉద్యమకవి వంగపండు ప్రసాదరావు విప్లవ గీతాలను ఆలపించారు.