breaking news
Goutam Gambhir Dock Out
-
ఉత్కంఠ పోరులో కోల్ కతా విజయం
షార్జా:ఐపీఎల్-7లో భాగంగా ఇక్కడ బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ తో జరిగిన ఉత్కంఠ పోరులో కోల్ కతా నైట్ రైడర్స్ రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచిన బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ తొలుత కోల్ కతాను బ్యాటింగ్ చేయాల్సిందిగా ఆహ్వనించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన కోల్ కతా 151 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. బెంగళూర్ కు ఓపెనర్లు పార్థీవ్ పటేల్ (21), తకావాలే(40) పరుగులు చేసి శుభారంభానిచ్చారు. అనంతరం విరాట్ కోహ్లి(31), యువరాజ్ సింగ్(31) పరుగులు చేసి బెంగళూర్ స్కోర్ బోర్డును ముందుకు నడిపించారు. కాగా, వీరివురూ అవుటయిన తరువాత పరిస్థితుల్లో ఒక్కసారిగా తేడా వచ్చింది. చివరి ఓవర్ కు 9 పరుగులు చేయాల్సిన క్రమంలో ప్రవీణ్ కుమర్ కు గౌతం గంభీర్ బంతిని అప్పగించాడు.ఆ సమయంలో క్రీజ్ లో డివిలియర్స్, మోర్కెల్ లు ఉన్నారు. తొలి మూడు బంతుల వరకూ విజయం ఇరుజట్ల వైపు దోబూచులాడింది. నాల్గో బంతిని డివిలియర్స్ భారీ షాట్ కొట్టాడానికి యత్నించి అవుటయ్యాడు. ఆ క్యాచ్ ను లెన్ అద్భుతంగా వడిసి పట్టుకోవడంతో మ్యాచ్ కోల్ కతా వైపు మొగ్గింది. చివరి బంతికి నాలుగు పరుగులు చేయాల్సిన బెంగళూర్ ఒక పరుగు మాత్రమే చేసి కోల్ కతాకు విజయాన్ని అప్పగించింది. కోల్ కతా బౌలర్లలో వినయ్ కుమార్ కు రెండు వికెట్లు లభించగా నరైన్, కల్లిస్ లకు తలో వికెట్టు లభించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్ కతా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. కోల్ కతా విజయాల రికార్డు బాగానే ఉన్నా కెప్టన్ గౌతం గంభీర్ మాత్రం వరుస మూడు మ్యాచ్ ల్లో డకౌట్ గా వెనుదిరిగా పేలవమైన ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. -
గౌతమ్ గంభీర్ డకౌట్ల హ్యాట్రిక్
అబుదాబి: కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఐపీఎల్-7ను డకౌట్‌తో ఆరంభించిన గంభీర్ అదే ఆట తీరుతో ముందుకెళుతున్నాడు. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో డకౌట్ అయి హ్యాట్రిక్ సాధించాడు. పరుగులేమీ చేయకుండా చేయకుండా అవుటవడంలో రికార్డు సాధించేందుకు ఉవ్విళ్లూరుతున్నట్టుగా ఉంది అతడి ఆట. మూడు మ్యాచ్‌ల్లోనూ బౌలర్లను ఎదుర్కొనేందుకు తీవ్ర ఇబ్బంది పడ్డాడు. పరుగులేమీ చేయకుండానే బ్యాట్ ఎత్తేశాడు. ముంబై ఇండియన్స్ తో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో 8 బంతులు ఎదుర్కొన్న గంభీర్ ఒక్క పరుగు చేయకుండానే మలింగ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఢిల్లీ డేర్ డెవిల్స్‌తో ఆడిన రెండో మ్యాచ్‌లోనూ డకౌట్ అయ్యాడు. బంతులు ఆడి ఒక్క పరుగు కూడా చేయకుండా కౌంటర్-నైల్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లోనూ గంభీర్ ఆట తీరు మారలేదు. ఆడిన తొలి బంతికే అవుటయ్యాడు. స్టార్క్ బౌలింగ్‌లో ఎల్బీబ్ల్యూగా అవుటయి డకౌట్ల హ్యాట్రిక్ సాధించాడు.