breaking news
gottipati bharath
-
పోలీసు పహారాలో దేవరపల్లి
ఒంగోలు: ప్రకాశం జిల్లాలో పర్చూరు మండలం దేవరపల్లిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా వివాదస్పద భూముల్లో చెరువు తవ్వుతుండటంతో దళితులు అడ్డుకున్నారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 400 మంది పోలీసుల సిబ్బంది పహారా మధ్య ప్రొక్లెయిన్లతో చెరువును తవ్వుతున్నారు. తమపై చంద్రబాబు సర్కారు కక్ష సాధిస్తోందని దళితులు వాపోయారు. 40 మందిని పోలీసులు అరెస్ట్ చేశారని, వారిని ఎక్కడకు తీసుకెళ్లారో కూడా తెలియడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. బిక్కుబిక్కు మంటూ బతుకుతున్నామని తమ గోడును ‘సాక్షి’ టీవీ ప్రతినిధితో వెళ్లబోసుకున్నారు. 2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పెత్తందారులందరూ ఒక్కటై తమకు ప్రత్యామ్నాయం చూపకుండా చెరువు తవ్వుతున్నారని తెలిపారు. ఎందుకు తవ్వుతున్నారని అడిగితే పోలీసులతో అరెస్ట్ చేయిస్తున్నారని చెప్పారు. తమకు న్యాయం చేయమని అడిగితే ఉన్నతాధికారులు స్పందించలేదని వాపోయారు. తమకు ఎవరూ మాకు సాయం చేయలేదని, గత్యంతరం లేని పరిస్థితుల్లో కోర్టును ఆశ్రయించామన్నారు. మరోవైపు దేవరపల్లిలో ఆంక్షలు కొనసాగుతున్నాయి. గ్రామంలో చెక్‌పోస్టులు పెట్టారు. మీడియా ప్రతినిధులను గ్రామంలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. పర్చూరు నియోజకవర్గంలో టీవీ ప్రసారాలు కూడా నిలిపివేశారు. దళితులంటే చంద్రబాబుకు మొదటి నుంచి చిన్నచూపేనని, వారి భూములు లాక్కోవడం సిగ్గుచేటని వైఎస్సార్ సీపీ పర్చూరు నియోజకవర్గ ఇన్చార్జ్ గొట్టిపాటి భరత్ విమర్శించారు. దళితులను అరెస్ట్ చేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, టీడీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని మండిపడ్డారు. దేవరపల్లిలో ఆంక్షలు తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. -
జనసంద్రం
⇒జననేతను చూడటానికి తరలివచ్చిన అభిమానులు ⇒నరసయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన జగన్ ⇒భరత్... రవికుమార్లది సూపర్‌హిట్ కాంబినేషన్ ⇒వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగ న్మోహన్ రెడ్డి ప్రశంసలు సాక్షి ప్రతినిధి, ఒంగోలు, మార్టూరు, యద్దనపూడి: యద్దనపూడి గ్రామం జనసంద్రమైంది. ఉదయం నుంచి కురుస్తున్న చిరు జల్లులు ఒకవైపు ... పొలాల్లో విచ్చుకుంటున్న పత్తి పాడైపోతోందన్న భయం మరోవైపు రైతుల్లో ఉన్నా తమ అభిమాన నేతను చూసేందుకు చుట్టుపక్కల నుంచి జనం భారీగా తరలి వచ్చారు. గురువారం యద్దనపూడిలో మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి నరసయ్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. అభిమానులు ఘనస్వాగతం పలికారు. జిల్లాలో అడుగుపెట్టిన మొదలు యద్దనపూడి వచ్చే వరకూ అన్ని గ్రామాల్లో జగన్‌ని చూసేందుకు, కరచాలనం చేసేందుకు జనం ఎగబడ్డారు. వారందరినీ జగన్ చిరునవ్వుతో పలకరిస్తూ ముందుకు సాగారు. భరత్‌కు అండగా ఉంటా... వైఎస్ఆర్సీపీ పర్చూరు నియోజకవర్గ ఇన్చార్జి గొట్టిపాటి భరత్‌కు తాను ఎప్పుడూ అండగా ఉంటానని వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. వర్షంపడుతున్నా లెక్కచేయకుండా వచ్చిన అక్కా చెల్లెమ్మలకు, అన్నా తమ్ముళ్లకు శిరస్సు వంచి ముందుగా నమస్కరిస్తున్నానన్నారు. ఎన్నికల ముందు అధిక వర్షాలు పడినప్పుడు ప్రజల కష్టాలు తెలుసుకుని రైతులకు సహకారం అందించాలని గ్రామాల్లో పర్యటిస్తూ గొట్టిపాటి నరసింహారావు అనారోగ్యానికి గురై మరణించిన విషయం మీకు తెలిసిందేనని అన్నారు. భౌతిక కాయాన్ని సందర్శించడానికి వచ్చిన సమయంలో ఆమె భార్య పద్మ భరత్ చేతిలో చేయి వేసి భరత్ భవిష్యత్తు మీరే చూసుకోవాలని కోరారన్నారు. ఎప్పటికీ భరత్ తన తమ్ముడులాంటి వారేనన్నారు. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ది, భరత్‌ది (బాబాయి, అబ్బాయిది) సూపర్‌హిట్ కాంబినేషన్ అని హర్షధ్వానాల మధ్య అన్నారు. తాను ఇప్పుడు రాజకీయ ప్రసంగం చేయదల్చుకోలేదని ప్రజలకు వివరించారు. ప్రజల కోసం మరణించారు... గొట్టిపాటి నరసయ్య జనం కోసం పనిచేసే వ్యక్తి అని అని గిద్దలూరు ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ముత్తుముల అశోక్‌రెడ్డి కొనియాడారు. చివరినిమిషం వరకు వారితోనే ఉన్నగొట్టిపాటి నరసయ్య మరణించినా ప్రజలు ఆయన్ను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారన్నారు. వై.ఎస్. అండ ఎప్పుడూ ఉండేది... దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరెడ్డి తన కుటుంబానికి ఎప్పుడూ అండగా ఉన్నారని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఇప్పుడు ఆయన కుమారుడు తమను ఆదరిస్తున్నారన్నారు. రానున్నఎన్నికల్లో భరత్‌ను గెలిపించి తీరుతామన్నారు. డబ్బుల కోసం పనిచేయలేదు పర్చూరు నియోజకవర్గ ఇన్చార్జి గొట్టిపాటి భరత్ మాట్లాడుతూ తన తండ్రి కాంస్య విగ్రహావిష్కరణకు వచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఎంతో మంది డబ్బున్న వాళ్లు పర్చూరు సీటు కోసం ప్రయత్నించినా జగనన్న తనకుటుంబం మీద ఉన్న అభిమానంతో తనకు సీటు కేటాయించారన్నారు. తన కుటుంబం 35 సంవత్సరాల నుంచి ప్రజలతోనే నడుస్తోంది. తాము జనాలకు పనులు చేసి ఎప్పుడూ డబ్బులు తీసుకోలేదని, కానీ ఇప్పుడు గెలిచినవారు ప్రతి రేషన్ షాపు నుంచి కోటాకు నెలకు రూ.1500 వసూలు చేస్తున్నారన్నారు. కొన్ని ఇబ్బందులున్నందున ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని, ఇక నుంచి వారానికి నాలుగు రోజులు అందుబాటులో ఉంటానని చెప్పారు. జగన్ అనే మహాశక్తి నా వెనుక ఉందని, తనకు ఎలాంటి ఇబ్బందీ లేదన్నారు. తన తాత గొట్టిపాటి హనుమంతరావు, తన తండ్రి గొట్టిపాటి నరసింహారావు, తన బాబాయి గొట్టిపాటి రవికుమార్ చూపిన బాటలో నడుస్తానన్నారు. జగన్ రాకతో జనసంద్రమైన యద్దనపూడి వైఎస్ఆర్ సీపీ అధినేత వై.ఎస్. జగన్ యద్దనపూడి రాకతో వైఎస్ఆర్ సీపీ అభిమానులు, గొట్టిపాటి అభిమానులతో యద్దనపూడి జనసంద్రమైంది. యద్దనపూడి సెంటర్లోని నివాస గృహాలపైకి ఎక్కి జనం జగన్‌ను చూసేందుకు ఆసక్తి చూపించారు. పర్చూరు, అద్దంకి, చిలకలూరిపేట నియోజకవర్గాల నుంచి గొట్టిపాటి అభిమానులు, వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. విగ్రహావిష్కరణ తర్వాత అక్కడి నుంచే ప్రసంగించారు. కనపడలేదంటూ అభిమానులు గోల చేయడంతో జగన్ అక్కడే ఏర్పాటు చేసిన వేదికపైకి ఎక్కి అందరినీ పలకరించారు. అభిమానులతో కరచాలనం చేశారు. అనంతరం గొట్టిపాటి భరత్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో రెండు గంటలకుపైగా గడిపారు. అక్కడి నుంచి బయలుదేరి విజయవాడ వెళ్లారు. వాహనాల రాకపోకలకు అంతరాయం జనం అధిక సంఖ్యలో హాజరు కావటంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.. దీంతో గన్నవరం సమీపంలో, యనమదల వద్ద వాహనాలు పూర్తిగా నిలిచిపోయాయి. వాహనాలు అక్కడే నిలిపి జగన్‌ను చూడటానికి కాలినడకన తరలి వచ్చారు. యనమదలలో స్వాగతం పలికిన నేతలు... చిలకలూరిపేట నుంచి యద్దనపూడికి వస్తున్న జగన్ కాన్వాయి యనమదల వద్ద అభిమానులు రోడ్డు మీద నిలబడి ఉండటంతో ఆపారు. రోడ్డు మీద నిల్చొని ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకుడు దొడ్డా బ్రహ్మానందాన్ని జగన్ పలకరించి కరచాలనం చేశారు. విగ్రహావిష్కరణ అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో వేలాది మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, జిల్లా ఎమ్మెల్యేలు పాలపర్తి డేవిడ్ రాజు, ఆదిమూలపు సురేష్, జంకె వెంకటరెడ్డి, పోతుల రామారావు, మాజీ ఎమ్మెల్యేలు పేర్ని నాని, బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, బాచిన చెంచు గరటయ్య, కనిగిరి నియోజకవర్గ ఇన్చార్జి బుర్రా మధుసూదన్‌యాదవ్, చీరాల నియోజకవర్గ ఇన్చార్జి యడం బాలాజీ, పర్చూరు, యద్దనపూడి, కారంచేడు, మార్టూరు, ఇంకొల్లు మండల పార్టీ కన్వీనర్లు తోకల కృష్ణమోహన్, దూళిపాళ్ల వేణుబాబు,పఠాన్ కాలేషావలి, దండా చౌదరి, కోట్ల విజయ భాస్కరరెడ్డి, డెయిరీ మాజీ చైర్మన్ ఉప్పలపాటి చెంగలయ్య నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, మాజీ ఎంపీటీసీ, జెడ్పీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శులుగా బాలినేని, రెహమాన్
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శులుగా బాలినేని శ్రీనివాసరెడ్డి, హెచ్ ఏ రెహమాన్ నియమితులయ్యారు. విశాఖపట్నంకు చెందిన బి. జాన్ వెస్లీ కార్యదర్శిగా నియమించారు. పర్చూరుకు చెందిన గొట్టిపాటి భరత్- ప్రకాశం జిల్లా యూత్ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు మేరకు ఈ నియమకాలు జరిగినట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. -
ప్రజా సంక్షేమం కోసమే జగనన్న ఐదు సంతకాలు
కుంకలమర్రు (కారంచేడు) న్యూస్‌లైన్: రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమే కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐదు సంతకాలు చేయబోతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పర్చూరు నియోజకవర్గ సమన్వయకర్త గొట్టిపాటి భరత్ అన్నారు. మంగళవారం రాత్రి ఆయన మండలంలోని కుంకలమర్రులో పర్యటించారు. కారంచేడు జెడ్పీటీసీ అభ్యర్థిని దగ్గుబాటి నాగజ్యోతి, కుంకలమర్రు ఎంపీటీసీ అభ్యర్థిని జువ్వా కోమలరాణిలకు ‘ఫ్యాన్’ గుర్తుపై ఓటును వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. రాష్ట్ర ప్రజలు జగన్మోహన్రెడ్డి పాలన కోసం ఎదురు చూస్తున్నారని ఆయన అన్నారు. వారి సంక్షేమం కోసం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత పిల్లల్ని బడికి పంపే తల్లి ఖాతాలో డబ్బులు వేసేలా ‘వైఎస్సార్ అమ్మ ఒడి’ పథకంపై మొదటి సంతకం చేస్తారన్నారు. అవ్వా తాతలకు 200 నుండి 700 పింఛను పెంచుతూ రెండవ సంతకం, రైతన్నలకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు 3 వేల కోట్ల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తూ మూడో సంతకం పెడతారన్నారు. డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తూ నాలుగోసంతకం, ఏ గ్రామానికి వెళ్లినా అడిగిన వెంటనే అన్ని రకాల కార్డులు మంజూరు చేసేలా ఐదో సంతకం చేసి కొత్త చరిత్ర సృష్టిస్తారని చెప్పారు. పేద ప్రజల కోసం చేసిన వాగ్దానాలు నెరవేర్చగల నాయకుని రాజ్యం కోసం ప్రజలు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారని ప్రజల హర్షాతిరేకాల మధ్య భరత్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఖాళీ.. మండలంలోని కుంకలమర్రులో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయ్యింది. మంగళవారం రాత్రి భరత్ సమక్షంలో గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు జువ్వా శ్రీనివాసరావు, అనిశెట్టి మస్తానరావు, గ్రామ సర్పంచ్ కూరాకుల వజ్రమ్మ, మాజీ ఎంపీటీసీ సభ్యులు తెలగతోటి స్వాతి, కే నాగేశ్వరమ్మ, గ్రామ వార్డు సభ్యుల ఆధ్వర్యంలో సుమారు 2 వేల మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. భరత్ రాకతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. భరత్‌కు అడుగడుగునా నీరాజనం గొట్టిపాటి భరత్‌కు కుంకలమర్రులో అడుగడుగునా ప్రజలు నీరాజనం పలికారు. గ్రామ దేవతలు పోలేరమ్మ, తిరుపతమ్మల దేవాలయాల్లో భరత్ ప్రత్యేక పూజలు చేశారు. అక్కడ నుంచి ప్రత్యేకంగా తయారు చేసిన ఎద్దుల బండిపై జెడ్పీటీసీ అభ్యర్థిని దగ్గుబాటి నాగజ్యోతి, ఎంపీటీసీ అభ్యర్థిని జువ్వా కోమలరాణి గ్రామంలోని బీసీ కాలనీ, పుట్టాయిపాలెం, ఎస్సీ కాలనీ, మెయిన్రోడ్డుల గుండా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి వీధిలోను భరత్‌కు మహిళలు హారతులు పట్టారు. పూలవర్షం కురిపించారు. అనంతరం మెయిన్ రోడ్డులోని వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కూరాకుల వజ్రమ్మ, జువ్వా శ్రీనివాసరావు, అనిశెట్టి మస్తాన్‌రావు, యార్లగడ్డ పాపారావు, భానుప్రకాష్, యార్లగడ్డ సుబ్బారావు, దగ్గుబాటి రామకృష్ణ, సుమంత్, కోటయ్య, వేలాది మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.