breaking news
Google Mobile Phone
-
రూ. 1.50 లక్షల గూగుల్ ఫస్ట్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ - ప్రత్యేకతలివే!
ఆధునిక కాలంలో స్మార్ట్ఫోన్లు కొత్త కొత్త అవతారాలలో పుట్టుకొస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇప్పుడు ఫోల్డబుల్ మొబైల్స్ మార్కెట్లో విడుదలవుతున్నాయి. కానీ గూగుల్ సంస్థ మొదటి సారి తన ఫిక్సెల్ ఫోల్డబుల్ ఫోన్ దేశీయ విఫణిలోకి లాంచ్ చేసింది. ఈ లేటెస్ట్ మొబైల్ ప్రైస్, ఫీచర్స్ వంటి వాటితో పాటు ఇతర వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి. ప్రముఖ టెక్ సంస్థ గూగుల్ భారతదేశంలో తన కొత్త ఫోల్డబుల్ మొబైల్ లాంచ్ చేసింది. 'గూగుల్ ఫిక్సెల్ ఫోల్డ్' అని పిలువబడే ఈ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో విడుదలైంది. అవి 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్, 12జీబీ ర్యామ్ + 512జీబీ స్టోరేజ్. వీటి ధరలు వరుసగా రూ. 1,47,500 & రూ. 1,57,300. ఈ మొబైల్స్ అమ్మకాలు ఫ్లిప్‌కార్ట్‌లో మొదలయ్యాయి. ఒబ్సిడియన్, పోర్సెలాయిన్ అనే రెండు కలర్ ఆప్షన్లలో విడుదలైంది. గూగుల్ ఫోల్డబుల్ మొబైల్ 7.6 ఇంచెస్ ఫుల్ హెచ్డీ+ OLED ఇన్నర్ డిస్ప్లేతో పాటు 5.8 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ఔటర్ డిస్ప్లే కూడా పొందుతుంది. ఈ డిస్ప్లేలు 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్‌తో ఔటర్ డిస్ప్లే పొందుతాయి. (ఇదీ చదవండి: నిండా 18 ఏళ్ళు లేవు..! రూ. కోటి కంటే ఎక్కువ ఖరీదైన కారు కొనేసాడు - వీడియో) ఈ లేటెస్ట్ మొబైల్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో మూడు రియర్ కెమెరాలను పొందుతుంది. అవి 48 మెగాఫిక్సల్ ప్రైమరీ కెమెరా, 10.8 మెగాఫిక్సల్ అల్ట్రావైడ్, 10.8 మెగాఫిక్సల్ డ్యూయెల్ పీడీ టెలిఫోటో లెన్స్ కెమెరా. అయితే సెల్ఫీలు, వీడియోల కోసం ఔటర్ డిస్ప్లేకి 9.5 మెగాఫిక్సల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది. అంతే కాకుండా ఈ మొబైల్ ఫోల్డ్ చేసినప్పుడు 8 మెగాఫిక్సల్ కెమెరా అందుబాటులో ఉంటుంది. (ఇదీ చదవండి: సినిమా హీరోలా ఉంటాడనుకున్నా, తీరా చూస్తే.. భర్తపై సుధా మూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు) ఇక బ్యాటరీ, ఛార్జింగ్ వంటి విషయాలకు వస్తే.. ఇందులో 4821mAh బ్యాటరీ ఉంటుంది. ఇది 30 వాట్స్ వైర్డ్ ఛార్జింగ్, వైర్లెస్ ఛార్జింగ్ వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ ఫోన్ మొత్తం బరువు 283 గ్రాములు మాత్రమే. ఇందులో 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6ఈ, బ్లూటూత్, ఎన్ఎఫ్సీ కనెక్టివిటీ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. -
గూగుల్ ఫోన్‌తో లైవ్ 3డీ మ్యాప్
వాషింగ్టన్: టెక్నాలజీ దిగ్గజం గూగుల్ మరో అరుదైన గాడ్జెట్‌కు రూపకల్పన చేసింది. లైవ్‌లో 3డీ మ్యాప్‌ను చిత్రించేందుకు వీలున్న సరికొత్త మొబైల్ ఫోన్‌ను గూగుల్ రూపొందించింది. గూగుల్‌కు చెందిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ప్రాజెక్ట్ యూనిట్ వివిధ ఇన్స్టిట్యూట్ల సహాయంతో ఈ ఫోన్‌ను అందుబాటులోకి తేనుంది. దీని ద్వారా మన చుట్టుపక్కల ప్రాంతాలను మొబైల్ ద్వారా షూట్ చేసి దానిని 3డీ మ్యాప్‌గా మార్పు చేయవచ్చు. ఇందుకుగానూ మొబైల్లోనే నావిగేషన్ కోసం అత్యాధునిక స్కానర్‌ను పొందుపరిచారు. ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వివిధ రూపాల్లో వాడుకోవచ్చని, ఎక్కువగా ప్రచారం పొందని భవనాలు, ప్రదేశాలను గుర్తించేందుకు, అంధులకు సహాయపడేందుకు, ఇండోర్ గేమింగ్‌లో మరింత లీనమయ్యేందుకు ఈ టెక్నాలజీ ఉపయోగపడుతుందని గూగుల్ వర్గాలు చెబుతున్నాయి. ఆండ్రాయిడ్ అప్లికేషన్‌తో పనిచేసే ఈ ఐదంగుళాల మొబైల్లో 3డీ మోషన్లో వీడియోను రికార్డ్ చేసేందుకు అనువుగా హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌ను నిక్షిప్తం చేశారు. ఫోన్లోని సెన్సార్లు ఒక సెకనులో రెండున్నర లక్షల 3డీ మెజర్మెంట్స్ను అందుకుని, ఏకకాలంలో ఆ లొకేషన్‌ను 3డీ మ్యాప్‌గా మార్చేస్తాయి.