breaking news
golden statue
-
డొనాల్డ్ ట్రంప్ బంగారం విగ్రహం!
అమెరికా కాపిటల్ వెలుపల అధ్యక్షుడు 'డొనాల్డ్ ట్రంప్' బిట్‌కాయిన్ పట్టుకుని ఉన్న 12 అడుగుల బంగారు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గింపు నేపథ్యంలో క్రిప్టోకరెన్సీ పెట్టుబడిదారుల నిధులతో.. ఈ విగ్రహం ఏర్పాటు చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.డొనాల్డ్ ట్రంప్ బిట్‌కాయిన్ చేతపట్టుకున్న విగ్రహం.. డిజిటల్ కరెన్సీ, మనీటరీ పాలసీ, ప్రభుత్వ వ్యవహారాలలో వడ్డీ పాత్ర వంటి విషయాల మీద ప్రజలలో చర్చ మొదలవ్వాలనే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇది ట్రంప్, క్రిప్టో మద్దతుదారుల మధ్య సంబంధాలను ప్రతీక అని చెబుతున్నారు. ఈ విగ్రహంపై తీవ్రమైన విమర్శలు కూడా కురిపిస్తున్నారు. అయితే ఈ విగ్రహాన్ని బంగారంతో చేసారా? లేక బంగారం పూత పూశారా?.. లేదా ఇతర మెటల్స్ ఉపయోగించి రూపొందించారా? అనేది తెలియాల్సి ఉంది.25 శాతం తగ్గిన ఫెడ్ వడ్డీ రేటుయూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ రెండు రోజుల పాలసీ సమీక్షలో వడ్డీ రేటును పావు శాతం తగ్గిస్తున్నట్లు నిర్ణయించింది. ఫెడ్ చైర్మన్ జెరోమీ పావెల్ అధ్యక్షతన రెండు రోజులపాటు జరిగిన ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్‌వోఎంసీ) వడ్డీ రేటులో 0.25 శాతం తగ్గింపుకే సుముఖత చూపింది. గత ఐదు పాలసీ సమీక్షలలో వడ్డీ రేటును యథాతథ ఉంచడానికి మొగ్గుచూపారు. అయితే 9 నెలల తరువాత వడ్డీ రేటు తగ్గించడానికి నిర్ణయం తీసుకున్నారు.A crypto group installed a 12-foot golden statue of President Trump 🇺🇸 holding a #Bitcoin placed outside the US capital.This is gold 😂 pic.twitter.com/K3i69PeHCU— CryptoMalaysia (@CryptoMYsia) September 18, 2025 -
ఆస్కార్ విలువెంతో తెలిస్తే షాక్!
బంగారం వర్ణంలో మెరిసిపోయే ఆస్కార్ కు వినోద రంగంలో ఉన్న గౌరవం అంతా ఇంతా కాదు. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ గోల్డెన్ ఆస్కార్‌ను ఒక్కసారైనా ఇంటికి తీసుకెళ్లాలి అని ప్రతి ఒక్క ఆర్టిస్టూ ఎన్నో కలలు కంటూ ఉంటారు. కానీ ఆ అదృష్టం కొద్దిమందికే వరిస్తూ ఉంటోంది. బంగారు రంగుల్లో మెరిసిపోయే ఈ ఆస్కార్ విలువెంతో అసలు ఎప్పుడైనా, ఎవరైనా గెస్ చేశారా? ఈ ఆస్కార్ విలువ కేవలం 10 డాలర్లేనట అంటే భారతీయ కరెన్సీ ప్రకారం రూ.666 మాత్రమే. అయితే ఈ విగ్రహం తయారుచేయడానికి అయ్యే ఖర్చు మాత్రం 400 డాలర్లు(రూ.26,655). ఒకవేళ దీన్ని ఆక్షన్‌కు పెట్టాలనుకుంటే రూల్స్ ప్రకారం ఈ ట్రోఫికి 10 డాలర్లను అకాడమీ ఆఫ్ మోషన్ ఫిక్చర్ ఆర్ట్ అండ్ సైన్సెస్(ఏఎమ్పీఏఎస్) కు చెల్లించాల్సి ఉంటుంది. 2015 నుంచి ఈ నిబంధనను కోర్టు అమలుచేస్తూ వస్తోంది. ఈ రూల్‌ను సమర్థిస్తూ వస్తున్న ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు, ఆస్కార్ విన్నర్ స్టీవెన్ స్పీల్ బర్గ్, బెట్ డేవిస్, క్లార్క్ గేబుల్కు చెందిన ఆస్కార్లపై 1.36 మిలియన్ డాలర్లు ఖర్చు చేశారు. వీటిని తిరిగి అకాడమీకి విరాళంగా ఇవ్వడానికే ఆయన ఇంత ఖర్చు చేశారట.