breaking news
gold coating
-
Yadagirigutta: బలిపీఠానికి బంగారు తొడుగు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలోని ఆళ్వార్ మండపంలో నిర్మించిన ధ్వజస్తంభం బలి పీఠానికి బంగారు తొడుగు పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇటీవలే ప్రధానాలయంలోని గర్భాలయ ద్వారాలకు చెన్నైలో తయారు చేయించిన బంగారు తొడుగులను బిగించారు. ఇందులో భాగంగానే ధ్వజస్తంభం బలిపీఠానికి వారం రోజుల కిందట బంగారు తొడుగు పనులను ప్రారంభించారు. బంగారు తొడుగులతో బలిపీఠం, ధ్వజస్తంభం భక్తులకు కనువిందు చేయనున్నాయి. ఆలయమంతా బంగారు వర్ణంలో ఉండాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఇప్పటికే విద్యుత్ దీపాలను పసిడి వర్ణంలో తీర్చిదిద్దుతుండగా.. ప్రధానాలయంలో అంతటా బంగారు తొడుగుల పనులను చేయిస్తున్నారు. (చదవండి: జూబ్లీహిల్స్‌వాసులకు నిద్రలేని రాత్రులు.. స్థానికుల ఆందోళన) -
టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
తిరుపతి: శ్రీవారి సేవా టిక్కెట్లు, అద్దె గదులు, కల్యాణ మండపాల ధరల పెంపు నిర్ణయాన్ని టీటీడీ బోర్డు వాయిదా వేసింది. శుక్రవారం జరిగిన సమావేశంలో టీటీడీ బోర్డు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వం తరపున రూ. 5 కోట్ల విలువైన బంగారు ఆభరణాల తయారీకి టీటీడీ ఆమోదం తెలిపింది. తిరుపతి రైల్వే స్టేషన్ కు 2.7 ఎకరాల భూమి లీజుకు అంగీకారం తెలిపింది. టీటీడీ కాంట్రాక్టు కార్మికుల పదవీకాలం మరో ఏడాది పొడిగించింది. తిరుమల రెండో ఘాట్ రోడ్డులో మరమ్మతులకు రూ. 2.8 కోట్లు మంజూరు చేసింది. వారి ఆలయంలో జయ, విజయ వద్ద వాకిలిని బంగారు తాపడం చేయించేందుకు టీటీడీ బోర్డు నిర్ణయించింది. -
‘గుట్ట’కు స్వయంప్రతిపత్తి
ఆలయ గోపురానికి బంగారు తాపడం గుట్టమీదుగా రీజినల్ రింగ్‌రోడ్డు ప్రత్యేకాధికారిగా కిషన్‌రావు నియామకం ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడి సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టను వాటిక న్ సిటీ తరహాలో అభివృద్ధి చేయటానికి సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. తిరుమల తిరుపతి దేవస్థానాలకు ఉన్నట్టు ఈ క్షేత్రానికి కూడా స్వయం ప్రతిపత్తి కల్పించనున్నట్టు ఆయన వెల్లడించారు. సోమవారం సచివాలయంలో యాదగిరి క్షేత్ర అభివృద్ధి ప్రణాళికలపై ఆయన సమీక్షించారు. ప్రభుత్వ సలహాదారు పాపారావు, ప్రత్యేకాధికారి కిషన్‌రావు, సీఎం కార్యాలయ ముఖ్యకార్యదర్శి నరసింగరావు, ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి పాల్గొన్నారు. యాదగిరిగుట్ట అభివృద్ధికి శిల్పారామం ప్రత్యేకాధికారి, విశ్రాంత ఐఏఎస్ అధికారి జి.కిషన్‌రావును పర్యవేక్షణాధికారిగా సీఎం నియమించారు. యాదగిరిగుట్ట ఆలయగోపురం స్పష్టంగా కనిపించేలా చూడాలన్నారు. అడ్డుగా ఉన్న నిర్మాణాలను తొలగించి పద్ధతిప్రకారం మళ్లీ నిర్మిస్తే ఎలా ఉంటుందని యోచించారు. అలాగే గోపురానికి బంగారు తాపడం చేయించాలని సీఎం ఆదేశించారు. రెండువేల ఎకరాలు సేకరించి కల్యాణ మండపాలు, వేదపాఠశాల, సంస్కృత పాఠశాల నిర్మించాలని పేర్కొన్నారు. సమీపంలో స్వామి పేరుతో అభయారణ్యాన్ని అభివృద్ధి చేయాలని ఆదేశించారు. గుట్టపైన సుగంధ మొక్కలు నాటి పచ్చిక బయళ్లు ఏర్పాటు చేయాలన్నారు. స్వామిదీక్షలు చేసేవారికి, భక్తులకు బహుళఅంతస్తుల భవనాన్ని నిర్మించాలని పేర్కొన్నారు. క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామికి దేశంలోనే పెద్దదైన విగ్రహాన్ని ప్రతిష్ఠించాలన్నారు. ఆయా ప్రాంతాలకు ఆధ్యాత్మిక పేర్లు పెట్టాలని సూచించారు. దారిలో ఉన్న రాయగిరి, గంధమల్ల చెరువు, ఇతర గుట్టలను పర్యాటక ప్రాంతాలుగా తీర్దిదిద్దాలని ఆదేశించారు. ఔటర్ రింగురోడ్డు ఆవల నిర్మించతలపెట్టిన రీజినల్ రింగురోడ్డు యాదగిరి క్షేత్రం మీదుగా వెళ్లేలా చూడాలన్నారు.