breaking news
Gnanadesikan
-
కాంగ్రెస్‌లో చీలిక?
తమిళనాడు కాంగ్రెస్ కమిటీ (టీఎన్‌సీసీ)లో చీలిక మొదలైంది. టీఎన్‌సీసీ అధ్యక్ష పదవికి జ్ఞానదేశికన్ చేసిన రాజీనామా ఆమోదం పొందడం, కొత్త అధ్యక్షునిగా ఈవీకేఎస్ ఇళంగోవన్ నియామకం జరిగిపోగా, మాజీలు మరో పార్టీ సన్నాహాల్లో పడిపోయారు. చెన్నై, సాక్షి ప్రతినిధి : రాష్ట్ర కాంగ్రెస్‌లో సంస్థాగత సభ్యత్వం కార్యక్రమం జరుగుతుండగా, కార్యకర్తలకు జారీచేసే సభ్యత్వకార్డులో మాజీ ముఖ్యమంత్రి కామరాజనాడార్, సీనీయర్ నేత జీకే మూపనార్ ఫొటోలను తొలగించాలని పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయంతో పార్టీలో ముసలం బయలుదేరింది. ఫొటోల తొలగింపులో తనను మాటమాత్రమైనా అడగకుండా నిర్ణయం తీసుకోవడం జ్ఞానదేశికన్‌కు ఆగ్రహం తెప్పించింది. అధిష్టానం ఏకపక్ష నిర్ణయాలు చేస్తోంది అంటూ రెండు రోజుల క్రితం సోనియాగాంధీకి రాజీనామా లేఖ పంపగా వెంటనే ఆమోదించారు. 2016లో రాబోయే అసెంబ్లీ ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కోగల వ్యక్తిని నియమించాలనే ఏకవాక్య అజెండాతో సోనియా ఢిల్లీలోని తన స్వగృహంలో శనివారం అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర పార్టీ ఇన్చార్జ్ ముకుల్‌వాస్నిక్ పలువురు సీనియర్ నేతలతో చర్చలు జరి పారు. ఈ సందర్భంగా ఇళంగోవన్, పీటర్ ఆల్బెన్స్, సుదర్శన్ నాచియప్పన్, తిరునావుక్కరసు, వసంతకుమార్ పేర్లను సమావేశం పరిశీలించింది. టీఎన్‌సీసీ అధ్యక్షునిగా గతంలో పనిచేసిన అనుభవం ఉన్న ఇళంగోవన్ పేరును ఏకగ్రీవంగా తీర్మానించగా, రాష్ట్ర ఇన్చార్జ్ ముకుల్ వాస్నిక్ అధికారికంగా ప్రకటించారు. ప్రకటన వెలువడిన వెంటనే సత్యమూర్తి భవన్‌కు చేరుకున్న ఇళంగోవన్‌ను ఆయన అభిమానులు అభినందనలతో ముంచెత్తారు. భవన్ ప్రాంగణంలో బాణాసంచా కాల్చి సంబరం చేశారు. ఇళంగోవన్ సత్యమూర్తి భవన్ నుంచి కేంద్ర మాజీ మంత్రి జీకే వాసన్ ఇంటికి వెళ్లి అండగా నిలవాలని కోరారు. అనుభవం అనుకూలించేనా? ఈరోడ్ జిల్లా గోపిచెట్టి పాళయంలో జన్మించిన ఇళంగోవన్ 2000 నుంచి 2002 వరకు టీఎన్‌సీసీ అధ్యక్షునిగా పనిచేశారు. 2004లో గోపిచెట్టి పాళయం నుంచి ఎంపీగా ఎన్నికై కేంద్ర మంత్రిగా పనిచేశారు. ప్రతిపక్షాల విమర్శలకు దీటుగా తిప్పికొట్టగల నేర్పు న్న నాయకునిగా పేరుంది. పార్టీలోని అన్నివర్గాలను కలుపుకుపోగల నాయకత్వ లక్షణాలు ఉన్న నేతగా చెప్పుకుంటారు. రాష్ట్రంలో పార్టీ పూర్తిగా చతికిలబడి ఉన్న పరిస్థితిల్లో ఇళంగోవన్ అనుభవం అనుకూలిస్తుందా అనేది వేచి చూడాల్సిందే. -
ఫిబ్రవరిలో రాష్ట్రానికి రాహుల్ రాక
టీనగర్, న్యూస్‌లైన్: కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఫిబ్రవరిలో రాష్ట్రానికి రానున్నారని టీఎన్‌సీసీ అధ్యక్షుడు జ్ఞానదేశికన్ తెలిపారు. ఆయన సత్యమూర్తి భవన్లో సోమవారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ నెల 28, 29 తేదీల్లో కళాశాల విద్యార్థుల వద్ద అవినీతికి వ్యతిరేకంగా మద్దతు కోరుతూ సంతకాల సేకరణ చేపట్టనున్నట్లు తెలిపారు. 30న విద్యార్థి కాంగ్రెస్ తరపున జిల్లా ప్రధాన నగరాల్లో అవినీతికి వ్యతిరేకంగా నిరాహార దీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. 31న అవినీతికి వ్యతిరేకంగా విజ్ఞప్తులను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీల ఎంపీ, ఎమ్మెల్యేలకు అందజేస్తామన్నారు. ఫిబ్రవరి 4న జిల్లా స్థాయిలో అవినీతికి వ్యతిరేకంగా ధర్నా, 5న పార్లమెంటులో లోక్‌పాల్ ముసాయిదా ప్రవేశపెట్టేందుకు మద్దతు కోరుతూ చెన్నైలో ఆందోళన జరుపనున్నట్లు తెలిపారు. 12న రాష్ర్టవ్యాప్తంగా మద్య నిషేధం కోరుతూ ఆందోళన జరపనున్నామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం కోసం ఫిబ్రవరి చివరిలో రాష్ట్రానికి రానున్నట్లు తెలిపారు.