breaking news
girl friend injured
-
కదులుతున్న కారులో శృంగారం..
- ట్రక్కు ఢీకొని ప్రియుడి దుర్మరణం, ప్రియురాలికి తీవ్ర గాయాలు - ఫిలిబిత్- పురాన్ పూర్(యూపీ) హైవేపై ఘటన ఫిలిబిత్: ప్రియురాలిని సొంత ఊరిలో దింపేందుకు కారులో బయలుదేరిన ప్రియుడు.. దారి మధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. వేగంగా కారు నడుపుతూ ప్రియురాలితో శృంగారంలో పాల్గొనడం తనుచేసిన ఘోరతప్పిదం. ఉత్తరప్రదేశ్ లోని ఫిలిబిత్- పురాన్ పూర్ హైవేపై బుధవారం చోటుచేసుకున్న ఈ సంఘటనలో ప్రియురాలు ప్రాణాలతో బయటపడగలిగింది. గజ్రౌలా పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ రాజేశ్ యాదవ్ తెలిపిన వివరాలను బట్టి.. పురాన్ పూర్ కు చెందిన 24 ఏళ్ల యువతి.. ఫిలిబిత్ లో నివసిస్తూ ఉద్యోగం చేస్తోంది. అక్కడే పరిచయమైన 31 ఏళ్ల యువకుడితో స్నేహం ప్రేమగా మారింది. అత్యవసర పని నిమిత్తం ఆ యువతి తన సొంతింటికి వెళ్లాల్సి రావడంతో యువకుడు తన కారులో ఆ అమ్మాయిని దిగబెట్టేందుకు పురాన్ పూర్ బయలుదేరాడు. ఉద్రేకం ఆపుకోలేక కారులో ప్రయాణిస్తూనే ఇద్దరూ శృంగార చర్యకు దిగారు. డ్రైవింగ్ పై పట్టుకోల్పోయిన ఆ యువకుడు.. తన కారును ఎదురుగా వచ్చిన ట్రక్కుపైకి పొనిచ్చేశాడు. కఠానా బ్రిడ్జ్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంపై స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కారులో ఉన్న ఇద్దరినీ చూసి అవాక్కయ్యారు. ప్రియుడు, ప్రియురాలి ఒంటిపై నూలుపోగు లేకపోవడం, కారులో వారు ఇరుక్కుపోయిన భంగిమ, ట్రక్కు డ్రైవర్ వివరణనుబట్టి.. ఆ ఇద్దరూ కారులో శృంగారానికి పాల్పడటంవల్లే ప్రమాదం సంభవించిందని పోలీసులు నిర్ధారించుకున్నారు. ప్రియుడు అక్కడికక్కడే చనిపోగా, గాయపడ్డ ప్రియురాలికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని, వివరాలు తెలుసుకుని కుటుంబసభ్యులకు సమాచారం అందిస్తామని పోలీసులు చెప్పారు. -
పెళ్లికి ఒప్పుకోలేదని ప్రేమజంట ఇంట్లో నుంచి పారిపోతూ...
చెన్నై: ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో పెళ్లి చేసుకునేందుకు ప్రేమజంట ఇంటినుంచి పారి పోయి... బైకుపై వెళుతూ లారీని ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ప్రేమికుడు అక్కడికక్కడే మృతిచెందగా ప్రియురాలికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన వేలూరు సమీపంలో చోటుచేసుకుంది. వేలూరు జిల్లా ఆంబూరు సమీపంలోని మాదనూర్ పాలార్ గ్రా మానికి చెందిన పాండియన్(28), అదే గ్రామానికి చెందిన యువతి(19) ప్రేమించుకున్నారు. వీరి ప్రేమను తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో రెండు రోజుల క్రితం ఇద్దరూ ఇంటి నుంచి పారిపోయారు. వీరి తల్లిదండ్రులు ఎంత వెతికినా వారి ఆచూకీ కనిపించలేదు. ఆంబూరు తాలుకా పోలీసులకు పాండియన్పై అనుమానం ఉందని యువతి తండ్రి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రేమజంట కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలో ప్రేమజంట శనివారం ఉదయం చెన్నై-బెంగళూరు జాతీయ రహదారిలో బైకులో ఆంబూరు వైపు వెళుతుండగా వేలూరు సమీపంలోని అలిమేలుమంగాపురం వద్ద ముందు వెళుతున్న లారీని బైకు ఢీకొంది. ఈ ప్రమాదంలో ప్రే మజంట రోడ్డుపై పడడంతో పాండియన్ తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. యువతికి తీవ్రగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న సత్వచ్చారి పోలీసు లు అక్కడకు చేరుకుని యువతిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.