gilr
-
ఒక విద్యార్థిని కోసం.. బీభత్సం చేసిన రెండు కాలేజీల ఇంటర్ విద్యార్థులు
సాక్షి,విజయవాడ: కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఇంటర్ విద్యార్థులు ఘర్షణకు దిగారు. రెండు ప్రైవేట్ కాలేజీలకు చెందిన విద్యార్థులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. బస్సు అద్దాలను ధ్వంసం చేసి ఘర్షణ వాతావరణం సృష్టించారు. దీంతో బస్సులో ఉన్న విద్యార్ధులు భయబ్రాంతులకు గురయ్యారు.ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాసేందుకు వచ్చిన విద్యార్థులు ఓ విద్యార్థిని విషయంలో ఘర్షణ పడినట్లు తెలుస్తోంది. పరీక్షకు ముందు ఎగ్జామ్ సెంటర్ సమీపంలోని జిరాక్స్ సెంటర్ వద్ద ఓ కాలేజీ విద్యార్థినితో చిన్న వాగ్వాదం జరిగింది. అది చిలికి చిలికి.. కూల్ డ్రింక్ బాటిళ్లతో తలల పగలగొట్టేంత ఘర్షణకు దారి తీసింది.స్థానికులు వద్దని వారిస్తున్నా వినని విద్యార్థులు షాపుల్లో ఉన్న కూల్డ్రింక్ బాటిళ్లతో దాడులకు దిగడంతో భీతావాహ పరిస్థితి నెలకొంది. -
కిడ్నాప్ కథా చిత్రమ్ : ఆదిభట్ల కిడ్నాప్ కేసులో ముమ్మర దర్యాప్తు
-
బాలికకు నిప్పంటించిన వృద్ధురాలు
నల్లగొండ : నల్లగొండ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ వృద్ధురాలు ఆరెళ్ల బాలికపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. ఈ విషాద సంఘటన గురువారం నల్లగొండ జిల్లా సూర్యాపేట పట్టణంలోని శాంతినగర్లో వెలుగుచూసింది. వివరాలు.. పట్టణంలోని శాంతినగర్కాలనీలో బుధవారం అర్ధరాత్రి ఒక వృద్ధురాలు పక్కింటికి చెందిన సాయి మన్విత(6) అనే బాలికపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. పాప పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వృద్ధురాలిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, వృద్ధురాలి బంధువులు మాత్రం ఆమెకు మతిస్థిమితం లేకపోవడం వల్లే ఈ సంఘటన జరిగిందని తెలుపుతున్నారు. (సూర్యాపేట) -
ఏఎస్ఐ వేధించిన బాలిక మృతి
ఇండోర్: అనుమతి లేకుండా తన సైకిల్ తొక్కిందని ఏఎస్ఐ వేధించడంతో ఆత్మాహుతికి యత్నించిన పదకొండేళ్ల బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మరణించింది. రెండు రోజుల పాటు మత్యువుతో పోరాడిన బాలిక చివరకు తనువు చాలించింది. ఈ ఘటన ఇండోర్లో జరిగింది. గతనెల 29న స్థానిక సికింద్రాబాద్ కాలనీలో ఉంటున్న ఏఎస్ఐ ప్రకాష్ జరోలియాకు చెందిన సైకిల్ను యాస్మిన్ నడిపింది. తన అనుమతి లేకుండా యాస్మిన్ సైకిల్ నడపడంతో కోపోద్రిక్తుడైన జరోలియా ఆ బాలికను కొట్టడంతోపాటు, బాలిక, ఆమె తల్లిదండ్రులపై సైకిల్ దొంగతనం కేసు నమోదు చేసి, జైలుకు పంపిస్తానని బెదిరించాడు. ఈ బెదిరింపులతో భయపడ్డ యాస్మిన్ తన ఇంటిలో ఆత్మాహుతికి యత్నించింది. వంద శాతం కాలిన గాయాలైన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.