breaking news
geneva international motor show
-
జెనీవా ఇంటర్నేషనల్ మోటార్ షో - ప్రత్యేక ఆకర్షణగా 'సిముర్గ్' (ఫోటోలు)
-
ఆఫ్ఘనిస్తాన్ ఫస్ట్ సూపర్‌కార్.. జెనీవా మోటార్ షోలో ఇదే స్పెషల్ అట్రాక్షన్!
Afghanistan Simurgh Super Car: ఈ నెల 5 నుంచి జెనీవాలో ప్రారంభమైన జెనీవా ఇంటర్నేషనల్ మోటార్ షో గురించి అందరికి తెలిసిందే. ఖతార్‌లోని దోహా వేదికగా జరుగుతున్న ఈ షోలో ప్రపంచంలోని చాలా కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నాయి. ఇందులో ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన ఒక సూపర్ కారు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మొదటి చూపులోనే చూపరుల మదిదోచిన ఈ సూపర్ కారు తాలిబన్ నియంత్రణలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌లో నిర్మించిన సూపర్‌కార్ మాడా 9 ఆధారంగా తయారైనట్లు తెలుస్తోంది. కాబూల్‌కు చెందిన తయారీ సంస్థ ఎన్‌టాప్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ టెక్నికల్ వొకేషనల్ ఇన్స్టిట్యూట్ (ATVI)చే నిర్మితమైన ఈ కారుకి 'సిముర్గ్' అని పేరు పెట్టారు. సిముర్గ్ కారు ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన మొట్టమొదటి స్వదేశీ సూపర్‌కార్. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆటోమోటివ్ ఈవెంట్లలో ఒకటైన జెనీవా మోటార్ షోలో ఈ సూపర్‌కార్ ఎంతోమంది ఔత్సాహికులను ఆకర్షించింది. 30 మంది ఆఫ్ఘన్ ఇంజనీర్లు.. బ్లాక్ కలర్ పెయింట్ థీమ్ కలిగిన ఈ కారుని 30 మంది ఆఫ్ఘన్ ఇంజనీర్లు రూపొందించినట్లు తెలుస్తోంది. ఇందులో కరోలా నుంచి తీసుకున్న ఫోర్ సిలిండర్ ఇంజిన్ అమర్చారు. అయితే దీని సాంకేతిక వివరాలను సంస్థ అధికారికంగా వెల్లడించలేదు. బహుశా త్వరలో వెల్లడించే అవకాశం ఉందని భావిస్తున్నారు. డిజైన్ విషయానికి వస్తే.. ఈ సూపర్ కారు ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, షార్ప్ ఫ్రంట్ స్ప్లిటర్, పెద్ద బ్లాక్ అల్లాయ్ వీల్స్, ఫ్లేర్డ్ ఫెండర్లు, ఎయిర్ ఇన్‌టేక్ కోసం ప్రత్యేకంగా తయారైన సైడ్ ప్రొఫైల్, ఎల్ఈడీ టెయిల్లైట్లు, బోల్డ్-లుకింగ్ రియర్ డిఫ్యూజర్ వంటివి పొందుతుంది. ఇదీ చదవండి: ఏఐ చాట్‌బాట్ సలహాతో బ్రిటన్ రాణిని చంపడానికి వెళ్ళాడు.. చివరికి ఏం జరిగిందంటే? మోటార్ షోలో ఎంతోమందిని అలరించిన సిముర్గ్ దాని ఇతర మోడల్స్ కంటే కూడా చాలా భిన్నంగా ఉంటుంది. అయితే ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తున్న కారు కేవలం ప్రోటోటైప్ దశలో ఉంది. దీనిని ఉత్పత్తి చేయడానికి తయారీదారుకు బలమైన ఆర్థిక మద్దతు అవసరం ఉంది, కావున ఈ సూపర్ తయారీ ఎప్పుడనేది తయారీదారు వెల్లడించలేదు. -
జత కట్టబోతున్న ఆటో దిగ్గజాలు
న్యూఢిల్లీ : రెవెన్యూలో దేశంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్, వాల్యుమ్‌లో అతిపెద్ద యూరప్ కార్ మేకర్ ఫోక్స్ వాగన్ రెండూ జతకట్టబోతున్నాయి. ఈ రెండూ భాగస్వామ్యం కుదుర్చుకునే ఒప్పంద చర్చలు తుది దశలో ఉన్నాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈ రెండింటి భాగస్వామ్యం భారత్ , ఇతర వర్దమాన దేశాలపై ఎక్కువగా ప్రభావం చూపనుందని తెలుస్తోంది. అయితే ఈ భాగస్వామ్యం జాయింట్ వెంచర్ లేదా టెక్నాలజీ టై-అప్ గా ఉండొచ్చని ఆటో వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం ఈ పార్టనర్ షిప్‌పై చర్చలు కొనసాగుతున్నాయని, మార్చిలో జరుగబోయే జెనీవా ఇంటర్నేషనల్ మోటార్ షోలో దీన్ని ప్రకటించవచ్చని సమాచారం. వెహికిల్ ఆర్కిటెక్చర్ షేరింగ్, టెక్నాలజీ అనేవి ఈ చర్చలకు ప్రధాన అంశంగా దీనికి సంబంధించిన ఓ వ్యక్తి చెప్పారు. ఇండియా, ఎమర్జింగ్ మార్కెట్లలో మోడ్యులర్ ప్లాట్ ఫామ్‌లను షేర్ చేసుకునేందుకు ఈ కంపెనీలు యోచిస్తున్నాయని తెలుస్తోంది.