generosity
-
నగరం మీది ప్రేమతో... 21 కిలోల బంగారం విరాళం
టోక్యో: స్వాతంత్య్రోద్యమ సమయంలో, 1962లో చైనాతో యుద్ధం సమయంలో మన దేశంలో చాలామంది మహిళలు బంగారు ఆభరణాలను ప్రభుత్వానికి విరాళంగా అందజేశారు. అలాగే ఇప్పుడు జపాన్‌లోనూ ఓ అజ్ఞాత వ్యక్తి తను నివాసముంటున్న ఒసాకా నగరం మీద ప్రేమతో ఏకంగా 21 కిలోల బంగారాన్ని విరాళంగా ఇచ్చేశాడు! వాటి విలువ ఏకంగా రూ.32 కోట్ల పై చిలుకు! నగరంలో పూర్తిగా పాతబడిపోయిన తాగునీటి, డ్రైనేజీ పైపుల వ్యవస్థను వాటి సాయంతో సమూలంగా పునరుద్ధరించాల్సిందిగా ఆయన కోరాడు. ఒసాకా మేయర్ హిదేయుకి యొకోయామా గురువారం ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘ఒసాకాలో 90 శాతానికి పైగా నీటి పైపులు లీకేజీలమయమే. దీనిపై నగర వాటర్‌వర్క్స్ బ్యూరో ఇప్పటికే పలుమార్లు ఆందోళన వెలిబుచ్చింది కూడా. వాటి పునరుద్ధరణకు భారీ నిధులు కావాలి. కానీ నగరానికి అంత బడ్జెట్ లేదు. ఈ సమయంలో అద్భుతం జరిగింది. అజ్ఞాత దాత ఒకరు గత నవంబర్‌లో ఏకంగా 21 కిలోల బంగారు కడ్డీలు విరాళమిచ్చారు. ఆయనకు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే! పైపుల పునరుద్ధరణ సహా ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు వాటిని సది్వనియోగం చేస్తాం’’అని ఆయన ప్రకటించారు. సదరు అజ్ఞాత దాత గతంలో మున్సిపల్ వాటర్ వర్క్స్ కోసం లక్షల రూపాయల నగదు ఇచ్చారని తెలిపారు. సమస్యల నగరం 30 లక్షల జనాభా ఉన్న ఒకాసా జపాన్‌లో మూడో అతి పెద్ద నగరం. దేశ ఆర్థిక రాజధానిగా కూడా చెప్పుకోవచ్చు. ఒకప్పుడు దేశ రాజధానిగానూ కొనసాగింది. అత్యంత పురాతన నగరం కూడా. ఇక్కడి మంచి నీరు, డ్రైనేజీ పైపులు కూడా అంతే పురాతనమైనవి. పైపులు పూర్తిగా తుప్పు పట్టి పనికి రాకుండా పోయాయి. వాటి లీకేజీలు స్థానికుల భద్రతను నిత్యం ప్రమాదంలోకి నెడుతున్నాయి. వీటికి తోడు నగరంలో రోడ్లపై సింక్ హోల్స్ (భారీ గుంతలు) కూడా సర్వసాధారణంగా మారాయి. గతేడాది అలాంటి ఓ భారీ సింక్ హోల్ ఏకంగా ఒక క్యాబ్‌నే మింగేసింది. ఆ దుర్ఘటనలో దాని డ్రైవర్ దుర్మరణం పాలయ్యాడు. కానీ నిధుల లేమి కారణంగా మంచినీటి, డ్రైనేజీ పైపుల మారి్పడి వ్యవహారం ఓ పట్టాన ముందుకు సాగడం లేదు. -
AP: సచివాలయ ఉద్యోగుల ఔదార్యం
మండపేట(కోనసీమ జిల్లా): వయసు తక్కువగా ఉండటంతో పింఛన్ ఆగిపోయిన మహిళ దీనస్థితిని చూసి చలించిపోయి ఏడాదిన్నరగా ప్రతి నెల రూ.2,000 చొప్పున తమ జీతం నుంచి సాయం అందిస్తూ ఔదార్యాన్ని చాటుకున్నారు కోనసీమ జిల్లా మండపేటలోని 3వ వార్డు సచివాలయ ఉద్యోగులు. తాజాగా, ఆమెకు రూ.2,500 పింఛన్ మంజూరు కాగా, గురువారం అందించారు. గతంలో నిర్వహించిన వెరిఫికేషన్‌లో మండపేటకి చెందిన పి.రాజమ్మకు వయసు తక్కువగా ఉండటంతో పింఛన్ ఆగిపోయింది. చదవండి: స్ఫూర్తి సముదాయం.. ఒకేచోట అన్ని భవనాలు పునరుద్ధరించేందుకు సచివాలయ అడ్మిన్ సెక్రటరీ జి.శ్రీసత్యహరిత పలు ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. కాకినాడ డీఆర్డీఏ అధికారుల వద్దకు పంపినా సాంకేతిక కారణాలు అడ్డంకిగా మారాయి. నిరుపేద అయిన రాజమ్మ దీనస్థితిని చూసి చలించిపోయిన హరిత, మహిళా కానిస్టేబుల్ విజయలక్ష్మి, వెల్ఫేర్ సెక్రటరీ గణేష్ ప్రతి నెల తమ జీతం నుంచి రూ.2,000 మొత్తాన్ని ఏడాదిన్నరగా ఆమెకు అందజేస్తూ వచ్చారు. సాంకేతిక లోపాలు సరిజేసేందుకు ప్రభుత్వం వెసులుబాటు ఇవ్వడంతో ఆగస్ట్ నుంచి రాజమ్మకు కొత్త పింఛన్ మంజూరైంది. తనకు ఇంతకాలం సాయం అందించి ఆదుకోవడంతోపాటు పింఛను మంజూరు చేయించిన సచివాలయ ఉద్యోగులకు రాజమ్మ కృతజ్ఞతలు తెలిపింది. -
టాప్ హీరోకు రాజ్ నాథ్ సింగ్ ప్రశంసలు
-
టాప్ హీరోకు రాజ్ నాథ్ సింగ్ ప్రశంసలు
న్యూఢిల్లీ: బాలీవుడ్ అగ్ర కథానాయకుడు అక్షయ్ కుమార్ పై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రశంసలు కురిపించారు. అమర జవాన్ల కుటుంబాలకు సహాయం చేయడానికి ముందు వచ్చిన ‘రుస్తుం’ స్టార్ ను ఎంతో మెచ్చుకున్నారు. ‘అక్షయ్ కుమార్ దాతృత్వం ఎంతో కొనియాడదగింది. ఆయన చేసిన సాయం అమర జవాన్ల కుటుంబాలకు ఆసరాగా నిలుస్తుంది. దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన జవాన్లకు సహాయం అందించడం ద్వారా ఆయన ప్రేరణగా నిలిచారు. అక్షయ్ చూపిన చొరవ దేశంపై ఆయనకున్న అభిమానం, భక్తిని వెల్లడిస్తోంది. ముఖ్యంగా సీఆర్పీఎఫ్ పట్ల ఆయనకు అమిత గౌరవం ఉంద’ని ప్రశంసించారు. ఛత్తీస్‌గఢ్ లోని సుక్మా ప్రాంతంలో మావోయిస్టుల దాడిలో వీరమరణం పొందిన ఒక్కో సీఆర్పీఎఫ్ జవాను కుటుంబానికి రూ.9 లక్షల చొప్పున నగదును (మొత్తంగా కోటీ ఎనిమిది లక్షలు) అక్షయ్ కుమార్ అందజేశారు. మార్చి 11న మావోయిస్టులు జరిపిన మెరుపు దాడిలో 12 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే.


