'గీత' ను అప్పగించేది లేదు
కరాచీ/న్యూఢిల్లీ: 13 ఏళ్ల క్రితం పాక్ భూభాగంలో పొరపాటున అడుగుపెట్టి తప్పిపోయిన గీతను తమకు అప్పగించాలని భారత్కు చెందిన ఓ సామాజిక కార్యకర్త వేసిన పిటిషన్ను సింధ్ హైకోర్టు గురువారం కొట్టివేసింది. 23ఏళ్ల గీతను బలవంతంగా అప్పగించేందుకు ఉత్తర్వులు జారీ చేయలేమని స్పష్టం చేసింది.
హరియాణాకు చెందిన సామాజిక కార్యకర్త మోమినీన్ మాలిక్ గీత సంరక్షణను తాను చూసుకుంటానని హామీ ఇస్తూ స్థానిక లాయర్ల సాయంతో సింధ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే.. గీతను అప్పగించాలంటే కొన్ని పద్ధతులు పాటిం చాల్సి ఉంటుందని న్యాయస్థానం పేర్కొంది. కాగా గీతను భారత్కు రప్పించటానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.