ఎన్టీపీసీతో ఆల్స్టోమ్ భారత్ ఫోర్జ్ భాగస్వామ్యం
న్యూఢిల్లీ: జీఈ-భారత్ ఫోర్జ్ జాయింట్ వెంచర్ ‘ఆల్స్టోమ్ భారత్ ఫోర్జ్ పవర్’తాజాగా ఎన్టీపీసీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ‘ఆల్స్టోమ్ భారత్ ఫోర్జ్ పవర్’.. రెండు యూనిట్ల 800 మెగావాట్ల అల్ట్రా-సూపర్‌క్రిటికల్ స్ట్రీమ్ టర్బైన్ జనరేటర్ ఐలాండ్స్‌ను కరీంనగర్ జిల్లాలోని రామగుండం వద్ద ఉన్న తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఫేస్-1కు సరఫరా చేయనుంది. డీల్ విలువ 219 మిలియన్ డాలర్లు. ఈ సరికొత్త టెక్నాలజీతో కూడిన టర్బైన్స్ ద్వారా పవర్ ప్లాంటులో అధిక విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చని ఆల్స్టోమ్ భారత్ ఫోర్జ్ పవర్ సీఈవోఅలైన్ స్పోర్ తెలిపారు.