breaking news
gaya police
-
వైరల్ వీడియోపై పోలీసుల దర్యాప్తు
పట్నా : మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడటమే కాకుండా.. అందుకు సంబంధించిన వీడియోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు మృగాళ్లు. తాజాగా కొందరు యువకుల ముందే ఓ మహిళపై వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతే కాకుండా ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. గత వారం నుంచి ఈ వీడియో వైరల్‌గా మారింది. అయితే బిహార్ పోలీసులు దీన్ని సీరియస్‌గా తీసుకున్నారు. అందులోని సంభాషణల ఆధారంగా ఆ ఘటన బిహార్‌లోని మగధ ప్రాంతంలో జరిగి ఉంటుందని భావిస్తున్నారు. గయా పోలీస్ స్టేషన్లో ఈ ఘటనపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనిపై గయా ఎస్పీ రాజీవ్ మిశ్రా మాట్లాడుతూ.. ‘నేరం ఎక్కడ జరిగింది, బాధితురాలు ఎవరన్నది తెలియలేదు. కానీ డీఐజీ ఆదేశాలతో ఆదివారం కేసు నమోదు చేశాం. మగధ ప్రాంతంలోని అన్ని జిల్లాలకు ఈ కేసుకు సంబంధించిన వివరాలు అందించడం జరిగింది.. పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతుంది. ఒక వేళ ఈ నేరం వేరే జిల్లాలో జరిగినట్లు తెలిస్తే ఈ ఎఫ్ఐఆర్ను అక్కడి పోలీస్ స్టేషన్‌కు తరలిస్తాం’ అని తెలిపారు. ఇటీవల గయా సమీపంలోని జెహానాబాద్‌లో ఓ బాలికపై వేధింపులకు పాల్పడిన వీడియో కూడా వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన పోలీసులు ఆ ఘటనతో సంబంధం ఉన్న 13 మందిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అదే తరహలో ఈ కేసులో నిందితులను పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. -
ప్రియురాలిపై విరుచుకుపడ్డాడు.. జైలుకెళ్లాడు..!
పాట్నా: బిహార్ లో దారుణం చోటుచేసుకుంది. ఆగ్రహంతో ఉన్న ఓ యువకుడు ప్రేయసిని చితకబాదాడు. ఈ ఘటన బిహార్ లోని గయ జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గయ పట్టణంలో లవర్స్ మధ్య చిన్న గొడవ తలెత్తింది. క్షణికావేశంలో లవర్ ఆ టీనేజీ యువతిపై విచక్షణారహితంగా దాడిచేశాడు. ఇది గమనించిన స్థానికులు ప్రియుడికి దేహశుద్ధి చేశారు. అనంతరం ఆ యువకుడిని గయ పోలీసులకు అప్పగించారు. ప్రియుడి దాడిలో తీవ్రంగా గాయపడిన టీనేజీ యువతిని గయలోని మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడి వైద్యులు మెరుగైన వైద్యం కోసం పాట్నాలోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. బాధిత యువతిని పాట్నాకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆ యువతి పరిస్థితి చాలా విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.