breaking news
gavicherla
-
మృతి చెందింది ఒక్కరే..
సాక్షి, వరంగల్ రూరల్: బావిలో జీపు బోల్తా పడిన ఘటనలో డ్రైవర్ ఒక్కడే మృతి చెందడంతో ఉత్కంఠ వీడింది. వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలం గవిచర్ల వద్ద మంగళవారం సాయంత్రం బావిలో జీపు బోల్తా పడగా, అప్పటి నుంచి బుధవారం ఉదయం వరకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. అధికార యంత్రాంగం, స్థానిక ప్రజాప్రతినిధులు, స్థానికుల సహాయంతో రాత్రంతా ఆపరేషన్ కొనసాగించారు. జీపులో మొత్తం 15 మంది ప్రయాణిస్తున్నారని, 11 మంది బతికి బయట పడ్డారని, డ్రైవర్‌తో పాటు మరో నలుగురు జలసమాధి అయ్యారని ప్రచారం జరిగింది. తొలుత డ్రైవర్ సతీష్ మృతదేహం బయటపడింది. దీంతో మరో ముగ్గురి మృతదేహాలు బావిలో ఉంటాయని భావించారు. ఈ మేరకు తెల్లవారుజాము వరకు నీరంతా తోడారు. మృతదేహాలు లభించకపోవడంతో డ్రైవర్ ఒకరే మృతి చెందాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. డ్రైవర్ సతీష్‌కు ఫిట్స్ రావడమే ఘటనకు కారణమని భావిస్తుండగా, పోస్టుమార్టం నివేదిక అందితే పూర్తి వివరాలు వెల్లడవుతాయని పోలీసులు తెలిపారు. (చదవండి : బావిలో పడిన జీపు నలుగురి జలసమాధి) మంత్రి ఎర్రబెల్లి ఆరా జీపు బోల్తా పడినప్పటి నుంచి తెల్లవారే వరకు జరుగుతున్న సహాయక చర్యలపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు గంటగంటకూ స్థానిక ప్రజా ప్రతినిధులు, పోలీస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇంకా ఏమైనా సహాయక చర్యలు అవసరం ఉన్నాయా అని తెలుసుకున్నారు. పోలీసు యంత్రాంగం సేవలు భేష్ గవిచర్లలో వ్యవసాయబావిలో జీపు పడిన వెంటనే స్పందించిన పోలీసులను డీజీపీ మహేందర్‌రెడ్డి అభినందించారు. రాత్రంతా నిద్రాహారాలు మాని సహాయక చర్యలు చేపట్టడంపై ఆయన పర్వతగిరి సీఐ కిషన్‌తో పాటుగా ఇతర పోలీసు అధికారులు, సిబ్బందిని ఫోన్లో అభినందించారు. -
రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం
గవిచర్ల(సంగెం), న్యూస్‌లైన్ : అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు కడియం శ్రీహరి ఆరోపించారు. ఇటీవల కురిసిన వర్షాలతో మండలంలోని బొల్లికుంట, లోహిత, రామచంద్రాపురం, గవిచర్ల, ఆశాలపల్లి, కాపులకనిపర్తి గ్రామాల్లో దెబ్బతి న్న పంటలను మంగళవారం పరకాల ఎమ్మె ల్యే మొలుగూరి బిక్షపతి ఆధ్వర్యంలో టీఆర్ ఎస్ నాయకులు సందర్శించారు. అనంతరం గవిచర్లలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీహరి మాట్లాడుతూ వర్షాల కారణంగా జిల్లాలో 2.5 లక్షల ఎకరాల్లో పత్తి, లక్ష ఎకరాల్లో వరి, 50 వేల ఎకరాల్లో మొక్కజొన్నతోపాటు కూరగాయలు, పండ్లతోటలకు తీవ్రనష్టం వాటిల్లిందని చెప్పారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను తక్షణమే పరిశీలించి వరికి ఎకరాకు రూ 10 వేలు, పత్తి, మొక్కజొన్న, కూరగాయలకు రూ 25 వేల పరిహారం అందించాలని ఆయన వ్యవసాయాధికారులను డిమాండ్ చేశారు. అలాగే ఇళ్లు కోల్పోయిన వారికి తక్షణ సాయంగా రూ 10 వేలు, ఐఏవై కిం ద గృహాలు మంజూరు చేయాలని కోరారు. జిల్లాకు చెందిన మంత్రులు పొన్నాల లక్ష్మ య్య, బస్వరాజు సారయ్యలు కనీసం దెబ్బ తిన్న పంటలను పరిశీలించి బాధిత రైతులకు భరోసా కూడా ఇవ్వకపోవడం సిగ్గుచేటని ఆయన పేర్కొన్నారు. ఆత్మస్థైర్యం కోల్పోవదు ్ద: బిక్షపతి వర్షాలకు పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని పరకాల ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి సూచించారు. పంటల నష్టంపై పార్టీ తరపున నివేదికలను తయారుచేసి కలెక్టర్, గవర్నర్, సీఎంకు అందజేసి బాధితులకు పరిహారం ఇప్పించేవరకు పోరాటాలు చేస్తామని ఆయన చెప్పారు. వర్షానికి తడిసి రంగుమారిన పత్తిని సీసీఐ, మొక్కజొన్నలను మార్క్‌ఫెడ్ ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా కన్వీనర్ పెద్ది సుదర్శన్‌రెడ్డి, అధ్యక్షుడు తక్కళ్లపెల్లి రవీందర్‌రా వు, జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు మార్నెనీ రవీందర్రావు, నాయకులు శోభన్‌బాబు, పూలుగు సాగర్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, రాజు, తహసీల్దార్ పాలకుర్తి బిక్షం, ఎంపీడీఓ సిరి కొండ వెంకటేశ్వర్రావు, వ్యవసాయాధికారి సుంకన్న పాల్గొన్నారు.