breaking news
Gardening tasks
-
ఆకుపచ్చని ఉద్యమం
మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఎడారిలాంటి చోట కూడ పచ్చని తోటై పలకరిస్తుంది. మహిళల సారథ్యంలోని ‘వనమాలి గార్డెనింగ్ గ్రూప్’ వాట్సాప్ వేదికగా విశాఖపట్టణంలో మిద్దెతోటల ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. వనమాలి గార్డెనింగ్ గ్రూప్‌లో మూడువేలమంది మహిళలు ఉన్నారు. అంతరించిపోతున్న అరుదైన సంప్రదాయ మొక్కలకు జీవం పోస్తున్నారు. గ్రీన్డ్రైవ్స్ నిర్వహిస్తూ రహదారుల పక్కన మొక్కలు నాటుతున్నారు...‘పై కప్పు ఇస్తారా...పచ్చగా మార్చేస్తాం, మాకు ఎటువంటి ఫీజులు కట్టాల్సిన అవసరం లేదు. మీ ఇంటి మిద్దె చూపిస్తే చాలు మీకు కావాల్సిన ఆకు కూరలు, కూరగాయలు పండించే మార్గాల్ని చూపుతాం’ అంటున్నారు వనమాలి గార్డెనింగ్ గ్రూపుల నిర్వాహకులు అరుణ అరవల, సరితా మల్ల, జ్యోతి నాదెళ్ల. విశాఖపట్టణంలోని మురళీ నగర్‌కు చెందిన అరుణ అనే మహిళకు వచ్చిన ఆలోచన మూడువేల మంది మహిళల్లో చైతన్యాన్ని తెచ్చింది. ఆకు పచ్చని ఉద్యమానికి వేదికగా నిలిచింది.అవసరాలు తీరేలా....పర్యావరణానికి మేలు జరిగేలా...వనమాలి గార్డెనింగ్ గ్రూపులో సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్, మన కూరగాయల తోట అనే రెండు గార్డెనింగ్ గ్రూపులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఈ గ్రూపులో నగర వ్యాప్తంగా మూడువేల మందికి పైగా సభ్యులు ఉన్నారు. వంట గది వ్యర్థాల నుంచి మొక్కలకు అవసరమైన కంపోస్టు ఎరువును తయారు చేసుకుంటున్నారు. దీనిపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.అంతరిస్తున్న ఆకుకూరలకు జీవంఅంతరిస్తున్న సాంప్రదాయ ఆకు కూరలు, కాయగూరల పునరుద్ధరణకు ‘వనమాలి గార్డెనింగ్’ వ్యవస్థాపకురాలు ఎ.అరుణ కృషి చేస్తున్నారు. కొండపిండి ఆకు, నల్లేరు, గలిజేరు, పొన్నగంటి కూర వంటి ఆకు కూరలతోపాటు, చెమ్మ చిక్కుడు, ముళ్ల వంకాయలు, ఇతర రాష్ట్రాలకు చెందిన క్లోవ్ బీన్స్, ఫ్యాషన్ ఫ్రూట్, వింగ్డ్ బీన్స్, ఎయిర్ పొటాటో, గుడ్డు వంగ (ఎగ్ బ్రింజాల్), ఎరుపు బర్బాటీ, ఎరుపు తోటకూర, ఎరుపు చిక్కుడు, ఎరుపు బెండ, రెడ్ ముల్లంగి, ఎరుపు బచ్చలి కూరలు, సీమ చింత... మొదలైన వాటిని తన ఇంటి మిద్దెపై పండిస్తున్నారు అరుణ. వీటితో పాటు వైజయంతి మాల, వాటర్ యాపిల్, నోనీ ఫ్రూట్, బిలంబి ఉసిరి, పొట్టి పొట్ల కాయలు, పాన్ మత్తా, మింట్ తులసి, పాండవబత్తి, దాల్చిన చెక్క, అంజీర్, మల్బరీ ఫ్రూట్స్ వంటి అరుదైన మొక్కలు ఉన్నాయి. వీటిని సంబంధించిన విత్తనాలు, నార్లు పంపిణీ చేస్తున్నారు.వనమాలి సమావేశాలువనమాలి పరిధిలో పదిహేను ఏరియా గ్రూపులు ఉన్నాయి. ప్రతి గ్రూపులో వంద నుంచి రెండు వందల మంది సభ్యులు ఉన్నారు. ప్రతి ఏరియాకి ఇద్దరు ఇంచార్జ్‌లు ఉంటారు. వీరు ప్రతి నెలా సమావేశాలు ఏర్పాటు చేసి ఆ ప్రాంత సభ్యులకు అవసరమైన సలహాలు అందిస్తారు. విత్తనాలు, కొమ్మలు, మొక్కలు, నారు ఇచ్చి పుచ్చుకుంటారు. సీనియర్ గార్డెనర్స్ సూచనలు తీసుకుంటారు, కొత్త ఐడియాలు నేర్చుకుంటారు. నెలకోసారి గ్రీన్ డ్రైవ్స్ నిర్వహించి రహదారుల పక్కన పార్క్‌లో మొక్కలు నాటుతున్నారు.కమ్యూనిటీ గార్డెనింగ్‘బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్’్ట కాన్సెప్ట్‌లో భాగంగా పనికిరాని వస్తువుల్లో నుంచి మొక్కల పెంపకానికి ఉపయోగపడేవాటిని ఎంచుకుంటారు వనమాలి గ్రూప్ సభ్యులు. పాత వాటర్ బాటిల్స్, కూల్‌డ్రింక్ బాటిల్స్, బకెట్లు, టబ్స్‌లో మొక్కలు పెంచుతారు. కమ్యూనిటీ గార్డెనింగ్‌ను ప్రోత్సహించడానికి అపార్ట్మెంట్ నివాసితుల కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది వనమాలి గార్డెనింగ్ గ్రూప్. ఈ కార్యక్రమాలలో భాగంగా కూరగాయల మొక్కలు, విత్తనాలు పంచుతారు.తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు పెంచేలా...ఇరవై ఏళ్ల క్రితం మిద్దె తోట ఆలోచన వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా మేడ మీద 500 కుండీల్లో మొక్కలు పెంచుతున్నాను. తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు పెంచే టెక్నిక్‌ను తెలుసుకుని అమలు చేస్తున్నాను. మేడ పాడవకుండానే తోటను సృష్టించవచ్చు. మా గార్డెనింగ్ గ్రూప్ ద్వారా కొత్త రకాల మొక్కలు, విత్తనాలు పరిచయమయ్యాయి. కేరళ, తమిళనాడు, వాయువ్య రాష్ట్రాల నుంచి వచ్చే అరుదైన కూరగాయలు కూడా మా మేడపై పండిస్తున్నాను. గ్రీన్ క్లైమేట్ ఎం.రత్నం సహకారం అందిస్తున్నారు.– అరుణ అరవల– వి.ఆర్. కశిరెడ్డి, సాక్షి, మురళీనగర్, విశాఖపట్నం -
పంద్రాగస్టు... అదిరేట్టు
గోల్కొండ: పంద్రాగస్టు వేడుకలకు గోల్కొండ కోట ముస్తాబవుతోంది. కోట ప్రధాన గేటు, ప్రహరీతోపాటు లోపల గల వివిధ చారిత్రక భవనాలను వాటి పరిసరాలను అధికారులు అత్యంత సుందరంగా తీర్చిదిద్దే పనుల్లో తలమునకలయ్యారు. ఆషుర్‌ఖానా నుంచి కోట ప్రధాన గేటు వరకు ఉన్న కోట ప్రహరీకి మరమ్మతులు చేయడంతోపాటు ప్రధాన రహదారిపై వాహనాల కోసం తెలుపు రంగు చారలు వేశారు. కోట ప్రధాన గేటుకు ఇరువైపులా పుట్‌పాత్‌లకు కొత్త టైల్స్ వేస్తున్నారు. ఫెన్సింగ్‌కు కూడా రంగులద్ది సుందరంగా తీర్చిదిద్దారు. సీఎం కేసీఆర్ గౌరవ వందనం స్వీకరించే ప్రదేశంలో గార్డెనింగ్ పనులు జోరుగా సాగుతున్నాయి. విద్యుత్ దీపాలతో రాత్రి వేళ కోట ధగధగ మెరిసిపోతుంది. కోటను సందర్శించిన సీఎస్, డీజీపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్‌శర్మ మంగళవారం ఉదయం కోటను సందర్శించారు. సీఎం, ఇతర ముఖ్యుల వాహనాల రూట్ మ్యాప్‌ను వారు పరిశీలించారు. ముఖ్యమంత్రి కాన్వాయ్‌లోని అన్ని వాహనాలను కోటలోకి రాకుండా కేవలం గవర్నర్, లోకాయుక్త, స్పీకర్ వాహనాలనే వేదిక వరకు అనుమతించాలని, వేదిక కుడి భాగంలోని రాణిమహల్ వెనుక పార్కింగ్ చేయించాలని సీఎస్ రాజీవ్‌శర్మ అధికారులను ఆదేశించారు. కేసీఆర్ గౌరవ వందనం స్వీకరించి పతాకావిష్కరణకు కోటలోకి వెళ్లే సమయం అత్యంత కీలకమైనదని.. ఈ సమయంలో కోట పైనుంచి ఒక్క వాహనం కూడా కిందికి రాకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. రాణిమహల్ ఎదురుగా దిగువ ప్రదేశం వేదికకు చాలా తక్కువ ఎత్తులో ఉందని సీఎస్ రాజీవ్‌మిశ్రా డీజీపీ దృష్టికి తెచ్చారు. అప్పటికప్పుడే ఆ ప్రదేశంలో కుర్చీలు వేసి అక్కడ కొంతమందిని కూర్చోబెట్టి వారికి వేదిక ఏ మేరకు కన్పిస్తుందనే విషయాన్ని ఆరా తీశారు. సీఎం ప్రసంగాన్ని ప్రతి ఒక్కరూ వీక్షించేలా ఏరా్పాట్లు చేయాలని సీఎస్ సూచించారు. వారి వెంట సీఎం సలహాదారులు అజయ్‌మిశ్రా, డిప్యూటీ ప్రొటోకాల్ ఆఫీసర్ అరవిందర్‌సింగ్, కొత్వాల్ పి.మహేందర్‌రెడ్డి తదితరులున్నారు. సమీక్షించిన ఇంటలిజెన్స్ ఐజీ.. తెలంగాణ రాష్ట్ర ఇంటలిజెన్స్ ఐజీ శివధర్‌రెడ్డి గోల్కొండ కోటలో జరుగుతున్న ఏర్పాట్లను డీఐజీ మహేష్ భగవత్‌తో కలిసి పరిశీలించారు. జెండా ఆవిష్కరించే ప్రాంతాన్ని, పరిసరాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కోట ప్రధాన గేటు నుంచి సభావేదిక వరకు రూట్‌ను పరిశీలించారు. పరిసరాల్లోని కట్టడాలపై ఆరా తీశారు. సభావేదికకు ఉన్న ఇతర మార్గాలు, ఆ ప్రాంతంలో తీసుకోవాల్సిన భధ్రత చర్యలను సమీక్షించారు. సీఎం గౌరవ వందనం స్వీకరించే ప్రదేశం రోడ్డుకు ఆనుకొని ఉందని, ముఖ్యమంత్రి తిరిగి వెళ్లే వరకు ఈ ప్రాంతంలో ఎవరిని అనుమతించాలి అనే విషయంపై కూడా ఆయన అధికారులతో చ ర్చించారు. సభావేదికకు మూడువైపులా ఎత్తయిన కట్టడాలపైకి వెళ్లి పరిశీలించారు. వారి వెంట పశ్చిమ మండలం డీసీపీ వి.సత్యనారాయణ తదితరులు ఉన్నారు. మూడంచెల భద్రత.. ఐదువేల మంది పోలీసులతో మూడంచెల బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామని నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి తెలిపారు. గోల్కొండ కోటలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పాసులున్నవారు పతాకావిష్కరణకు కనీసం గంట ముందు తమకు కేటాయించిన సీట్లలో కూర్చోవాలన్నారు. ప్రతి పాస్ వెనుక రూట్ మ్యాప్‌తోపాటు పార్కింగ్ స్థలాన్ని కేటాయించినట్టు చెప్పారు.


