breaking news
Ganga water jathara
-
కావడి యాత్రపై ఎందుకీ రభస?
ప్రతి ఏటా శ్రావణ మాసంలో హిందువులు పవిత్రంగా భావించే గంగా జలాన్ని హరిద్వార్ నుండి కావడిలో కాలినడకన తెచ్చి తమ గ్రామాలలోని శివాలయాల్లో అభిషేకం చేయడం పరిపాటి. ఇందుకోసం భక్తులు ఢిల్లీ హరిద్వార్ జాతీయ రాదారిపై లక్షల సంఖ్యలో కాలి నడకన ప్రయా ణిస్తారు. శతాబ్దాలుగా ఈ కావడి (కావడ్) యాత్ర జరుగుతోంది. పంజాబ్, రాజస్థాన్, హరియాణా, ఢిల్లీ, యూపీ, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఒడిషా రాష్ట్రాల వారు ఈ యాత్రలో పాల్గొంటూ ఉంటారు. హరిద్వార్ నుండే కాకుండా గంగోత్రి, బిహార్‌లోని హజారీబాగ్ దగ్గర్లోని గంగానది నుండి కూడా కావడి పాత్రల్లో జలాన్ని సేకరించి తీసుకువెళుతూ ఉంటారు.ఈ యాత్ర సందర్భంగా భక్తులు ప్రయాణించే ఢిల్లీ–హరిద్వార్ జాతీయ రహదారి పొడవునా ఉన్న దాబాలు, హోటళ్లు; పండ్లు, కూరగాయల బండ్ల పైనా, రేషన్ షాపుల పైనా యజమానులు, పనిచేసే వర్కర్ల పేర్లు రాసి ప్రదర్శించాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఒక ఉత్తర్వు జారీ చేశారు. దీన్ని చూసి మరో బీజేపీ పాలిత రాష్ట్రం ఉత్తరాఖండ్ ముఖ్య మంత్రీ ఇదే తరహా ఉత్తర్వు ఇచ్చారు. ఈ ఉత్తర్వుల జారీలో ఒక వర్గాన్ని దెబ్బతీయడం మరో వర్గానికి మేలు చేయడం ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందడమే లక్ష్యమని అర్థమవుతోంది.ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో యూపీ, ఉత్తరాఖండ్ బీజేపీ ప్రభుత్వాలకు ఎదురుగాలి వీచింది. ఈ యాత్రా మార్గంలో ఉన్న సహారన్ పుర్‡ డివిజన్లో బీజేపీ ప్రభ తుడిచిపెట్టుకు పోయింది. అంతేకాకుండా శామలి, ముజఫర్‌నగర్ నియోజకవర్గాల్లో ‘ఇండియా’ బ్లాక్ విజయం సాధించింది. మీరట్‌లో బీజేపీ మెజారిటీ బాగా తగ్గింది. కాంగ్రెస్ గెలుచుకున్న ముజఫర్‌నగర్ సీట్ హరిద్వార్ దగ్గరలో ఉండటం, ఇటీవల ఉత్తరా ఖండ్‌లో జరిగిన ఉపఎన్నికల్లో హరిద్వార్‌ను ఆనుకొని ఉన్న మంగ్లర్, బద్రీనాథ్ అసెంబ్లీ సీట్లలో కాంగ్రెస్ గెలవటం; త్వరలో యూపీలో 10 సీట్లలో ఉప ఎన్నికలు జరగనుండడంతో... మెజారిటీ వర్గ ఓట్లను దక్కించుకోవడానికి బీజేపీ వేసిన ఎత్తుగడగా రాజకీయ పరిశీలకులు ఈ ఉత్తర్వుల జారీని భావి స్తున్నారు.మూడేళ్ల క్రితం బీజేపీకి చెందినవారు ముజఫర్ నగర్ ఏరియాలో ఉన్న ముస్లిం హోటళ్ల యజమానుల పేర్లు హోటళ్లపై రాయాలని ఆందోళన చేశారు. ఆ హోటళ్లలో శాకాహారులు భోజనం చేస్తే కరప్టు అవుతారనేది వారి వాదం. 2023లో పోలీసులు ముస్లిం దాబాలను అనధికారికంగా మూసి వేయించారు. అయితే యూపీ, ఉత్తరాఖండ్ ప్రభుత్వాల ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. దాబాలు, హోటల్స్ కేవలం శాకాహారమా, మాంసాహారమా అని తెలుపుతూ బోర్డులు పెడితే చాలని ఉత్తర్వులిచ్చింది. – డా. కె. సుధాకర్ రెడ్డి, విశ్రాంత లెక్చరర్, 89850 37713 -
ముగిసిన గంగ నీళ్ల జాతర
- అశేష భక్తజనం మధ్య అడెల్లి పోచమ్మ నగల శోభాయాత్ర - అడుగడుగునా మంగళహారతులు పట్టిన మహిళలు - సాయంత్రం ఆలయానికి చేరిన ఆభరణాలు - ప్రత్యేక పూజల మధ్య అలంకరణ సారంగాపూర్/దిలావర్పూర్ : భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న సారంగాపూర్ మండలం అడెల్లి మహాపోచమ్మ గంగనీళ్ల జాతర ఆదివారం వైభవంగా ముగిసింది. అశేష భక్తజనం.. అడుగడుగునా మహిళల మంగళహారతులు.. భక్తుల నృత్యాలు, ఆటపాటల మధ్య అమ్మవారి ఆభరణాల శోభాయాత్ర శోభాయమానంగా సాగింది. భక్తుల ఊరేగింపు మధ్య ఆభరణాలు శనివారం ఉదయం సారంగాపూర్ మండలం అడెల్లి దేవస్థానం నుంచి వివిధ గ్రామాల మీదుగా రాత్రి దిలావర్పూర్ మండలం సాంగ్వి పోచమ్మ ఆలయానికి చేరిన విషయం తెలిసిందే. ఆదివారం వేకువజామున గోదావరి నదీ తీరంలో స్థానిక సర్పంచు ఎం.విఠల్, ఉపసర్పంచ్ ఆనంద్‌రెడ్డి, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, నాయకుల ఆధ్వర్యంలో అర్చకులు శాస్త్రోక్తంగా అమ్మవారి నగలను శుద్ధి చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పవిత్ర గోదావరి జలాలను ముంతల్లో తీసుకుని అమ్మవారి ఆభరణాల వెంట తరలారు. ఉదయం ఏడు గంటలకు ఆభరణాల శోభాయాత్ర అడెల్లికి తిరుగు పయనమైంది. సాంగ్వి, కదిలి, మాటేగాం, దిలావర్పూర్, కంజర్ గ్రామాల మీదుగా సారంగాపూర్ మండలం ప్యారమూర్, వంజర్, యాకర్‌పల్లి, సారంగాపూర్ గ్రామాల మీదుగా అడెల్లి ఆలయానికి ఆభరణాలను చేర్చారు. ఆయా గ్రామాల్లో స్థానిక నాయకులు అమ్మవారి ఆభరణాల శోభాయాత్రకు భాజభజంత్రీలతో ఘన స్వాగతం పలికారు. దిలావర్పూర్లో భారీ పూలతోరణంతో స్వాగతం పలుకగా.. గ్రామానికి చెందిన పోతరాజులు అమ్మవారికి పూజలు నిర్వహించి జాతర ప్రారంభించారు. శివసత్తులు పూనకాలతో పాటలు పాడుతూ నృత్యం చేస్తూ ముందుకు సాగారు. దారి పొడవునా మహిళలు మంగళహారతులతో స్వాగతం పలుకుతూ.. ఆభరణాలపై పసుపు నీళ్లు చల్లుతూ టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఊరేగింపుగా ఆభరణాలు అడెల్లి ఆలయానికి చేరుకోగా ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీనివాసశర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి నగలు అలంకరించారు. అనంతరం కుంకుమార్చన, పవిత్ర గంగానది జలాలతో ఆలయ శుద్ధి, అమ్మవారి విగ్రహానికి పాలభిషేకం, పవిత్రోత్సవం, తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కిక్కిరిసిన ఆలయ పరిసరాలు గంగనీళ్ల జాతర నేపథ్యంలో శనివారం రాత్రి నుంచి భక్తులు ఆలయానికి తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. జిల్లా నలుమూలల నుంచే కాకుండా పొరుగు జిల్లాలైన నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, మహారాష్ట్రలోని యావత్మాల్, నాందేడ్, చంద్రపూర్ జిల్లాలతోపాటు మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఆలయ ఆవరణలోని కోనేరులో పవిత్ర స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. మొక్కులు తీర్చుకున్నారు. భారీ బందోబస్తు అమ్మవారి ఆభరణాలు తరలిస్తున్న దారి వెంట నిర్మల్ రూరల్ సీఐ రగు, ఎస్సైలు మల్లేశ్, అనిల్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వంద మంది వాలంటీర్లుగా పనిచేశారు. అమ్మవారిని ఆదివారం నిర్మల్ ఎమ్మెల్యే ఇంద్రకరణ్‌రెడ్డి, డీసీఎంఎస్ అధ్యక్షుడు అయిర నారాయణరెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.