breaking news
	
		
	
  Gadapa Gadapaku
- 
  
    
                
      ఏపీ సీఎం చంద్రబాబుకు షాక్ ఇచ్చిన విద్యార్థి మాటలు
 - 
  
    
                
      Gadapa Gadapaku Meeting: పార్టీ సమావేశానికి 56 మంది పరిశీలకులు డుమ్మా
 - 
      
                   
                               
                   
            175కి 175 సీట్లు కచ్చితంగా గెలవాలి: సీఎం జగన్
సాక్షి, గుంటూరు: గడప గడపకు మన ప్రభుత్వంపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, కో-ఆర్డినేటర్లకు సీఎం దిశానిర్దేశం చేశారు. క్షేత్ర స్థాయిలో సమస్యలు పరిష్కరించాలని సీఎం ఆదేశించారు. జగనన్న సురక్ష తర్వాత మరో కార్యక్రమం ఉంటుందన్నారు. ‘‘గడప గడపకు కార్యక్రమం అత్యంత కీలకం. ఈ కార్యక్రమాన్ని సీరియస్గా తీసుకోవాలి. చాలా ఉపయోగపడే కార్యక్రమం. వచ్చే 9 నెలలు అత్యంత కీలకం. 175కి 175 సీట్లు కచ్చితంగా గెలవాలి. పనితీరు బాగుంటే ఎమ్మెల్యేలను కొనసాగిస్తాం. కొన్ని కోట్ల మంది మనపై ఆధారపడి ఉన్నారు. కోట్ల మంది పేదలకు మంచి జరుగుతోంది’’ అని సీఎం అన్నారు. ‘‘కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేకపోతే కొనసాగించడం వల్ల వారికీ నష్టం, పార్టీకి నష్టం. సర్వే చేసినప్పుడు మీమీ గ్రాఫ్లు బలంగా ఉండాలి. దీని కోసం గడపగడపకు కార్యక్రమం ఉపయోగపడుతుంది. ప్రజలకు చేరువగా ఉండేందుకు చాలా ఉపయోగపడుతుంది. దీనివల్ల మీ గ్రాఫ్ పెరుగుతుంది. పార్టీకి మేలు జరుగుతుంది. అలా జరగకపోతే మార్చక తప్పని పరిస్థితి వస్తుంది’’ అని సీఎం జగన్ స్పష్టం చేశారు. ‘‘ఇకపై గడపగడపకు కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలి. పనితీరు బాగులేక టికెట్లు రాకుంటే నన్ను బాధ్యుడిని చేయొద్దు. గతంలో ఎన్నడూ జరగని విధంగా నాలుగేళ్లలో రాష్ట్రంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చాం. నెగిటివ్ మీడియా ద్వారా మారీచుల్లా మనపై యుద్ధం చేస్తున్నారు. గత ప్రభుత్వ పాలన, మన ప్రభుత్వంలో జరిగిన కార్యక్రమాలను నాడు-నేడు ద్వారా ప్రజల వద్దకు చేర్చాలి. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 నెగిటివ్ స్టోరీలపై ఫ్యాక్ట్ చెక్ ఇస్తున్నాం. ఇందులో అంశాలపై అవగాహన పెంచుకోవాలి’’ అని సీఎం పేర్కొన్నారు. ‘‘సోషల్ మీడియా కూడా చాలా ముఖ్యం. ప్రభుత్వం చేస్తున్న మంచిని సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలి. సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించుకోవాలి. అబద్ధాలు, విష ప్రచారాలను పూర్తిస్థాయిలో తిప్పికొట్టాలి’’ అని సీఎం జగన్ పిలుపునిచ్చారు. ఇదీ చదవండి: జగనన్న సురక్ష.. జులై1 నుంచి సచివాలయాల వద్ద ప్రత్యేక క్యాంపులు - 
      
                   
                               
                   
            ఊరూరా అదే జోరు.. ‘గడప గడపకు’ అపూర్వ ఆదరణ
సాక్షి, నెట్వర్క్: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఉత్సాహంగా సాగుతోంది. గ్రామాల్లో పర్యటిస్తున్న ప్రజాప్రతినిధులకు ప్రతి ఇంటి వద్ద ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోంది. అన్ని జిల్లాల్లో శుక్రవారం ఈ కార్యక్రమం వేడుకగా సాగింది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. ఏమైనా సమస్యలు తమ దృష్టికి వస్తే అక్కడికక్కడే పరిష్కరించారు. తమ సంక్షేమం కోసం పాటుపడుతున్న సీఎం వైఎస్ జగన్కు తమ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని ప్రజాప్రతినిధులను ప్రజలు దీవిస్తున్నారు. మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని హామీలను నెరువేరుస్తున్నామని ప్రజాప్రతినిధులు ప్రజలకు వివరించారు. ఇదీ చదవండి: పూర్తి సహకారం అందిస్తాం.. కేంద్రమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు: సీఎం జగన్ - 
      
                   
                               
                   
            ‘సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి’
సాక్షి, తాడేపల్లి: రేపటి నుంచి ప్రారంభం కానున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఓ పండుగలా నిర్వహించాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలకు చేరువ చేసేందుకు అవకాశంగా తీసుకోవాలని సూచించారు. సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి లోటుపాట్లు ఉంటే దిద్దుబాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. మ్యానిఫెస్టోలో 95 శాతం హామీలు అమలు ప్రజలకు తెలియాలని ఈ సందర్భంగా సజ్జల తెలిపారు. కాగా, మూడేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం గడప గడపకి మన ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు గడప గడపకి వెళ్లాలని ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామ, వార్డు సచివాలయాలు సందర్భించాలని ఆదేశించింది. ప్రభుత్వం పథకాలు, అభివృద్ధి పనులపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించింది. ప్రజలనుండి సలహాలు, సూచనలు స్వీకరించాలని ఎమ్మెల్యేలను ఆదేశించింది. నియోజకవర్గంలో అన్ని ఇళ్లులు వెళ్లేంత వరకూ కార్యక్రమం నిర్వహించాలని తెలిపింది. - 
  
    
                
      విశాఖ జిల్లాలో గడప గడపకు YSRCP
 - 
  
    
                
      ప.గో. జిల్లాలో గడప గడపకు YSRCP
 - 
  
    
                
      ప.గో.జిల్లాలో గడప గడపకూ YSR కార్యక్రమం
 - 
  
    
                
      అనంతలో గడపగడపకు వైఎస్సార్సీపీ
 - 
  
    
                
      బాబుకు ప్రజలు తగిన బుద్ధి చేప్తారు
 - 
      
                    
జూలై 8 నుంచి గడప గడపకూ వైఎస్సార్ సీపీ

 శ్రీకాకుళం అర్బన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని ఆ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గడప గడపకూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని నిర్వహించనున్నామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి తెలిపారు. శ్రీకాకుళంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. విజయవాడలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై మా ట్లాడామని తెలిపారు.
 
 ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని, ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారని అన్నారు. వారి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా వైఎస్సార్సీపీ ఉద్యమాలు, పోరాటాలు చేస్తోందన్నారు. ఇందులో భాగంగానే జూలై 8వ తేదీ నుంచి గడప గడపకూ వైఎస్సార్సీపీ పేరుతో పార్టీ ఆధ్వర్యంలో కరపత్రాలు పంపిణీ చేయనున్నామని తెలి పారు. టీడీపీ ప్రభుత్వ పాలనలో జరుగుతున్న అన్యాయాలు ప్రజలకు వివరిస్తామన్నారు.
 
 ముద్రగడ కుటుంబంపై ప్రభుత్వం, పోలీసులు దారుణంగా వ్యవహరించడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వం చేస్తున్న ఈ దమననీతిని సాక్షి కళ్లకు కట్టినట్లు చూపిస్తుందనే భయంతో సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేశారని విమర్శించారు. మీడియా స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికీ లేదన్నారు. సీఎంగా ఉన్న చంద్రబాబు ఇలాంటి నీచరాజకీయాలకు పాల్పడడం శోచనీయమని, బాబుకు రాజకీయ సమాధి తప్పదని చెప్పారు. జిల్లా అధ్యక్షురాలిగా పనిచేస్తున్న తనకు పాతపట్నం ఇన్చార్జిగా అదనపు బాధ్యతలు అప్పగించారని, ఇందుకు జగన్మోహనరెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. పాతపట్నంలో పార్టీ బలోపేతానికి తన వంతుగా పూర్తిగా కృషిచేస్తానన్నారు. - 
  
    
                
      జోరుగా వైఎస్సార్సీపీ గడప గడపకు కార్యక్రమం
 


