breaking news
GADAPA GADAPAKI YSR
-
చేనేతన్నకు వడ్డీ భారం
పింఛన్ల కోసం ఎక్కేమెట్టు దిగేమెట్టు గడప గడపలో సమస్యల తిష్ట పక్కా గృహాలు ఊరింపేనా.. టవరు లైను కింద ఉన్న వారికి పక్కాగృహాలుఇస్తామని ఊరిస్తున్నారే తప్ప ఇప్పటివరకు ఇవ్వలేదని రాజమహేంద్రవరం రూరల్ హుకుంపేట డీబ్లాకు గౌతమీనగర్ వాసులు వాపోయారు. జీవనం కష్టంగా మారిందని, కుమార్తె పనిచేసి పోషిస్తుందని కన్నీటి పర్యంతమయింది. గోదావరి చెంతనే తాగేందుకు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నామని సరోజినిదేవి కాతేరులో ఆవేదన వ్యక్తం చేసింది. కాతేరు సుబ్బారావునగర్‌లో సరైనరోడ్డు లేక వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వెలిబుచ్చాడు. సాక్షిప్రతినిధి, కాకినాడ : రూ.110 కోట్లు రుణమాఫీ చేశామని ప్రభుత్వం చెబుతూ వచ్చింది. రెండేళ్ల తర్వాత అమలు చేయటంతో రూ.35 కోట్లు వడ్డీ భారం భరించాల్సి వచ్చిందని చేనేత కార్మికులు అమలాపురం శివారు రంగాపురంలో మంగళవారం గడపగడపకు వైఎస్ఆర్లో భాగంగా వెళ్లిన నేతలముందు ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత సంఘం నాయకుడు కరెళ్ల రమేష్‌బాబు, అక్కిశెట్టి మల్లిబాబులు చేనేతలకు జరుగుతున్న నష్టాలను వివరించారు. సరైన రహదారులు, డ్రెయినేజీ సదుపాయం లేక ముంపు సమస్యతో ఇబ్బంది పడుతున్నామని పలువురు అయినవిల్లి మండలం తొత్తరమూడిలో ఆందోళన వ్యక్తం చేశారు. సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నామని శీలం వెంకటేశ్వర్లు, సునీత రామచంద్రపురం నియోజకవర్గం కె.గంగవరం మండలం బ్రహ్మపురిలో వాపోయారు. రోడ్లు నిర్మాణాలు జరగక మురుగులో బతుకుతున్నామని అర్జమ్మ అనే మహిళ మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం మం డలం నల్లూరు కొత్తకాలనీలో మొరపెట్టుకుంది. అన్నీ సమస్యలే... నోటీసు ఇవ్వకుండా రహదారి విస్తరణలో తొలగించినా నష్టపరిహారం ఇవ్వలేదని నున్న నాగమణి కాకినాడ జగన్నాథపురం 16, 23, 25 డివిజన్లలో జరిపిన గడప, గడపకు వైఎస్ఆర్లో ఆవేదన వ్యక్తం చేశారు. స్మార్ట్‌సిటీలో తోపుడు బళ్ళ స్థానంలో లక్షన్నర విలువైన అత్యాధునిక ఆటోలు వినియోగించాలని అధికారుల ఆదేశాలు చిరువ్యాపారులకు ఇబ్బందికరంగా మారాయని వ్యాపారి పేపకాయల సత్తిబాబు ఆవేదన వ్యక్తం చేశారు. దివ్యాంగురాలినైన తనకు పింఛను పొందేందుకు అర్హత ఉంది. పింఛన్ మంజూరైంది. నాలుగు నెలలు ఇచ్చారు. టీడీపీ వచ్చాక అర్హతలేదని తొలగించారని విశ్వనా«ద్ మొరబెట్టుకున్నారు. డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా ఉండటంతోనే దోమలు పెరిగిపోతున్నాయని స్థానికులు సామర్లకోట మండలం పీబీ దేవంలో మొరబెట్టుకుంటున్నారు. ఎన్ని చేసినా దోమలు పెరిగి పొతున్నాయని గాలి ఉమా, ఓదూరి లక్ష్మీ ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీ ఏదీ... పలువురు మహిళలు రుణమాఫీ పేరుతో చంద్రబాబు మోసం చేసాడని గొల్లప్రోలు గాంధీనగర్ 9, 10వ వార్డులో ఆరోపించారు. భర్త చనిపోయి ఏళ్లుగడిచినా ఫించ ను మంజూరుచేయలేదని బండారు నూకరత్నం, రేషన్‌సరుకులు ఇవ్వడం లేదని దివ్యాంగురాలైన ఇమ్మంది లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. కొద్దిపాటిæ వర్షానికే రహదారులు బురదమయమయ్యాని చవాకుల లక్ష్మి మొరబెట్టుకుంది. ఇంటి స్థలం ఇ వ్వాలని అధికారపార్టీ అధికారులు వద్దకు తిరుగుతున్నా పట్టించుకోవడం లేదని నక్కా నాగమణి పి గన్నవరం నియోజకవర్గం తొత్తరమూడి గడ పగడపకు వైఎస్ఆర్లో ఆవేదన వ్యక్తం చేశారు. -
పథకాల పంపిణీలో వివక్ష
జన్మభూమి కమిటీలదే హవా గడప గడపకూ వైఎస్సార్‌లో ప్రజల గోడు ‘పింఛన్లు, ఇతర ప్రభుత్వ పథకాలు ఇవ్వడంలో అధికార పార్టీ నేతలు వివక్ష చూపుతున్నారు. జన్మభూమి కమిటీలదే తుది నిర్ణయంగా మారుతోంది. రెండేళ్లయినా పింఛను ఇవ్వలేదు. రోడ్లు, డ్రెయిన్లు అధ్వానంగా ఉన్నాయి. ఇంటి రుణం ఇస్తామంటే, ఇల్లు కూల్చి, పునాదులు వేసుకున్నాం. రుణం మంజూరు కాక, అసంపూర్తిగా ఉన్నాయి.’ ఇదీ అనేక గ్రామాల్లో ప్రజల ఆవేదన. మంగళవారం జిల్లాలోని పది నియోజకవర్గాల్లో నిర్వహించిన గడప గడపకూ వైఎస్సార్‌లో వైఎస్సార్ సీపీ నేతల వద్ద ప్రజలు తమ గోడు వెళ్లగక్కారు. – సాక్షి ప్రతినిధి, కాకినాడ రామచంద్రపురం నియోజకవర్గం కె.గంగవరం మండలం బాలాంత్రంలో డ్రెయినేజీ వ్యవస్థ లేదని, దీంతో రోడ్లపైనే మురుగునీరు ఉండిపోతోందని మహిళలు మేడిశెట్ది దుర్గాదేవి, పిల్లి వరలక్ష్మి, పిల్లి వెంకటలక్ష్మి తదితరులు వైఎస్సార్ సీపీ నేతల దృష్టికి తీసుకువచ్చారు. శివారు గ్రామాలైన గోపాలరావుపేటలో తాగునీరు, పారిశుద్ధ్యం వంటి మౌలిక సదుపాయాల్లేక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, ప్రభుత్వ పథకాలు అధికార పార్టీ నేతల ఇష్టానుసారం ఇస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అమలాపురం నియోజకవర్గం అల్లవరం మండలం గోడితిప్పలో అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి.. అర్హులైన తమకు పింఛన్లు ఇవ్వడంలో వివక్ష చూపుతున్నారని వృద్ధులు ఆవేదన వ్యక్తం చేశారు. మత్స్యకార కాలనీలో రోడ్లు, డ్రెయిన్లు లేక ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. డ్వాక్రా మహిళలందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు, ఇప్పుడు పొదుపు ఖాతాల నుంచి జమ చేసుకోవడం ఏమిటని రాజమహేం ద్రవరం రూరల్ నియోజకవర్గం హుక్కుంపేటలో బూరా రాజమణి పేర్కొంది. బొమ్మూరులో మురళీకొండపై సరైన రోడ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చిక్కాల వెంకటేశ్వరరావు చెప్పారు. రాజమహేంద్రవరం సిటీ 11వ డివిజన్ వీఎల్ పు రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తనకు రూ.200 పింఛను ఇచ్చేవారని, టీడీపీ అధికారంలోకి వచ్చాక రెండేళ్ల నుంచి పింఛను ఇవ్వడం లేద ని 70 ఏళ్ల తమ్మరి నూకరాజు వాపోయాడు. తన కుమార్తెకు రేషన్‌కార్డు మంజూరుచేసి ఏడాదైనా, ఇప్పటి వరకూ రేషన్ ఇవ్వడం లేదని కోరుమిల్లి వరలక్ష్మి తల్లి బిక్కవోలు నూకాలమ్మ పేర్కొంది. ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెం గ్రామంలోని గొల్లపేటలో తనకు అర్హత ఉన్నా పింఛను ఇవ్వడం లేదని జ్యోతుల చక్రం తెలిపాడు. మరుగుదొడ్డికి రూ.3 వేలు వసూలు మండపేట నియోజకవర్గంలోని వెలగతోడులో స్వచ్ఛ మిషన్‌లో భాగంగా మరుగుదొడ్డి మంజూ రుకు రూ.మూడు వేలు వసూలు చేశారని గ్రామానికి చెందిన ఎల్.వరలక్ష్మి పేర్కొంది. రోడ్లు, డ్రెయిన్లు లేక ఇబ్బందులు పాలవుతున్నామని మాచర మట్టలుకు చెందిన శీలం రాంబాబు పేర్కొన్నారు. శివారు గ్రామం కావడంతో శ్రీరాంపురానికి అధికారులు ఎవరూ రావడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దాపురం మండలం కట్టమూరులో రాజుగారి బీడు ప్రాంతంలో కనీసం పంచాయతీ కుళాయిలు వేయడం లేదని భీమవరపు మంగ తెలిపింది. రోడ్లు అధ్వానంగా ఉన్నా పట్టించుకోవడం లేదని మురారిశెట్టి నారాయణరావు తెలిపాడు. పునాదుల్లో నిలిచిన నిర్మాణం ఎన్నికల్లో ఇల్లు ఇస్తామని చెప్పిన చంద్రబాబు ఇవ్వలేదని జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలంలో తండి కొండలో గొర్రెల కనకరత్నం తెలిపింది. రుణం మంజూరు చేయకపోవడంతో పునాదులతో ఇల్లు ఆగిపోయిందని పిల్లి అచ్చియమ్మ, మరుగుదొడ్లు మంజూరు చేయడం లేదని పిల్లి సాయమ్మ నిప్పులు చెరిగారు. తనకు రెండేళ్లుగా పింఛను ఇవ్వడంలేదని ముమ్మిడివరం నియోజకవర్గం అనాతవరంలో నవుండ్రు లక్ష్మణరావు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో గృహరుణం మంజూరు చేశారని, టీడీపీ ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయకపోవడంతో నిర్మాణం నిలిచిపోయిందని గోడ సత్యవతి విలపించింది.