breaking news
G raghava reddy
-
12న గణేష్ శోభాయాత్ర
సాక్షి, హైదరాబాద్: తొమ్మిది రోజుల పాటు కొలిచే గణనాథులకు ఘన వీడ్కోలు పలికేందుకు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఏర్పాట్లు చేస్తోంది. 12వ తేదీ ఉదయం 8 గంటలకు బాలాపూర్ వినాయకుని లడ్డూ వేలంతో శోభాయాత్ర కార్యక్రమాలు మొదలుకానున్నాయి. ఈ సంవత్సరం శోభాయాత్రకు ముఖ్య అతిథిగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘ్ చాలక్ (చీఫ్) మోహన్ భాగవత్ హాజరుకానున్నారని, స్వామి ప్రజ్ఞానంద యాత్రలో పాల్గొంటారన్నారు. శుక్రవారం భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు జి.రాఘవరెడ్డి, ప్రధాన కార్యదర్శి భగవంతరావు మీడియాతో మాట్లాడుతూ.. 12వ తేదీ ఉదయం 8 గంటలకు బాలాపూర్ లడ్డూ వేలం తర్వాత శోభాయాత్ర ప్రారంభం అవుతుందని.. చాంద్రాయణగుట్ట, షాలిబండ, చార్మినార్ మీదుగా సాగుతుందని తెలిపారు. యాత్రలో డీజేలు, సినిమా పాటలు, వికృత డాన్సులు చేయరాదని సూచించారు. దేశభక్తి, దైవభక్తి పెంపొందించేలా భజనలు, కీర్తనలు, హరికథలు, బుర్ర కథలు ఏర్పాటు చేయాలన్నారు. ప్లాస్టిక్ వాడరాదని, స్వచ్ఛత, శుభ్రత పాటించాలని, మండపాల వద్ద గ్రీనరీ ఉండేలా చూడాలన్నారు. సమితి ఆ«ధ్వర్యంలో ప్రతీ సంవత్సరం ఒక థీమ్ పెట్టుకుంటామని, ఈ యేడు జలియన్ వాలాబాగ్‌లో జరిగిన ఘటనను మననం చేసుకుంటూ ఊరేగింపు సాగాలన్నారు. ఊరేగింపులో గుర్తుతెలియని వ్యక్తులు ఏదైనా వదంతులు పుట్టిస్తే దాన్ని నమ్మరాదని సూచించారు. పోలీసులకు, ఉత్సవ కమిటీ సభ్యులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. యాత్రకు 40 లక్షల మంది వచ్చే అవకాశం ఉందని అన్నారు. వినాయక్‌సాగర్‌లో మహా హారతి.. కాశీ తరహాలో వినాయక్ సాగర్ (ట్యాంక్‌బండ్)లో కూడా మహా హారతి ఇవ్వాలని తాము ప్రతిపాదించగా ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని రాఘవరెడ్డి చెప్పారు. ప్రభుత్వంలోని అన్ని శాఖలు పూర్తిగా సహకరిస్తున్నాయని, యాత్ర పొడువునా నీరు ఏర్పాటు చేసేందుకు వాటర్‌వర్క్స్, లైట్ల ఏర్పాటుకు విద్యుత్ సంస్థ సిద్ధమైనట్లు తెలిపారు. -
గణేష్ ఉత్సవాల ఏర్పాట్లు సర్కారే చేపట్టాలి
హైదరాబాద్, న్యూస్‌లైన్: ఈ ఏడాది హైదరాబాద్‌లో 34వ గణేష్ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్షుడు జి.రాఘవరెడ్డి పేర్కొన్నారు. ఈ మహాయజ్ఞంలో ప్రతి హిందువు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 9 నుంచి18 వరకు హైదరాబాద్‌లో జరిగే గణేష్ ఉత్సవాల నిర్వహణ కోసం ఇక్కడి సిద్దిఅంబర్‌బజార్‌లోని బెహతీభవన్లో ఏర్పాటు చేసిన భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కార్యాలయాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు. తొలుత దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్లలో, కేథార్నాథ్, ఉత్తరాఖండ్ వరదల్లో, పాక్ సరిహద్దులో ప్రాణాలు కోల్పోయినవారికి, గతేడాది చనిపోయిన ఉత్సవ సమితి కార్యకర్తలకు నివాళులు అర్పించారు. అనంతరం రాఘవరెడ్డి మాట్లాడుతూ.. గణేష్ మండపాల నిర్వాహకులతో సెప్టెంబర్ 1న నిజాం కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆ సభకు వీహెచ్‌పీ వ్యవస్థాపక అధ్యక్షుడు అశోక్‌సింఘాల్, యూపీకి చెందిన చిన్మయానంద స్వామిజీతోపాటు రాష్ట్రంలోని ప్రధాన సాధు సంతులు హాజరవుతారన్నా రు. సమితి ప్రధాన కార్యదర్శి భగవంత్‌రావు మాట్లాడుతూ.. నగరంలో గణేష్ మండపాల నిర్వాహకులను పోలీసులు వేధిస్తున్నారని, హిందూ ఉత్సవాలపై పనిగట్టుకుని ఆంక్షలు విధిస్తున్నారని ఆరోపించారు. గణేష్ మండపాలకు ఉచితంగా కరెంట్ ఇవ్వాలని, ఉత్సవాల సందర్భంగా భక్తులకు అసౌకర్యం కల గకుండా ప్రభుత్వమే అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. బీజేపీ నేత బద్దం బాల్‌రెడ్డి, కార్పొరేటర్లు మెట్టు వైకుంఠం, ఆలె జితేందర్, టీడీపీ నేత జి.ఎస్.బుగ్గారావు, బీజేపీ నేత వై.కృష్ణ తదితరులు పాల్గొన్నారు.