breaking news
Future operating
-
పైసలిప్పించండి మహాప్రభో..!
తెలంగాణ ప్రభుత్వానికి సాగునీటి సబ్ కాంట్రాక్టర్ల మొర సాక్షి, హైదరాబాద్: బడా కాంట్రాక్టర్ల నుంచి సకాలంలో బిల్లులు అందక సబ్ కాంట్రాక్టర్లు అల్లాడిపోతున్నారు. ప్రధాన కాంట్రాక్టర్లు ప్రభుత్వం నుంచి బిల్లులు తీసుకున్నా, తమకు చెల్లించడంలో జాప్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తమగోడు తెలంగాణ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు శుక్రవారం సమావేశం కానున్నారు. భవిష్యత్ కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. భారీ వ్యయంతో నిర్మించతలపెట్టిన ప్రాణహిత-చేవెళ్ల, ఎస్సారెస్పీ స్టేజ్- 2, దేవాదుల, శ్రీపాద ఎల్లంపల్లి తదితర ప్రాజెక్టుల కింద కాంట్రాక్టులు దక్కించుకున్న ప్రధాన సంస్థలన్నీ 90 శాతం పనులను సబ్ కాంట్రాక్టర్లకే అప్పగించాయి. ఇప్పటికే వేల కోట్లల్లో పనులను పూర్తి చేశారు. కాంట్రాక్టర్ల నుంచి రావాల్సిన బకాయిలు సుమారు రూ.150కోట్ల నుంచి రూ.200ల కోట్ల వరకు ఉన్నాయని సబ్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నారాయణరెడ్డి తెలిపారు. -
18న జిల్లాకు టీపీసీసీ చీఫ్ రాక
- సార్వత్రిక ఫలితాలపై నేతలతో సమీక్ష - భవిష్యత్ కార్యాచరణపై కేడర్‌తో చర్చ - ఓటమికి కారణాలపై విశ్లేషణ సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ కమిటీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ఈనెల 18న జిల్లాకు రానున్నారు. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో జిల్లాకు రెండు సార్లు వచ్చారు. అంతకు ముందు భారీ నీటి పారుదలశాఖ మంత్రిగా జిల్లాలో పర్యటించినా.. టీపీసీసీ అధ్యక్షునిగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు పొన్నాల లక్ష్మయ్య మరోమారు జిల్లాకు వస్తున్నారు. జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు డి.శ్రీనివాస్, పి.సుదర్శన్‌రెడ్డి, మహ్మద్ షబ్బీర్ అలీ, కేఆర్ సురేశ్‌రెడ్డి తదితరులకు సమాచారం అందించిన పిదప జిల్లా పర్యటనకు సిద్ధమైనట్లు తెలిసింది. సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని విధంగా దెబ్బ తగిలింది. రెండు పార్లమెంట్, 9 అసెంబ్లీ స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకోగా, కాంగ్రెస్ రెండో లేదా మూడో స్థానంలో నిలిచింది. ఘోరపరాజయంపై తెలంగాణ జిల్లాల్లో ‘పోస్టుమార్టం’ నిర్వహిస్తున్న పొన్నాల లక్ష్మయ్య.. జిల్లాలోనూ పార్టీ ఓటమికి కారణాలను విశ్లేషించనున్నారు. ఈ మేరకు సీనియర్ నేతలతో పాటు ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలతో కూడా మాట్లాడి అభిప్రాయ సేకరణ చేయనున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఓటమిపై సమీక్షతో పాటు భవిష్యత్ కార్యాచరణను ఆయన పార్టీ శ్రేణులకు వివరించి కార్యకర్తల్లో నూతనోత్తేజాన్ని నింపనున్నారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.