breaking news
French President Francois Hollande
-
ట్రంప్‌ను అడ్డుకోకుంటే మనం మటాషే!
- అమెరికా, రష్యాల దోస్తీ ప్రమాదకరం - కలిసికట్టుగాఎదుర్కొందాం: ఈయూకు ఫ్రాన్స్ పిలుపు వలెటా: అగ్రరాజ్యానికి ఆప్తమిత్రులుగా కొనసాగుతున్న దేశాలు డొనాల్ట్ ట్రంప్ తీరుతో విసిగిపోయాయా? అమెరికాను, దాని కొత్త మిత్రుడు రష్యాను ధీటుగా ఎదుర్కొనేందుకు పూనుకుంటున్నాయా? అంటే అవుననే చెప్పాలి. ప్రపంచ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చివేసేలా.. మాల్టా రాజధాని వలెటాలో శుక్రవారం జరిగిన యురోపియన్ యూనియన్(ఈయూ) అనధికార సదస్సులో పలు కీలక తీర్మానాలను ప్రవేశపెట్టారు. రష్యాతో అమెరికా జతకట్టడం ప్రమాదఘంటిక లాంటిదని ఈయూ నేతలు అభిప్రాయపడ్డారు. ఈయూ సదస్సులో కీలక ప్రసంగం చేసిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే మరో అడుగు ముందుకేసి.. ట్రంప్ ప్రయోగిస్తోన్న ‘ఒత్తిడి’ని బలంగా అడ్డుకోకుంటే యూరప్ మనుగడలో లేకుండాపోయే ప్రమాదం వాటిల్లుతుందని హెచ్చరించారు. ట్రంప్‌ను ఎదుర్కొనే దిశగా ఈయూలోని 28 దేశాలూ ఒక్కతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. యూరప్ దేశాలు.. అమెరికా, రష్యాలపై ఆధారపడటం మానుకొని, సొంతగా రక్షణ, వ్యాపార సంబంధాలను బలోపేతం చేసుకోవాలని కోరారు. ఇవేవీ జరగని పక్షంలో యూరప్ విఛ్చితి ఖాయమని అభిప్రాయపడ్డారు. ‘నాటో నుంచి బయటికొస్తామని, రష్యాతో దోస్తీ చేస్తామని ట్రంప్ పదేపదే చెబుతున్నారు. మధ్యధరా నుంచి వచ్చే శరణార్థుల విషయంలో తీవ్ర నిర్ణయాలు తీసుకుంటూ యురప్పై ఒత్తిడి పెంచుతున్నారు. ఇలాంటి పలు అంశాల నేపథ్యంలో.. అమెరికా, రష్యాలు కలిసి యూరప్ దేశాలను విచ్ఛిన్నం చేస్తాయనే ఊహాగానాలు మొదలయ్యాయి. నిజం చెప్పాలంటే ఈ ఊహాగానాల్లో వాస్తవం లేకపోలేదు. మనం ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితులు మరింత తీవ్రతరమయ్యేరోజులు ఎంతో దూరంలోలేవు. అందుకే మనం కలిసికట్టుగా ఉందాం. ఒత్తడిని తరిమేద్దాం. నాటో లాంటివే సంయుక్త రక్షణ దళాలను ఏర్పాటుచేసుకుందాం. వాణిజ్య, వ్యాపార సంబంధాలను మెరుగుపర్చుకుందాం’ అని హోలాండే అన్నారు. కాగా, ఏడు ముస్లిం దేశాల పౌరులపై నిషేధం విషయంలో అమెరికా కోర్టుల భిన్న తీర్పులు ఇచ్చిన దరిమిలా ఈయూలోని కొన్ని దేశాలు ట్రంప్ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు కలిగిఉన్నాయని హొలాండే చెప్పుకొచ్చారు. ట్రిటీస్ ఆఫ్ రోమ్(రోమ్ కూటమి)60వ వార్షికోత్సవాలపైనా ఈ సదస్సులో తీర్మానాలు చేశారు. -
'సీఎంగారూ ఈ డబ్బులతో బూట్లు కొనుక్కోండి'
న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇచ్చిన విందు కార్యక్రమానికి చెప్పులతో హాజరైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు విశాఖపట్నానికి చెందిన ఓ వ్యాపార వేత్త రూ.364 పంపించారు. మున్ముందు రాష్ట్రపతితో జరిగే కార్యక్రమాల్లోనైనా ఆయన ఆ డబ్బులతో చక్కగా ఫార్మల్ బూట్లు కొనుక్కోని హాజరుకావాలని కోరారు. దీనికి సంబంధించి ఒక డీడీ కూడా పంపించారు. ఇటీవల జరిగిన గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ప్రాంకోయిస్ హోలాండ్ హాజరైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఓ విందు కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. ఆ కార్యక్రమానికి అరవింద్ కేజ్రీవాల్ శాండిల్స్, సాక్సు వేసుకొని వచ్చారు. దీనికి ఆశ్చర్యపోయిన విశాఖపట్నానికి చెందిన వ్యాపారావేత్త సుమిత్ అగర్వాల్ కేజ్రీవాల్‌ను ఫార్మల్ షూ కొనుక్కోవాల్సిందిగా కోరుతూ రూ.364 డీడీ తీసి పంపించారు. 'అది రాష్ట్రపతి భవన్లో ఒక గౌరవ విందు కార్యక్రమం.. ఆమ్ ఆద్మీ పార్టీ రామ్ లీలా మైదాన్లోనో, జంతర్ మంతర్లోనో నిర్వహించే ర్యాలీ కాదు, ధర్నా కాదు' అని ఆయన అన్నారు. పబ్లిక్ స్టంట్ కోసమే కేజ్రీవాల్ శాండిల్స్ వేసుకున్నారని ఆరోపించారు. దీంతోపాటు కేజ్రీవాల్‌కు ఒక బహిరంగ లేఖ రాశారు. 'కేజ్రీవాల్ గారు మీరు రాష్ట్రపతి భవన్లో ఇచ్చిన గౌరవ విందులో ఉన్నారు. అదేదో ఫ్రెండ్స్ బర్త్ డే పార్టీనో, రెస్టారెంటో కాదు. ఎవరు ఏం ధరించాలనే విషయం వ్యక్తిగత స్వేచ్ఛ అయి ఉండొచ్చు. కాని కొన్ని స్థలాలు వ్యక్తిగత స్వేచ్ఛకంటే గొప్పవి. మీరు చాలా ఎదిగిన వ్యక్తి. దయచేసి పరిస్థితికి, ఓ ప్రత్యేక కార్యక్రమానికి తగిన విధంగా నడుచుకోండి. మంచి దుస్తులు వగైరా ధరించండి' అని ఆ లేఖలో పేర్కొన్నాడు.