breaking news
Free credit card
-
లైఫ్‌టైమ్ జీరో బ్యాలెన్స్ అకౌంట్! డెబిట్, క్రెడిట్ కార్డులు కూడా...
BoB LITE Savings Account: బ్యాంక్ అకౌంట్ లేని వారికి, జీరో బ్యాలెన్స్ అకౌంట్ కావాల్సిన వారి కోసం ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda) సరికొత్త అకౌంట్‌ను అందిస్తోంది. బీఓబీ ప్రత్యేక పండుగ క్యాంపెయిన్‌లో భాగంగా ‘బీఓబీ లైట్ సేవింగ్స్ అకౌంట్’ పేరిట లైఫ్‌టైమ్ జీరో బ్యాలెన్స్ అకౌంట్‌ను ప్రకటించింది. ఈ అకౌంట్‌తో మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేకుండానే బ్యాంకింగ్ సేవలు పొందవచ్చని బ్యాంక్ ఆఫ్ బరోడా ఓ ప్రకటనలో పేర్కొంది. ఉచితంగా డెబిట్, క్రెడిట్ కార్డులు బీఓబీ లైట్ సేవింగ్స్ అకౌంట్‌తో పాటు కస్టమర్లు ఉచితంగా డెబిట్, క్రెడిట్ కార్డులు కూడా పొందవచ్చు. అయితే లైఫ్‌టైమ్ ఫ్రీ రూపే ప్లాటినమ్ డెబిట్ కార్డు కోసం సగటు త్రైమాసిక బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయాల్సి ఉంటుంది. అలాగే అర్హతను బట్టీ లైఫ్‌టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డు కూడా పొందవచ్చు. వీటితో పాటు మరిన్ని ఆఫర్లను కస్టమర్లకు బ్యాంక్ అందిస్తోంది. ఇప్పటికే వివిధ కన్జ్యూమర్ బ్రాండ్లతో ఒప్పందం చేసుకున్న బ్యాంక్ ఆఫ్ బరోడా.. డిసెంబర్ 31 వరకు వివిధ బ్రాండ్లపై ఆకర్షణీయమైన ఆఫర్లు అందిస్తోంది. రిలయన్స్ డిజిటల్, క్రోమా, మేక్ మై ట్రిప్, అమెజాన్, బుక్ మై షో, మింత్రా, స్విగ్గీ, జొమాటోలో కొనుగోళ్లపై స్పెషల్ ఆఫర్లు లభిస్తాయని బ్యాంక్ ఆఫ్ బరోడా ఓ ప్రకటనలో తెలిపింది. బీఓబీ లైట్ సేవింగ్స్ అకౌంట్ ప్రయోజనాలు ఇది లైఫ్‌టైమ్ జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్. 10 ఏళ్లు పైబడిన భారతీయ పౌరులెవరైనా ఈ కౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఉచితంగా రూపే ప్లాటినమ్ డెబిట్ కార్డు. ఇందు కోసం మెట్రో/అర్బన్‌లో రూ.3000, సెమీ అర్బన్‌లో రూ.2000, గ్రామీణ శాఖల్లో రూ.1000 త్రైమాసిక సగటు బ్యాలెన్స్ నిర్వహించాల్సి ఉంటుంది. అర్హత ఆధారంగా లైఫ్‌టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డు ఒక ఆర్థిక సవత్సరంలో ఉచితంగా 30 చెక్ లీవ్స్ -
డిపాజిట్‌తో క్రెడిట్‌కార్డు ఉచితం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వరంగ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిపాజిట్‌తో పాటు ఉచిత క్రెడిట్ కార్డును అందించే కొత్త డిపాజిట్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ‘సెంట్ అస్పైర్ డిపాజిట్ స్కీం’ పేరుతో ప్రవేశపెట్టిన ఈ పథకంలో డిపాజిట్ చేసిన మొత్తంలో 80 శాతం పరిమితితో కూడిన క్రెడిట్ కార్డును అందిస్తున్నట్లు సెంట్రల్ బ్యాంక్ ఆంధ్రా, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ఫీల్డ్ జనరల్ మేనేజర్ కె.ఈశ్వర్ తెలిపారు. ఈ కొత్త పథకాల వివరాలను తెలియచేయడానికి సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆదాయ ధ్రువీకరణ, సిబిల్ నివేదికలు అవసరం లేకుండానే క్రెడిట్ కార్డును అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్డుపై 55 రోజుల ఉచిత క్రెడిట్, ఆపైన నెలకు 1.5 శాతం వడ్డీని వసూలు చేయనున్నట్లు తెలిపారు. కనీస డిపాజిట్ మొత్తాన్ని రూ. 20,000గా నిర్ణయించారు. ఇదే సమయంలో ‘సెంట్ హోమ్ డబుల్ ప్లస్’ పేరుతో మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద 10.25% వడ్డీకే గృహ రుణం అందించడంతో పాటు, మంజూరై వాడుకోని గృహ రుణ మొత్తాన్ని ఓవర్ డ్రాఫ్ట్‌గా వినియోగించుకోవచ్చన్నారు. ఇది కాకుండా ఇతర అవసరాల కోసం గృహ రుణం మొత్తంపై 10% వరకు రుణం తీసుకునే వెసులుబాటును కల్పిస్తోంది. ఇలా అదనంగా ఇచ్చిన రుణంపై తీసుకున్న అవసరాన్ని బట్టి వడ్డీరేటు మారుతుందని ఈశ్వర్ తెలిపారు.