breaking news
four teams
-
భారత్ ‘ఎ’ ఓటమి
28 పరుగులతో ఆసీస్ ‘ఎ’ గెలుపు డార్విన్: నాలుగు జట్ల వన్డే టోర్నీని భారత్ ‘ఎ’ ఓటమితో ప్రారంభించింది. ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ‘ఎ’ 28 పరుగుల తేడాతో భారత్ ‘ఎ’పై నెగ్గింది. తొలుత ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. అలెక్స్ డూలన్ (101 బంతుల్లో 96; 9 ఫోర్లు, 1 సిక్స్), మిచెల్ మార్ష్ (62 బంతుల్లో 63; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) ధాటిగా ఆడారు. భారత బౌలర్లలో ధావల్ కులకర్ణి, మోహిత్ శర్మ చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం భారత్ 46.2 ఓవర్లలో 224 పరుగులకే ఆలౌటైంది. సంజు శామ్సన్ (98 బంతుల్లో 81; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) పోరాడినా ఫలితం లేకపోయింది. మంగళవారం జరిగే తదుపరి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ‘ఎ’తో భారత్ ‘ఎ’ ఆడుతుంది. -
భారత్ ‘ఎ’ కెప్టెన్లుగా తివారి, ఉతప్ప
ముంబై: వచ్చే నెలలో ఆస్ట్రేలియాలో పర్యటించనున్న భారత ‘ఎ’ జట్లకు రాబిన్ ఉతప్ప, మనోజ్ తివారి కెప్టెన్లుగా ఎంపికయ్యారు. ఆసీస్ పర్యటనలో భారత్ ‘ఎ’ రెండు నాలుగు రోజుల ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లతోపాటు నాలుగు జట్లు పాల్గొనే వన్డే టోర్నీలో ఆడనుంది. ఫస్ట్‌క్లాస్ జట్టుకు తివారి సారథ్యం వహించనుండగా, వన్డే జట్టు పగ్గాల్ని ఉతప్పకు అప్పగించారు. గత రంజీ సీజన్‌తోపాటు ఐపీఎల్-7లో రాణించిన పలువురు ఆటగాళ్లకు ఈ జట్లలో చోటు దక్కింది. జట్ల వివరాలు: నాలుగు రోజుల మ్యాచ్‌లకు జట్టు: మనోజ్ తివారి (కెప్టెన్), కె.ఎల్.రాహుల్, జీవన్‌జోత్ సింగ్, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, కరుణ్ నాయర్, నమన్ ఓజా, ప్రజ్ఞాన్ ఓజా, ఉమేశ్ యాదవ్, ధావళ్ కులకర్ణి, అనురీత్‌సింగ్, రజత్ పలివాల్, అమిత్ మిశ్రా, సందీప్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, బాబా అపరాజిత్. వన్డే జట్టు: రాబిన్ ఉతప్ప (కెప్టెన్), ఉన్ముక్త్, మనీశ్ పాండే, అంబటి రాయుడు, మనోజ్ తివారి, కేదార్ జాదవ్, సంజూ శామ్సన్, పర్వేజ్ రసూల్, అక్షర్ పటేల్, ధావళ్ కులకర్ణి, రిషి ధావన్, మోహిత్ శర్మ, కరణ్ శర్మ, రాహుల్ శుక్లా, మనన్ వోహ్రా, జైదేవ్ ఉనద్కట్.